కుప్పంలో పిఇఎస్ కళాశాల. చదువుతున్న విద్యార్థులకు గాంజా , డ్రగ్స్. పై అవగాహన కల్పిస్తున్న సిఐ మల్లేష్ యాదవ్ చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్‌ఐ నరేష్ రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.
కుప్పంలో పిఇఎస్ కళాశాల. చదువుతున్న విద్యార్థులకు గాంజా , డ్రగ్స్. పై అవగాహన కల్పిస్తున్న సిఐ మల్లేష్ యాదవ్ చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్‌ఐ నరేష్ రామకుప్పం ఎస్‌ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.
- Post by Rajinikanth1
- కదిరి డిపో ఉద్యోగుల సౌజన్యంతో జై జై భీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా॥ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి మహోత్సవం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. డాక్టర్ అంబేద్కర్ అందరి పాలిట దైవంసుడన్నారు. ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు నేడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కందికుంట అన్నదానం చేశారు.1
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్‌కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్‌కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్‌కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు1
- బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- చిత్తూరు జిల్లా,పంజాని పోలీస్ స్టేషన్14-04-2026రైస్ పుల్లింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పంజాని పోలీసులు. తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు తాలూకా, సూరంకుటై గ్రామానికి చెందిన B. శేఖర్ (60 సంవత్సరాలు) అనే వ్యక్తి 12-04-2026 తేదీన రాత్రి సుమారు 08.00 గంటలకు పంజాని పోలీస్ స్టేషన్‌కు హాజరై ఫిర్యాదు చేయగా, ఆరుగురు వ్యక్తులు “రైస్ పుల్లింగ్” చేస్తామని, తమ వద్ద ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, అనంతరం వారిపై అనుమానం రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. దీనిపై పంజాని పోలీస్ స్టేషన్‌లో Cr. No. 40/2026, U/Sec 318(4), 62 r/w 3(5) BNS కింద కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరశరాముడు ఆధ్వర్యంలో పంజాని పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. శ్రీ మారెప్ప సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టి, 13-04-2026 సాయంత్రం 5.30 గంటలకు పంజాని మండలం కొగిలేరు క్రాస్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలకు “రైస్ పుల్లింగ్”, “మ్యాజిక్ కాయిన్స్”, “పవర్ ఉన్న పాత నాణేలు”, “పారంపరిక వస్తువులు డబ్బు తీస్తాయి” వంటి మోసపూరిత మాటలు నమ్మకండి. ఇటువంటి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే అప్రమత్తమై, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి లేదా డయల్ 112 కి సమాచారం ఇవ్వాలి. అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు: A1 - కృష్ణప్ప @ గణపతి, కుంభారలపల్లి గ్రామం, V.కోట మండలం, చిత్తూర్ జిల్లా. A4 - ఎరుకుల విజయ్ కుమార్, మేకలచిన్నెపల్లి గ్రామము, చౌడేపల్లి మండలం, చిత్తూర్ జిల్లా. A5 - K.M. మునీష్, కురుగల్ గ్రామము, కొలార్ తాలూకా మరియు జిల్లా. A6 - షేక్ ఇలియాజ్, కమ్మేపల్లి గ్రామము, V.కోట మండలం, చిత్తూరు జిల్లా.పరారిలో ఉన్న ముద్దాయిలు: A2 – శంకర్, రాజులూరు గ్రామం, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లా. A3 - నాగరాజు, గౌనివారిపల్లి గ్రామం, పెద్ద పంజాణి మండలం, చిత్తూరు జిల్లా.1
- తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...1
- బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.1