Shuru
Apke Nagar Ki App…
వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఊరేగింపు సేవ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, మరియు సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.
P.srinu
వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఊరేగింపు సేవ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, మరియు సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్ పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్ ప్రభుత్వ అధికారులను కొట్టడం నాకు అలవాటే గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది లబ్ధిదారుల జాబితాలో అంతా నా నియోజకవర్గం వారు కాకుండా బయటివారే ఉన్నారు పాత బస్తీ ఎమ్మెల్యేల లాగ దౌర్జన్యం చేస్తేనే ఈ అధికారులు వింటారేమో అంటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నా * దానం నాగేందర్...1
- గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఎన్నికల్లో గ్యారంటీ ప్రాకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం, సెప్టెంబర్ 02 (ప్రజా ప్రతిభ): 100రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజుల పాలనా అయిన ఇచ్చిన అమిలు అమలు కాని ఆమిలపై బాకీ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాఅధ్యక్షులు జుబేర్ పాషా మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ ,మాజీ ఉపసర్పంచ్ బాబు గౌడ్ , సి ఎచ్ రాజయ్య , వార్డు సభ్యులు బాలెంకు శ్రీను,నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.2
- ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1
- నల్గొండలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన ..ధ్వజమెత్తిన భూపాల్ రెడ్డి _కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. హామీలు ఎక్కడ?_ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ ప్రదర్శన.. వెయ్యి రోజులు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ నిరసన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. వెయ్యి రోజులు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు... కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్న.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని నిలదీత! వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని అమలు చేయలేదని ఆరోపణ.. రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్... తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కంచర్ల విమర్శ... కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ జరగాలని వ్యాఖ్య... కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఏడు రోజుల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి... బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన... రేపు మిర్యాలగూడలో కేటీఆర్ సభ.. రైతులు, నిరుద్యోగులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కంచర్ల భూపాల్‌రెడ్డి విజ్ఞప్తి... కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపు... *నల్లగొండ మాజీ ఎమ్మెల్యే-కంచర్ల భూపాల్ రెడ్డి..*👆🏻1
- Finding the right job can feel overwhelming. THE DIGITAL NEWS JOBS Finding the right job can feel overwhelming. 😔💼 But what if opportunities were easier to explore? No endless registrations. No unnecessary login barriers. THE DIGITAL NEWS JOBS helps job seekers explore opportunities simply and easily. 🚀 Your next opportunity could be waiting where you least expect it! 👀 Comment 🔥 if you're ready for your next opportunity!1
- కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు 1000 రోజుల రేవంత్ రెడ్డి పాలన క్రిమినల్ వేస్ట్ అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి అనే నాలుగు తలల విషసర్పపు పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన దేశంలోనే అన్ని రంగాల్లో విఫలమైన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన ఒక్కటే – బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్1
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నా.. మల్లారెడ్డి డాన్స్‌తో కార్యకర్తల్లో జోష్ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో వైఫల్యాలు, అమలు కాని హామీలను నిరసిస్తూ బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కార్యకర్తలు, ప్రజలను ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి డాన్స్‌తో నిరసన ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆయన నృత్యాలతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మల్లారెడ్డి డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, పాలనా వైఫల్యాలపై నిరసన కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.1
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ఈనెల 6న సీఎం సమక్షంలో సమావేశం...మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఆది శ్రీనివాస వెల్లడి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులను సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలయ విస్తరణ పనులు ఇప్పటివరకు జరిగిన పనులపై చర్చించామని, త్వరలో జరగబోయే పనులపై చర్చించి, ఈనెల 6న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అనంతరం టెండర్ల ప్రక్రియకు వెళ్తామన్నారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి మరో సమావేశంలోగా రాజన్న దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు నిధులు మంజూరు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం...భార్య అత్త పై కత్తితో దాడి చేసిన భర్త...భార్య మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం జరిగింది. భార్య, ఆమే తల్లి పై కత్తితో భర్త సురేష్ దాడి చేశారు. భార్య జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అత్త ఎల్లవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. సురేష్, జ్యోతి కి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వివాహం కాగా గత ఏడు నెలలుగా తల్లిగారింట్లోనే జ్యోతి ఉంటున్నారు. జ్యోతి ఆమె తల్లి ఎల్లవ్వ ఇద్దరు ఆసుపత్రి వెళ్ళే క్రమంలో పదిర వద్ద రోడ్డుపైనే కారులో వచ్చి భర్త సురేష్ కత్తితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన జ్యోతికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ సిరిసిల్ల స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.4