ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
- 22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.1
- ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే * మాజీ మంత్రి జీవన్ రెడ్డి1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- 1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2
- రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన మెదక్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పార్టీ పిలుపులో భాగంగా రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- సీఎం సొంత జిల్లాలోనే ట్రాఫిక్ నిబంధనలకు తూట్లు.. వీడియో వైరల్1
- ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1