1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఊరేగింపు సేవ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, మరియు సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.1
- పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్ పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా నేను కూడా దాడి చేయడానికి రెడీ ప్రభుత్వ అధికారులపై మరోసారి ఫైర్ అయిన దానం నాగేందర్ ప్రభుత్వ అధికారులను కొట్టడం నాకు అలవాటే గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది లబ్ధిదారుల జాబితాలో అంతా నా నియోజకవర్గం వారు కాకుండా బయటివారే ఉన్నారు పాత బస్తీ ఎమ్మెల్యేల లాగ దౌర్జన్యం చేస్తేనే ఈ అధికారులు వింటారేమో అంటే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నా * దానం నాగేందర్...1
- 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై మహా నిరసన ధర్నా 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై బుధవారం మహా నిరసన ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్నాకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి బొక్క నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. 22ఏ జాబితా కారణంగా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారిపైకి చేరడంతో కొంతసేపు నిరసన వాతావరణం నెలకొంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.1
- ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1
- ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే * మాజీ మంత్రి జీవన్ రెడ్డి1
- *ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలిరాష్ట్రస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య *ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి* *ఎస్సి, ఎస్టీ కేసుల రహిత జిల్లాగా తీర్చి దిద్దాలి* *పౌరహక్కుల దినోత్సవాన్ని తప్పకుండా నిర్వహించాలి* ఎస్సి,ఎస్టీ ఉద్యోగులతో సానుకూలంగా వ్యవహరించాలి మానవీయ ఎకోణంలో సేవలు అందించాలి రాష్ట్రస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీలో సమీక్ష సమావేశం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభ్యున్నతికి అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యుడు కే.లక్ష్మి నారాయణ లుజిల్లా పర్యటనకు రాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ డివి శ్రీనివాసరావు స్వాగతం పలికి.. పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్పీ శ్రీనివాసరావు, కమిషన్ సభ్యుడు కే .లక్ష్మీ నారాయణ తో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పథకాల అమలు, సంక్షేమం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న పథకాలు, సంక్షేమం, అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, కులాంతర వివాహాల ఆర్థిక చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ కార్డు కలిగిఉన్న ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న పని వివరాలను అధికారుల ద్వారా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఛార్జ్ షీట్ దాఖలు వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదయిన కేసుల దర్యాప్తు త్వరితగతిన, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారం అందేవిధంగా చూడాలని వివరించారు. ప్రతినెలా చివరి వారంలో మండలాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ సమావేశాల్లో పాల్గొని, ప్రజల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు, చట్టాల గురించి అవగాహన కల్పించాలని వివరించారు. ప్రజలకు మానవీయ కోణంలో సేవలు అందించాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఏవైనా అభివృద్ధికి సంబంధించి నిధులు పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల అయ్యేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల అభ్యున్నతితో పాటు, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లోని పారిశుధ్య కార్మికులకు ఎస్ బీ ఐ బ్యాంక్ ఖాతాలు తీయించాలని, దీంతో కార్మికులకు భీమా సౌకర్యం ఉందని తెలిపారు. *జిల్లా కలెక్టర్ కు అభినందన* జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సేవలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అభినందించారు. జిల్లా కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలకు అందిస్తున్న ఉత్తమ సేవలను కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారుల సేవలను అభినందించారు. *కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం* ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు క్షేత్రస్థాయిలో అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పాఠశాల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ, ప్రతి రోజూ కామన్ మెనూ అమలు చేస్తూ విద్యా బోధన సాగిస్తున్నా మన్నారు. అన్ని విద్యాలయాల్లో ప్రత్యేక అధికారులను నియమించి తనిఖీ చేయిస్తూ.. విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చూస్తున్నామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటిక ప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, కులాంతర వివాహాల ఆర్థిక సహకారం, అంబేద్కర్ ఓవర్సీస్ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలు తెలియజేశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. వివిధ దశల్లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం కలిగేలా చూస్తామని అన్నారు. కేసుల దర్యాప్తు పారదర్శకంగా చేపడతామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంబదాసు రాజేశ్వర్ , డీఎఫ్ఓ జో జి,జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్డీఓలు రమాదేవి, బవయ్య , రామకృష్ణ లు, డీఎస్పీలు ప్రసన్నకుమార్ , నరేందర్ , వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు సింధు, విజయ లక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు,వివిధ సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు, ఇతర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు 1000 రోజుల రేవంత్ రెడ్డి పాలన క్రిమినల్ వేస్ట్ అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి అనే నాలుగు తలల విషసర్పపు పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన దేశంలోనే అన్ని రంగాల్లో విఫలమైన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన ఒక్కటే – బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్1
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నా.. మల్లారెడ్డి డాన్స్‌తో కార్యకర్తల్లో జోష్ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో వైఫల్యాలు, అమలు కాని హామీలను నిరసిస్తూ బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కార్యకర్తలు, ప్రజలను ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి డాన్స్‌తో నిరసన ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆయన నృత్యాలతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మల్లారెడ్డి డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, పాలనా వైఫల్యాలపై నిరసన కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.1
- బిఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటి ఇంటికీ పంపిణీ చేసారు.బుధవారం ఈ సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు,హామీల అమలు కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1