logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే * మాజీ మంత్రి జీవన్ రెడ్డి

4 hrs ago
user_Sangareddy News
Sangareddy News
Local News Reporter Saidabad, Hyderabad•
4 hrs ago

ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే * మాజీ మంత్రి జీవన్ రెడ్డి

More news from Hyderabad and nearby areas
  • ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే * మాజీ మంత్రి జీవన్ రెడ్డి
    1
    ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి
ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి
కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు
మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే
* మాజీ మంత్రి జీవన్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    4 hrs ago
  • 22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.
    1
    22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్
నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన మెదక్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పార్టీ పిలుపులో భాగంగా రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన 
మెదక్ పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పార్టీ పిలుపులో భాగంగా రాందాస్ చౌరస్తాలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • కేశంపేట:పాటిగడ్డలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి కానుక కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలో నిరుపేద కుటుంబానికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారు పాపకంటి శిరీష శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్, గ్రామ సర్పంచ్ అకిల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, నిర్ధవెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారుల కుటుంబాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
    1
    కేశంపేట:పాటిగడ్డలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి కానుక
కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలో నిరుపేద కుటుంబానికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారు పాపకంటి శిరీష శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్, గ్రామ సర్పంచ్ అకిల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, నిర్ధవెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారుల కుటుంబాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
    user_S M S
    S M S
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు 
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం
సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000,  లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • 1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    2
    1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం*

*ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి

1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Errolla Babu
    Errolla Babu
    Farmer గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్‌, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్
కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్‌, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.