Shuru
Apke Nagar Ki App…
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
SREEYAN
శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1
- గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఎన్నికల్లో గ్యారంటీ ప్రాకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం, సెప్టెంబర్ 02 (ప్రజా ప్రతిభ): 100రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజుల పాలనా అయిన ఇచ్చిన అమిలు అమలు కాని ఆమిలపై బాకీ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాఅధ్యక్షులు జుబేర్ పాషా మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ ,మాజీ ఉపసర్పంచ్ బాబు గౌడ్ , సి ఎచ్ రాజయ్య , వార్డు సభ్యులు బాలెంకు శ్రీను,నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.2
- కేశంపేట:పాటిగడ్డలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి కానుక కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలో నిరుపేద కుటుంబానికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారు పాపకంటి శిరీష శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుమగల్ల రమేష్, గ్రామ సర్పంచ్ అకిల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, నిర్ధవెళ్లి సర్పంచ్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారుల కుటుంబాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1
- ఈరోజు ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం ఆలయ ఈవో మెదక్ జిల్లాలో స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం వెకువ జమున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జిల్లాలతో. అభిషేకం నిర్వహించారు పట్టు వస్త్రాలంకరణ పసుపు కుంకుమల అందంగా అలంకరించారు వివిధ రకాల పుష్పాలచే పూల మాలలు ధరింపజేశారు కుంకుమార్చన సహస్రనామార్చన అనంతరం మంగళహారతి చారు నిత్య నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు దివ్యదర్శనం కలిగించారు1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నా.. మల్లారెడ్డి డాన్స్‌తో కార్యకర్తల్లో జోష్ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో వైఫల్యాలు, అమలు కాని హామీలను నిరసిస్తూ బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కార్యకర్తలు, ప్రజలను ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి డాన్స్‌తో నిరసన ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆయన నృత్యాలతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మల్లారెడ్డి డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, పాలనా వైఫల్యాలపై నిరసన కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.1
- వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఊరేగింపు సేవ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, మరియు సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.1
- సీఎం సొంత జిల్లాలోనే ట్రాఫిక్ నిబంధనలకు తూట్లు.. వీడియో వైరల్1
- గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య. ఆలస్యంగా గమనించిన హాస్టల్ సిబ్బంది, టీచర్లు.. షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి....1