Shuru
Apke Nagar Ki App…
గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య. ఆలస్యంగా గమనించిన హాస్టల్ సిబ్బంది, టీచర్లు.. షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి....
ఏబ్బనూర్ అంజిలయ్య
గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య. ఆలస్యంగా గమనించిన హాస్టల్ సిబ్బంది, టీచర్లు.. షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి....
More news from తెలంగాణ and nearby areas
- 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై మహా నిరసన ధర్నా 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై బుధవారం మహా నిరసన ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్నాకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి బొక్క నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. 22ఏ జాబితా కారణంగా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారిపైకి చేరడంతో కొంతసేపు నిరసన వాతావరణం నెలకొంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.1
- ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1
- ఈరోజు ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం ఆలయ ఈవో మెదక్ జిల్లాలో స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం వెకువ జమున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జిల్లాలతో. అభిషేకం నిర్వహించారు పట్టు వస్త్రాలంకరణ పసుపు కుంకుమల అందంగా అలంకరించారు వివిధ రకాల పుష్పాలచే పూల మాలలు ధరింపజేశారు కుంకుమార్చన సహస్రనామార్చన అనంతరం మంగళహారతి చారు నిత్య నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు దివ్యదర్శనం కలిగించారు1
- వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో విఫలం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు బీఆర్ఎస్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజం బాన్సువాడ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2,500 సాయం ఎక్కడ? మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. బాన్సువాడ బస్టాండ్ పరిసరాల్లోని దుకాణదారులు, పెళ్లయిన మహిళలు, వృద్ధులు తదితరులను కలిసి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలు తెలుసుకున్నామని, పలువురు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాగోలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా హామీని విస్మరించారు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బాజిరెడ్డి విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వృద్ధుల పింఛన్ రూ.4 వేలకు పెంపు ఏమైంది? వృద్ధులకు పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జుబేర్ ,మోరిల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, రమేష్, రత్నకుమార్, ధర్మతేజ, నవీన్ , సాయిలు, మోచి గణేష్, బాడీ శ్రీను, చందర్, ఖలీల్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.4
- 1000 పైగా పది పైసల నాణాలతో వైఎస్సార్ అద్భుత చిత్రం* *ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు ఘన నివాళి 1988 నాటి చిన్న పది పైసల నాణాలను 1000కి పైగా ఉపయోగించి, బుధవారం నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ చిత్రాన్ని వినూత్నంగా రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. రంగులు, పెయింట్లకు భిన్నంగా నాణాలతో వైఎస్సార్ చిత్రాన్ని ఆవిష్కరించడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. “వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడు. అలాంటి మహానేత జ్ఞాపకాన్ని వినూత్న కళారూపంలో నిలపాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించాను” అని రామకోటి రామరాజు తెలిపారు. వేల నాణాలు, గంటల తరబడి శ్రమ, అపారమైన సహనం, వీటి సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ వైఎస్సార్ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల తో రూ.6,84,980, కార్ పార్కింగ్ తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ధర్నా.. మల్లారెడ్డి డాన్స్‌తో కార్యకర్తల్లో జోష్ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో వైఫల్యాలు, అమలు కాని హామీలను నిరసిస్తూ బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధర్నాలో పాల్గొన్న ఆయన ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కార్యకర్తలు, ప్రజలను ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి డాన్స్‌తో నిరసన ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆయన నృత్యాలతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. మల్లారెడ్డి డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, పాలనా వైఫల్యాలపై నిరసన కార్యక్రమాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.1
- గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఎన్నికల్లో గ్యారంటీ ప్రాకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం, సెప్టెంబర్ 02 (ప్రజా ప్రతిభ): 100రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజుల పాలనా అయిన ఇచ్చిన అమిలు అమలు కాని ఆమిలపై బాకీ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాఅధ్యక్షులు జుబేర్ పాషా మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ ,మాజీ ఉపసర్పంచ్ బాబు గౌడ్ , సి ఎచ్ రాజయ్య , వార్డు సభ్యులు బాలెంకు శ్రీను,నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.2
- వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఊరేగింపు సేవ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ పురవీధుల గుండా ఊరేగింపు సేవను నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణానికి ముందు, మరియు సాయంత్రం మొక్కు జోడు సేవ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఊరేగిస్తూ సేవ పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు.1