Shuru
Apke Nagar Ki App…
ఈరోజు ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం ఆలయ ఈవో మెదక్ జిల్లాలో స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం వెకువ జమున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జిల్లాలతో. అభిషేకం నిర్వహించారు పట్టు వస్త్రాలంకరణ పసుపు కుంకుమల అందంగా అలంకరించారు వివిధ రకాల పుష్పాలచే పూల మాలలు ధరింపజేశారు కుంకుమార్చన సహస్రనామార్చన అనంతరం మంగళహారతి చారు నిత్య నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు దివ్యదర్శనం కలిగించారు
మెదక్ న్యూస్
ఈరోజు ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దివ్యదర్శనం ఆలయ ఈవో మెదక్ జిల్లాలో స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం వెకువ జమున ఆలయ పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంజీరా నది జిల్లాలతో. అభిషేకం నిర్వహించారు పట్టు వస్త్రాలంకరణ పసుపు కుంకుమల అందంగా అలంకరించారు వివిధ రకాల పుష్పాలచే పూల మాలలు ధరింపజేశారు కుంకుమార్చన సహస్రనామార్చన అనంతరం మంగళహారతి చారు నిత్య నైవేద్యం సమర్పించారు అనంతరం భక్తులకు దివ్యదర్శనం కలిగించారు
More news from తెలంగాణ and nearby areas
- 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై మహా నిరసన ధర్నా 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారిపై బుధవారం మహా నిరసన ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్నాకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి బొక్క నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. 22ఏ జాబితా కారణంగా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారిపైకి చేరడంతో కొంతసేపు నిరసన వాతావరణం నెలకొంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.1
- గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఎన్నికల్లో గ్యారంటీ ప్రాకారం ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం, సెప్టెంబర్ 02 (ప్రజా ప్రతిభ): 100రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజుల పాలనా అయిన ఇచ్చిన అమిలు అమలు కాని ఆమిలపై బాకీ కార్డుల పంపిణీలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాఅధ్యక్షులు జుబేర్ పాషా మరియు బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ ,మాజీ ఉపసర్పంచ్ బాబు గౌడ్ , సి ఎచ్ రాజయ్య , వార్డు సభ్యులు బాలెంకు శ్రీను,నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.2
- కారు మబ్బుల కనిపించనీ మేఘాలు వర్ష సూచన లేదు కప్పటాలియ్ ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు వర్షకనిపించడం లేదు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎదిరిచూపులు వర్షం రాదు పంట పండదు అన్నదాతకు అన్ని కష్టాలే వ3
- తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేలా రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు ఆయన సేవలను, ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్న నేతలు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగము,ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పర్శరం,ఆరేపల్లి బాలు,రాములు,సర్పంచ్ సాధి,చుక్క శేఖర్,బైరివేని రాము,బండి పర్శరం, బాలసాని శ్రీనివాస్, భాను,హారిక,మిరాల శ్రీనివాస్, రాజేశ్వరరావు, చందు, మల్లేశం, సందీప్,జలందర్ రెడ్డి, ప్రశాంత్, చోటు, గణేష్, భారత్, తిరుపతి, శ్యామ్, కిషన్, గణేష్,రాజిరెడ్డి,చందు,యోగి తదితరులు పాల్గొన్నారు3
- సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.1
- 22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.1
- సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం. సైబర్ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం. సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు.అనంతరం ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు.సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మ వద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల తో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. వినాయకుడి బోధనలతో సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించడం జరిగింది. జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన. విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.4
- *రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్‌బహదూర్ శాస్త్రి నగర్‌లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్‌పాస్‌లు, అండర్‌బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్‌ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1