*రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి
ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- *రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. *రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. *చిత్తశుద్ధితో పనులు చేయాలి* రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. *ఉన్నతాధికారుల సూచనల మేరకు..* . ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టడంతో పాటు ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామివారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరై, టెండర్లు పూర్తయిన పనులతో పాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చించామని, ప్రతి పనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పనులను డే అండ్ నైట్ కొనసాగిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనుల పురోగతిని సమీక్షించడం, ప్రతి నెలా ఒకసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించడం ద్వారా పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.పేదల పెన్నిధిగా, భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇంచార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు తెలిపారు.దాదాపు 3 నుంచి 4 గంటల పాటు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, భవిష్యత్‌లో చేపట్టాల్సిన మార్పులు, మౌలిక వసతులపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు రూ.99.40 కోట్లతో చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయని, వాటికి నిర్దిష్ట గడువులు విధించి త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలపై చర్చించామని వివరించారు. బద్ధి పోచమ్మ ఆలయం తదితర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించామని తెలిపారు. ఈ అంశాలపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటీ ఏడీ ఏ వైస్ చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ, తరచూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వులు తీసుకురావడంలో చొరవ చూపుతున్నారని తెలిపారు.భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుతమైన కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్ యాంఫిథియేటర్లు, పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ లో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యంలో తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. చిత్తశుద్ధితో పనులు చేయాలి రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా.. అందరూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశించారు. త్వరలో మరో మీటింగ్ పెడతామని వివరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీఏడీఏ వైస్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆలయ పనులపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేయిస్తున్నామని వివరించారు. ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.సమీక్ష సమావేశంలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.2
- సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.1
- డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- కవితమ్మ మీద సోషల్ మీడియా లో అనుచిత పోస్టలు పెట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలి.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ పెట్టిన వారిమీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ లోని ఒకటోవ పోలిస్ స్టేషన్ లో జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో పోలిసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కవితమ్మ మీద సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, మరియు X (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపులలో అత్యంత అసభ్యకరమైన, అవమానకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె అనిల్ మీద తక్షణమే చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడం జరిగిందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళ నాయకురాలి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి కవితమ్మ గౌరవాన్ని ప్రతిష్టను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళలోకానికి జరిగిన అవమానంగా భావించాలని. కానిస్టేబుల్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు అన్నారు. పవిత్రమైన పోలిస్ ఉద్యోగంలో ఉన్న అనిల్ ప్రజలకు చట్టపరంగా రక్షణ, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఈ విధంగా ఒక మహిళా రాజకీయ నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం పైన అతడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవ్వరూ అనేది కూడ తేల్చాలి. పోలీస్ శాఖ కూడ అతడి మీద శాఖాపరమైన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, మనకోండుర్ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా పార్టీ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, యండి హుస్సేన్, యండి రాజీ, మడిపల్లి వినీత్, బాండారి అభిరామ్, జిల్లా మహిళ నాయకురాలు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ అకాష్ తదితరులు పాల్గొన్నారు.1
- కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థుల బస్ సమస్యకు పరిష్కారం చూపిన కోరుట్ల ఏమ్మెల్యే రెండు రోజుల క్రితం బస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ధర్నా నిర్వహించగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ వెంటనే స్పందించారు. కోరుట్ల ఆర్టీసీ ఆర్ఎం, డీఎంతో మాట్లాడి విద్యార్థుల కోసం అదనంగా బస్‌ను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు… ఈ మేరకు ఈరోజు అదనపు బస్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా విద్యార్థులతో కలిసి కోరుట్ల నుంచి కల్లూరు మోడల్ స్కూల్ వరకు బస్‌లో ప్రయాణించారు… విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి బస్ సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే సంజయ్ గారికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ గారు తెలిపారు..1
- జన్న సిరిసిల్ల జిల్లా. *సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.* *సైబర్ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.* *సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. *వినాయకుడి బోధనలతో సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. *జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.* విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. *ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...* “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం...భార్య అత్త పై కత్తితో దాడి చేసిన భర్త...భార్య మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం జరిగింది. భార్య, ఆమే తల్లి పై కత్తితో భర్త సురేష్ దాడి చేశారు. భార్య జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అత్త ఎల్లవ్వకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. సురేష్, జ్యోతి కి ఏడు సంవత్సరాల క్రితం జరిగిన వివాహం కాగా గత ఏడు నెలలుగా తల్లిగారింట్లోనే జ్యోతి ఉంటున్నారు. జ్యోతి ఆమె తల్లి ఎల్లవ్వ ఇద్దరు ఆసుపత్రి వెళ్ళే క్రమంలో పదిర వద్ద రోడ్డుపైనే కారులో వచ్చి భర్త సురేష్ కత్తితో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన జ్యోతికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు సురేష్ సిరిసిల్ల స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.4