విజయనగరం జిల్లా మెంటాడ మండలం టిడిపి ఎంపీపీగా చలుమూరి వెంకట్రావు.. మెంటాడ ఎంపిపిగా 'చలుమూరి' విజయనగరం జిల్లా మెంటాడమండలంలోని 13 ఎంపిటిసి స్థానాలకు గాను టిడిపి 9 స్థానాలు జనసేన ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపిపి స్థానం గత 15 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషిచేసిన టిడిపి మండల అధ్యక్షుడిగా చలుమూరు వెంకటరావుకు దక్కేలా ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం గెలుపొందిన ఎంపిటిసిలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీపై ఉన్న అభిమానంతో తమకు ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎనలేని కృషి చేస్తామని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపిటిసిలంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఇప్పటివరకు వైస్ ఎంపిపి పదవి విషయం తేలలేదని అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికే ఆ పదవిని కేటాయిస్తామని చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు మాట్లాడుతూ రానున్న పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో 31 గ్రామ పంచాయతీలో పార్టీ సభ్యులు విజయ ఢంకా మోగించాలన్నారు. గ్రామాలలో పట్టింపులకు పోకుండా ప్రజలు ఏ వ్యక్తిపై మొగ్గు చూపుతారో వారిని సర్పంచ్ బరిలో దింపాలని కూటమి సభ్యులంతా ఐకమత్యంగా చర్చించుకుని గెలుపే ముఖ్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో అధికార ప్రతినిధి గొర్లె ముసలినాయుడు, జిల్లా ప్రాదేశిక సభ్యులు గుమ్మడి నారాయణమ్మ, ఎంపిటిసిలు పాండ్రంకి సత్యవతి దేవి, పరదేశి రమ్య, కొనిశ విష్ణు గోవింద, ఆరంగి శంకర్రావు, అంటిపర్తి అజయ్ కుమార్, సారిక పైడిరాజు, తాటిపూడి రామకృష్ణ, బాయి వెంకట్రావు, పార్టీ నాయకులు సిరిపురం గురునాయుడు, రెడ్డి ఆదినారాయణ, సూరెడ్డి కృష్ణమూర్తి, చొక్కాకు సన్యాసినాయుడు, పడాల గంగునాయుడు, పల్లి సింహాద్రి పాల్గొన్నారు.

- విజయనగరం జిల్లా మెంటాడ మండలం టిడిపి ఎంపీపీగా చలుమూరి వెంకట్రావు.. మెంటాడ ఎంపిపిగా 'చలుమూరి' విజయనగరం జిల్లా మెంటాడమండలంలోని 13 ఎంపిటిసి స్థానాలకు గాను టిడిపి 9 స్థానాలు జనసేన ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపిపి స్థానం గత 15 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషిచేసిన టిడిపి మండల అధ్యక్షుడిగా చలుమూరు వెంకటరావుకు దక్కేలా ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం గెలుపొందిన ఎంపిటిసిలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీపై ఉన్న అభిమానంతో తమకు ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎనలేని కృషి చేస్తామని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపిటిసిలంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఇప్పటివరకు వైస్ ఎంపిపి పదవి విషయం తేలలేదని అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికే ఆ పదవిని కేటాయిస్తామని చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు మాట్లాడుతూ రానున్న పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో 31 గ్రామ పంచాయతీలో పార్టీ సభ్యులు విజయ ఢంకా మోగించాలన్నారు. గ్రామాలలో పట్టింపులకు పోకుండా ప్రజలు ఏ వ్యక్తిపై మొగ్గు చూపుతారో వారిని సర్పంచ్ బరిలో దింపాలని కూటమి సభ్యులంతా ఐకమత్యంగా చర్చించుకుని గెలుపే ముఖ్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో అధికార ప్రతినిధి గొర్లె ముసలినాయుడు, జిల్లా ప్రాదేశిక సభ్యులు గుమ్మడి నారాయణమ్మ, ఎంపిటిసిలు పాండ్రంకి సత్యవతి దేవి, పరదేశి రమ్య, కొనిశ విష్ణు గోవింద, ఆరంగి శంకర్రావు, అంటిపర్తి అజయ్ కుమార్, సారిక పైడిరాజు, తాటిపూడి రామకృష్ణ, బాయి వెంకట్రావు, పార్టీ నాయకులు సిరిపురం గురునాయుడు, రెడ్డి ఆదినారాయణ, సూరెడ్డి కృష్ణమూర్తి, చొక్కాకు సన్యాసినాయుడు, పడాల గంగునాయుడు, పల్లి సింహాద్రి పాల్గొన్నారు.1
- విజయనగరం: శ్రీ పైడితల్లమ్మ దర్శనానికై బారులు తీరిన భక్తులు.. విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ దేవస్థానం నందు మంగళవారం భక్తులు బారులు తీరారు. దేవాలయానికి ఇరువైపులా భక్తులు దర్శనార్థమై షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్ ల చిరు వ్యాపారులు ఆక్రమణలు చేసి భక్తులకు షెల్టర్ ల వెళ్లే విధంగా లేకుండా ఇబ్బందులు పాలు చేశారు. దీంతో భక్తులు ఎండలనే అమ్మవారి దర్శనానికై క్యూ లైన్ కట్టి ఇబ్బందులు పడ్డారు.1
- కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులకు 41 రోజుల పాటు ఉచిత అన్నదానం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రసాద వితరణ ప్రారంభించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల విజయనగరం, నవంబర్ 9: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన 41 రోజుల ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు.1
- బాపూజీ కళామందిరంలో అలరించిన 'స్వర వంశధార' సినీ సంగీత విభావరి... శ్రీకాకుళం : కళలకు పుట్టినిల్లు సిక్కోలు గడ్డ అని, ఇక్కడి కళాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. స్థానిక బాపూజీ కళామందిరంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో 'స్వర వంశధార' సినీ సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అతిథులు, నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిక్కోలు నేలలో సంగీత ప్రియులకు, కళాకారులకు కొదవలేదని కొనియాడారు. ఇక్కడి నుంచి ఎందరో కళాకారులు ఉన్నత స్థానాలకు ఎదిగి జిల్లా ఖ్యాతిని చాటారని గుర్తుచేశారు. మధురమైన సినీ గీతాలతో శ్రోతల మనసులను ముగ్ధులను చేయడం ఒక అరుదైన కళ అని పేర్కొంటూ, కార్యక్రమాన్ని విజయవంతంగా తీర్చిదిద్దిన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు లయన్ నటుకుల మోహన్ బృందంతో పాటు నిర్వాహకులు బగాది కూర్మారావు, పైడి హరిప్రసాద్ల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్, జోన్ చైర్మన్ డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ.. స్థానిక కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే జీవనది ప్రేరణతో 'స్వర వంశధార' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బిజీ షెడ్యూల్లోనూ కార్యక్రమానికి విచ్చేసి తమకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో తమ గాత్ర ఆధ్వర్యంలో శ్రోతలను అలరించిన కళాకారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు2
- సింహాచలం: కనుల పండువగా గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం....శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.అర్చకులు గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేశారు.ఉత్సవంలో వేద పండితులు వేద విన్నపాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరువీధిలో పాల్గొన్నారు.1
- నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.1
- కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..? సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.1
- విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు మాట్లాడుతూ కూటమి ఘనవిజయం చేకూర్చిన అందరికీ ధన్యవాదములు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. విజయనగరం జిల్లా తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో టీడీపీ నాయకులు మాట్లాడుతూ..కూటమి ఘన విజయం చేకూర్చిన అందరికి ధన్యవాదములు. తెలియ జేస్తూ కొన్ని సీట్లు కూటమి సర్దుబాట్లు,, సమన్యయం లోపంవల్ల స్వల్ప ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యము అని కూటమి నాయకులు తెలిపారు. నిర్వహించిన పత్రికా సమావేశంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గ జడ్పీ మాజీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా ,కూటమి పార్టీల శ్రేణులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి, చిన్న శ్రీను, నాగార్జున ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.అయితే కూటమి సమన్వయ లోపంతో కొన్ని చోట్ల ఓడామని, గుర్తులు కూడా ఓటమికి కారణం అన్నారు. రెండున్నర ఏళ్ల ప్రభుత్వం పనితీరు పై ప్రజలిచ్చిన తీర్పు అమోఘమైనదన్నారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. మాపై బాధ్యత పెరిగిందని, ప్రజలు మా పాలన నమ్మి ఓట్లు వేసరని, సుమారు 52 శాతం ఓట్లు టీడీపీ పార్టీ వచ్చావని, ఇలానే 2029 జనరల్ ఎలక్షన్లలో విజయo చేకూరుతుందని అన్నారు.1