Shuru
Apke Nagar Ki App…
నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
సత్య ఆంధ్ర
నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నర్సీపట్నం చైర్మన్ పద్మమ్మకు మెకానిక్ యూనియన్ ఘన సన్మానం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా భారీ మెజార్టీతో విజయం సాధించిన చింతకాయల పద్మమ్మ ని శ్రీ వరసిద్ధి వినాయక బైక్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.యూనియన్ అధ్యక్షుడు యాకా రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యులు పద్మమ్మ గారిని కలిసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల ఐక్యతను చాటుతూ "జై మెకానిక్... జై జై మెకానిక్, మెకానిక్ ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు.1
- కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..? సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.1
- కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు4
- సీఎం చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యం.. జడ్పీ పీఠంపై అధిష్టానానిదే తుది నిర్ణయం, కూటమి శ్రేణులు, ఎమ్మెల్యే పంతం నానాజీకి హృదయపూర్వక ధన్యవాదాలు కాకినాడ రూరల్, నవంబర్ 9: కాకినాడ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రత్యర్థులపై సుమారు 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తమ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఈ అఖండ విజయం అనంతరం పిల్లి దంపతులు విలేకరులతో మాట్లాడి, తమపై విశ్వాసంతో ఇంతటి భారీ మెజార్టీని కట్టబెట్టిన కాకినాడ రూరల్ ప్రజలకు, ఓటర్లకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ఐక్యత తెచ్చిన విజయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను బరిలోకి దిగానని పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఈ గెలుపు కూటమి ఐక్యతకు, కార్యకర్తల అవిశ్రాంత శ్రమకు నిదర్శనమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించిన సంపూర్ణ సహకారానికి, క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, బూత్ స్థాయి కార్యకర్తలకు ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. సంక్షేమం – అభివృద్ధి మా లక్ష్యం రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోందని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పే ఈ విజయమని కొనియాడారు. విలీన గ్రామాలపై స్పష్టత.. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం కానున్న ఆరు గ్రామాల అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పిల్లి దంపతులు స్పందిస్తూ.. "ముందుగా ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలన్నది స్థానిక ప్రజాభిప్రాయం. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం" అని తేల్చిచెప్పారు. జడ్పీ చైర్మన్ పదవిపై స్పందన. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం వస్తే స్వీకరిస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నకు పిల్లి అనంతలక్ష్మి స్పష్టమైన సమాధానమిచ్చారు. "నా రాజకీయ ప్రస్థానం గతంలో జడ్పీటీసీగానే మొదలైంది. పార్టీ ఆదేశాలను నేనెప్పుడూ జవదాటలేదు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగాను. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ పీఠంపై అధిష్టానం పిలుపునిస్తే, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమావేశంలో మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్, కరప మండల అధ్యక్షులు కాళ్ళ శ్రీనివాస్, మద్దూరి స్వామి, ఎంపీటీసీ నురుకుర్తి ప్రకాష్, క్లస్టర్ లు ప్రకాష్, తాతపూడి రామకృష్ణ, ఉషారాణి,బీసీ సెల్ అద్యక్షులు కొమిరిశెట్టి నరసింగరావు,తెలుగు యువత ఉపాధ్యక్షులు సందీప్, ప్రధాన కార్యదర్శి లోవ రాజు, చల్మాజీ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.2
- సింహాచలం: కనుల పండువగా గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం....శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది సింహాచల శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి సన్నిధిలో అమావాస్యనీ పురస్కరించుకుని సోమవారం గోవిందరాజ స్వామివారి తిరువీధి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.అర్చకులు గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేశారు.ఉత్సవంలో వేద పండితులు వేద విన్నపాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరువీధిలో పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా మెంటాడ మండలం టిడిపి ఎంపీపీగా చలుమూరి వెంకట్రావు.. మెంటాడ ఎంపిపిగా 'చలుమూరి' విజయనగరం జిల్లా మెంటాడమండలంలోని 13 ఎంపిటిసి స్థానాలకు గాను టిడిపి 9 స్థానాలు జనసేన ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపిపి స్థానం గత 15 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషిచేసిన టిడిపి మండల అధ్యక్షుడిగా చలుమూరు వెంకటరావుకు దక్కేలా ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం గెలుపొందిన ఎంపిటిసిలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల ప్రజలు ఎంతో నమ్మకంతో పార్టీపై ఉన్న అభిమానంతో తమకు ఓటు వేసి గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎనలేని కృషి చేస్తామని, మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపిటిసిలంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఇప్పటివరకు వైస్ ఎంపిపి పదవి విషయం తేలలేదని అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికే ఆ పదవిని కేటాయిస్తామని చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు చలుమూరు వెంకటరావు మాట్లాడుతూ రానున్న పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో 31 గ్రామ పంచాయతీలో పార్టీ సభ్యులు విజయ ఢంకా మోగించాలన్నారు. గ్రామాలలో పట్టింపులకు పోకుండా ప్రజలు ఏ వ్యక్తిపై మొగ్గు చూపుతారో వారిని సర్పంచ్ బరిలో దింపాలని కూటమి సభ్యులంతా ఐకమత్యంగా చర్చించుకుని గెలుపే ముఖ్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి పోలిట్ బ్యూరో అధికార ప్రతినిధి గొర్లె ముసలినాయుడు, జిల్లా ప్రాదేశిక సభ్యులు గుమ్మడి నారాయణమ్మ, ఎంపిటిసిలు పాండ్రంకి సత్యవతి దేవి, పరదేశి రమ్య, కొనిశ విష్ణు గోవింద, ఆరంగి శంకర్రావు, అంటిపర్తి అజయ్ కుమార్, సారిక పైడిరాజు, తాటిపూడి రామకృష్ణ, బాయి వెంకట్రావు, పార్టీ నాయకులు సిరిపురం గురునాయుడు, రెడ్డి ఆదినారాయణ, సూరెడ్డి కృష్ణమూర్తి, చొక్కాకు సన్యాసినాయుడు, పడాల గంగునాయుడు, పల్లి సింహాద్రి పాల్గొన్నారు.1
- కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులకు 41 రోజుల పాటు ఉచిత అన్నదానం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రసాద వితరణ ప్రారంభించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల విజయనగరం, నవంబర్ 9: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన 41 రోజుల ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు.1
- ఫ్రెండ్లీ పోలీసింగ్ – పెద్దాపురంలో "పల్లెనిద్ర" కార్యక్రమం మకాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, నేర రహిత సమాజం కోసం పెద్దాపురం చేపల వీధి కాలనీలో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ గారు స్థానిక ప్రజలతో కలిసి "పల్లెనిద్ర" నిర్వహించారు. ముఖ్యమైన అవగాహన అంశాలు: 🔹 రోడ్డు భద్రత: ప్రమాద బాధితులను కాపాడే 'గుడ్ సమారిటన్'లకు ₹25,000 బహుమతి. PM-RAHAT కింద ₹1.5 లక్షల వరకు ఉచిత చికిత్స. హెల్మెట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపవద్దు. 🔹 డ్రగ్స్ వద్దు బ్రో: గంజాయి పెడ్లర్స్/యూజర్ల సమాచారం తెలిస్తే వెంటనే 100 / 112 / 1972 కు కాల్ చేయండి. 🔹 సైబర్ క్రైమ్ & సోషల్ మీడియా: గుర్తుతెలియని వీడియో కాల్స్ ఎత్తవద్దు. చట్టంలో "డిజిటల్ అరెస్ట్" అనేది లేదు, భయపడకండి. ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయవద్దు. 🔹 మహిళా భద్రత: మహిళల రక్షణ కోసం 'శక్తి యాప్' డౌన్‌లోడ్ చేసుకోండి. 🔹 దొంగతనాల నివారణ: ప్రయాణాల్లో, తాళం వేసిన ఇళ్లలో నగదు, బంగారం పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం! #KakinadaPolice #Peddapuram #PalleNidra #FriendlyPolicing #PublicAwareness1