ఖానాపురంలో వైభవంగా ప్రారంభమైన ప్రతి శుక్రవారం అంగడి గ్రామ అభివృద్ధి వరంగల్ జిల్లా ఖానాపురంలో వైభవంగా ప్రారంభమైన వారపు అంగడి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతన అంగడి శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సర్పంచ్ దాసరి రమేష్ గ్రామ ప్రజల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి అంగడిని ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, మహిళలు, యువత, వివిధ రకాల వ్యాపారస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి ఆర్థిక వనరులు సమకూర్చడం, ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా అంగడిని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వారపు సంతలో కూరగాయల వ్యాపారులకు కేవలం రూ.10 మాత్రమే, పశువుల విక్రయానికి రూ.35 మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించారు. చిరు వ్యాపారులు, బేరం చేసే వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంగడి నిర్వహణను ఉపసర్పంచ్ ఉప్పు రాజు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఖానాపురం చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉండటంతో వ్యాపారం సమృద్ధిగా సాగుతుందని, గ్రామ వీధులు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాణ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, మహిళా సభ్యులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు వ్యాపారులు పాల్గొన్నారు. కొత్త అంగడి ద్వారా ఖానాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందనే ఆశాభావం వ్యక్తమైంది.

- గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా టమాటాలు పంచిన రైతులు కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంపిణీ చేసిన రైతులు కిలో టమాటా ధర రూ. 2 పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన..1
- మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం కేంద్రంలో శుక్రవారం విషాదకర పరిస్థితి నెలకొంది. వారంతపు సంత సందర్భంగా టమాట రైతులు భారీ మొత్తంలో తమ పంటను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మంచి ధర లభిస్తుందనే ఆశతో ఉదయం నుంచే మార్కెట్‌కు తరలించిన టమాటాలకు ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ధర కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో టమాటాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక రైతులు టమాటాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. “ఫ్రీ… ఫ్రీ… టమాటాలు ఫ్రీ” అంటూ రైతులు పిలుపునివ్వడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొంతసేపు సంత ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు ధరల పతనం—ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంటకు కనీస మద్దతు ధర కల్పించి, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిస్తే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు.1
- హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.1
- రైతు కష్టానికి ఫలితం దక్కలేదు. చెమటోడ్చి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఒక రైతు ఆవేదన చెందారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోవడంతో, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం ఇష్టం లేక.. తన పంటను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్‌కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేవని గూడూర్ మండలం భూపతిపేట కు చెందిన రైతులు పోగుల కొండ సారయ్య, మోహన్,గుజ్జ సురేందర్ మూడు ఎకరాలలో టమాట పంట వేయగా మూడు లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను రోడ్డు పాలు చేయడం కంటే, తోటి ప్రజలకు పంచిపెడితే వారి ఆకలి తీరుతుందని భావించిన సదరు రైతులు.. దాదాపు 50 పెట్టెల నిండా టమాటాలను తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేశారు.1
- Post by Venkatgoud kallepu1
- కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం హనుమకొండ భవాని నగర్ లోని క్యాంపు కార్యాలయం నందు గీసుగొండ మండలం కొమ్మాల శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవములు - జాతర పోస్టర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చ్ 9వ తేదీ వరకు జాతర నిర్వహించబడుతుందని తెలిపారు.అలాగే ఫిబ్రవరి 27వ తేదీ(శుక్రవారం) రాత్రి 10.00 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది అన్నారు.2
- విదేశాల్లో ఉద్యోగుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడే ముఠా గుట్టు రట్టు చేశారు జగిత్యాల పోలీసులు. జిల్లాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముఠాకు చెందిన నలుగురు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ, మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యామ్ రావు రాజశేఖర్ చూపించి వివరాలు వెల్లడించారు. వైజాగ్ కు చెందిన రాజు ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడని అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలని చెప్పి టూరిస్ట్ వీసా లతో థాయిలాండ్, బ్యాంకాక్ తీసుకెళ్ళి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని అక్రమంగా లావోస్ కు తరలించి బలవంతంగా సైబర్ మోసాలు చేయించారని ఎస్పీ తెలిపారు. అమెరికా ఇన్ల్పూయోన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి యుఎస్ఏ లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ మోసాలు చేయించేవారని తెలిపారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు విజయేందర్ పట్టుబడగా ముఠా గుట్టు రట్టయింది ఎస్పీ చెప్పారు. విదేశీ ఉద్యోగాలు త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదని ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్ సైట్లు ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు.1
- యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యాప్ రద్దు చేయాలని రైతులు ఆగ్రహం యాప్ లో బుక్ చేసుకోవాలని అంటున్నారు.. నాకు చదువురాదు ఎలా బుక్ చేసుకోవాలి మాకు యూరియా ఇవ్వకుండా ఒక్క యూరియా బస్తా బయటకు పోయినా ఆత్మహత్య చేసుకుంటానని రైతు ఆవేదన1