సమ్మర్ హాలిడేస్‌లో చిన్నారులకు మొబైల్ ఫోన్లు.. పెరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన సమ్మర్ హాలిడేస్ సందర్భంగా చిన్నపిల్లలకు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి మొబైల్‌లో గేమ్స్, వీడియోలు మరియు సోషల్ మీడియా చూడడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి మరియు చదువుపై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై పిల్లలు బయట ఆటలు, శారీరక వ్యాయామాలకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకర ఆన్‌లైన్ కంటెంట్ మరియు అపరిచితులతో పరిచయాలు కూడా చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలకు మొబైల్ వినియోగంపై సమయ పరిమితి పెట్టడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పుస్తకాలు చదివించడం మరియు అవుట్‌డోర్ గేమ్స్‌కు ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
సమ్మర్ హాలిడేస్‌లో చిన్నారులకు మొబైల్ ఫోన్లు.. పెరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన సమ్మర్ హాలిడేస్ సందర్భంగా చిన్నపిల్లలకు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి మొబైల్‌లో గేమ్స్, వీడియోలు మరియు సోషల్ మీడియా చూడడం వల్ల పిల్లల్లో కంటి సమస్యలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి మరియు చదువుపై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై పిల్లలు బయట ఆటలు, శారీరక వ్యాయామాలకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకర ఆన్‌లైన్ కంటెంట్ మరియు అపరిచితులతో పరిచయాలు కూడా చిన్నారుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలకు మొబైల్ వినియోగంపై సమయ పరిమితి పెట్టడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పుస్తకాలు చదివించడం మరియు అవుట్‌డోర్ గేమ్స్‌కు ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
- విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థుల్లో నైపుణ్యం వెలికితీసేందుకే సమ్మర్ క్యాంపుల నిర్వహణ : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని 9 పీఎంశ్రీ పాఠశాలతో పాటు, కేజీబీవీ రుద్రంగి లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు వారీగా ఈరోజు నుండి 17 వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించ బడతాయని పేర్కొన్నారు. ఈరోజు మౌలిక వసతుల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల ప్రారంభం, రెండవ రోజు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెమిడియల్ తరగతుల ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యార్థుల రెమిడియల్ తరగతుల ముగింపు, మూడవ రోజు పాఠశాల విద్యా కార్యక్రమాలపై సర్పంచ్‌లతో నియోజకవర్గ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహణ, నాలుగవ రోజు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహణ, ఐదవ రోజు పుస్తక పఠనం ప్రాముఖ్యతపై జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ఆరవ రోజు ఆర్ట్, క్రాఫ్ట్ & కల్చరల్ డే నిర్వహణ, ఏడవ రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా నాట్యం, సంగీతం, చేతి రాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ రోజు విద్యార్థులకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఏ పాఠశాల విద్యార్థులైనా ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యా వారోత్సవాల ముగింపు రోజు విద్యా విజయోత్సవ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి అత్యుత్తమైన మార్కులను పొందిన విద్యార్థులకు సన్మానం చేసి, నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయని, ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే స్థాయిలో డిమాండ్ ఉందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడానికి చురుకుగా ఉన్న విద్యార్థులను ఇస్రో కు పంపిస్తామని, ఇప్పటికే చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. జీవితంలో విద్యార్థులు చదువుతో పాటు అన్నీ విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని, అందుకే ఈ సమ్మర్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటు నైపుణ్యాలను వెలికితీసేలా ఏదైనా ఒక హాబీ ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా కష్టపడి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని అంకాలపు సిరికి సన్మానం చేసి అభినందించారు. అనంతరం సమ్మర్ క్యాంపు విద్యార్థులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, తదితరులు పాల్గొన్నారు.3
- కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు వ్యవహారంపై కుట్ర ఆరోపణలు చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. స్వయంగా విచారణ కోరాలని, బాధితురాలు కూడా సంజయ్ వర్గానికే చెందినదని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి హోదా ఉన్నా విచారణ పక్కదారి పట్టదని హామీ ఇచ్చారు.1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న 150 గడ్డి కట్టలు లూజ్ విద్యుత్ వైర్లకు తగిలి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రైతు రాజేశంకు భారీ నష్టం వాటిల్లగా, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం బెజ్జంకి మండలంలో రూ.91 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేయగా, లక్ష్మీపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, పాఠశాల వంటగదిని ప్రారంభించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.5
- ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఏఐఎస్ఎఫ్ ఆయన రాజీనామాను డిమాండ్ చేసింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసినా ఫోక్సో కేసు నమోదు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్, నిందితుడిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణమే విచారణ జరిపి శిక్షించాలని కోరింది.1
- కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలో ముదిరాజుల కులదేవత శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాలతో పాటు గ్రామమంతా ఏకమై జాతరను ఘనంగా నిర్వహించగా, దాతలకు సన్మానాలు చేశారు.1
- పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలంటూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించిన పలు గ్రామాల పొద్దు తిరుగుడు రైతు పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నా రాస్తారోకో చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటుచేసుకుంది. ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాలలో పొద్దు తిరుగుడు పంటను పండిస్తున్న రైతులు పండిస్తున్నారు. పంట కోసి 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ మండలం కేంద్రం లో ఆందోళన కు దిగారు. తాము పండించిన పొద్దు తిరుగుడు పంటను బే షరతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మార్వో వారితో మాట్లాడుతూ పొద్దు తిరుగుడు పంటను కొనడానికి ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేవని తెలిపి, ఆర్డీవో తో ఫోన్లో మాట్లాడించారు. సిరిసిల్ల ఆర్డిఓ ఫోన్లో రైతులతో మాట్లాడి నాలుగు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.3