Shuru
Apke Nagar Ki App…
ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
Naga kanth
ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే.. ఇలా ఉంటుందా....?AI వీడియో సోషల్ మీడియాలో వైరల్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ.. ప్రాజెక్టు ప్రారంభమైతే నల్లమల సాగర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ రూపొందించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లమల సాగర్ కాలువల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం.. చుట్టూ పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్న దృశ్యాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెలిగొండ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ వీడియో AI సాంకేతికతతో రూపొందించిన ఊహాత్మక వీడియో మాత్రమే.. వాస్తవ దృశ్యాలు కావు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. వెలిగొండ నీరు.. పచ్చని పొలాలు.. రైతుల చిరకాల కల సాకారం కావాలని ఆశిద్దాం.1
- నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన మాజీ సిఎం కెసిఆర్ హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయల్దేరారు.నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరారు.1
- కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చాలి సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు.. దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్ ను కనెక్టివిటీ చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. కోడుమూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కై సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారిన ప్రజా సమస్యలు తీరడం లేదని నేటికీ కోడుమూరు పట్టణంలో పదిరోజులకు ఒకసారి త్రాగునీరు కుళాయిల ద్వారా వదులుతున్నారని త్రాగునీటి కొరత తో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పట్టణంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై నడవడానికి కూడా రావడంలేదని ఆయన అన్నారు. కోడుమూరు మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించలేదని తక్షణమే మార్కెట్ యార్డ్ ను ప్రారంభించి ఈ సంవత్సరం నుంచే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక కోడుమూరు చుట్టుపక్కల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల ఆశ్రయించాల్సి వస్తున్నదని ముఖ్యంగా బాలికలకు కర్నూలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందిగా మారి మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుందని వెనుకబడినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే సి. బెళగల్ మండలంలో గుండ్రేవుల దగ్గర గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కోడుమూరు పట్టణంలో పాతబడిన గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా జూనియర్ సివిల్ కోర్టు మరియు ట్రెజరీ లను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పై సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు బి రాజు, శేషు కుమార్, సిపిఐ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మండల కార్యదర్శి అల్తాఫ్ నాయకులు మునిస్వామి ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి, గొల్లరంగడు మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు,మహేష్ సురేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.1
- వైభవంగా ప్రపంచం ఆదివాసి దినోత్సవ వేడుకలు@ : నంద్యాల జిల్లా సున్నిపెంట ఐటీడీఏ ఆవరణంలో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు.1
- అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.3
- డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు మిడుతూరు మండలంలోని వీపనగండ్లలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో పర్యటించారు. కాలనీలో కాలువలు లేకపోవడం వల్ల వర్షపు నీరు అలాగా నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు.1