Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి మండలం : మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు వారం కార్యక్రమాలు విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక మరియు నీటిపారుదల అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లలో ఆధునిక యంత్రాలు, కొత్త పంట విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులు సమాచారం తెలుసుకున్నారు.
Narmala Swapna
కామారెడ్డి మండలం : మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు వారం కార్యక్రమాలు విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక మరియు నీటిపారుదల అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లలో ఆధునిక యంత్రాలు, కొత్త పంట విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులు సమాచారం తెలుసుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జుక్కల్ నియోజకవర్గం : 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా డ్రైవర్ కు గాయాలు కేసు నమోదు చేసిన పోలీసులు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న కూల్డ్రింక్స్ వ్యాన్ టైరు పేలడంతో ఆదివారం 161వ జాతీయ రహదారిపై రుశేగావ్ గేట్ సమీపంలో బోల్తా పడింది. ప్రమాదంతో కూల్డ్రింక్స్ సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్కు గాయాలు కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- 17254 మంది రైతులు నుండి ధాన్యం కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రచురణార్థం మెదక్ 10 మే,2026 ప్రణాళిక బద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కలెక్టర్ *కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిని మిల్లులకు తరలించాలి..* 86 కోట్ల రూపాలు రైతులకు చెల్లింపు *ధాన్యాన్ని విల్లులకు తలించేందకు ప్రత్యేక చర్యలు* ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి 80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ తెలుసుకొని... నిల్వలు లేకుండా వెను వెంటనే విల్లులకు తలించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వేగవంతంగా రవాణా చేయుటకు దిశనిర్ధేశం చేశారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లారీ ల పైనే ఆధార పడకుండా అవసరమైతే ఇతరాత్ర వాహనాలను ద్వారా మిల్లులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోజువారిగా కేంద్రాలో గల నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు ధాన్యాన్ని మిల్లులకు తరలించుటలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్రమించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తెవాలన్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివరాలు , మిల్లులకు రవాణా చేస్తున్న ధాన్యం వివరాలను సంబంధిత రిజిష్టర్లలో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు1
- చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.1
- #ఘనంగా నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు@ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ నిరుపేదలకు అల్పాహారం పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ జన్మదినం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయిత సత్యనారాయణ, దూబకుంట రుక్మయ్య, లక్ష్మణ్ మాట్లాడుతూ, నంగునూరి సత్యనారాయణ, నిత్యం ప్రజా సేవలో ఉంటూ, అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో దొంతుల సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, నంగునూరు విజయ్ , నర్సింలు, దూబకుంట లచ్చల్, రుక్మయ్య మల్లేశం నంగునూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.1
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.1
- కామారెడ్డి మండలం : మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు వారం కార్యక్రమాలు విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లాలో మే 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో రైతులకు నేల ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక మరియు నీటిపారుదల అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లలో ఆధునిక యంత్రాలు, కొత్త పంట విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులు సమాచారం తెలుసుకున్నారు.1