logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మదనపల్లె లో చిన్నారిపై జరిగిన ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ప్రెస్‌మీట్ . అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడు సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం పుణ్యం తెలియని చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటనకు గంజాయి, మద్యం మత్తే కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ప్రభావంతో ఇటువంటి ఘోర సంఘటనలు పెరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రయాల వెనుక అధికార పార్టీల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై ప్రజలు పార్టీలు అతీతంగా నిరసనలకు దిగారని, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీతో పాటు అధికార పార్టీకి చెందిన వారు కూడా పాల్గొన్నారని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో మదనపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Kumar
Kumar
కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

మదనపల్లె లో చిన్నారిపై జరిగిన ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ప్రెస్‌మీట్ . అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడు సంవత్సరాల బాలికపై జరిగిన అఘాయిత్యంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన్యం పుణ్యం తెలియని చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటనకు గంజాయి, మద్యం మత్తే కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ ప్రభావంతో ఇటువంటి ఘోర సంఘటనలు పెరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి విక్రయాల వెనుక అధికార పార్టీల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై ప్రజలు పార్టీలు అతీతంగా నిరసనలకు దిగారని, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీతో పాటు అధికార పార్టీకి చెందిన వారు కూడా పాల్గొన్నారని తెలిపారు. నిరసన తెలియజేయడం ప్రజల హక్కు అని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో మదనపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు పంటలపై దాడి చేస్తుందని బుధవారం స్థానిక ప్రజలు, రైతులు తెలిపారు. ఈ దాడిలో మామిడి, టమోటా పంటలకు అపార నష్టం వాటిల్లుతోందని, ఏనుగు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతుందని వారు పేర్కొన్నారు. ఏనుగు దారి మళ్ళించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పెనుగొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుండి పరిపాలించారు.శ్రీకృష్ణదేవరాయలు వారు జనవరి 17వ తేదీన1471 సంవత్సరంలో జన్మించారు.శ్రీకృష్ణదేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరఫున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు.
    1
    చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. 
పెనుగొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుండి పరిపాలించారు.శ్రీకృష్ణదేవరాయలు వారు జనవరి 17వ తేదీన1471 సంవత్సరంలో జన్మించారు.శ్రీకృష్ణదేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. 
శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరఫున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బుధవారం నుంచి బోర్వెల్ రిగ్ యజమానులు నిరవధిక సమ్మె చేపట్టారు. మొత్తం 21 బోర్వెల్ లారీలను నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బోర్వెల్ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంపై రిగ్ ఓనర్ల అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించే వరకు ఉద్య మిస్తామని, మొదటి విడతగా ఐదు రోజుల పాటు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బుధవారం నుంచి బోర్వెల్ రిగ్ యజమానులు నిరవధిక సమ్మె చేపట్టారు. మొత్తం 21 బోర్వెల్ లారీలను నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేశారు. బోర్వెల్ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంపై రిగ్ ఓనర్ల అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించే వరకు ఉద్య మిస్తామని, మొదటి విడతగా ఐదు రోజుల పాటు సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కోసిగి మండలం మంత్రాలయం తాలూకా కర్నూలు జిల్లా.
    1
    కోసిగి మండలం మంత్రాలయం తాలూకా కర్నూలు జిల్లా.
    user_G Hanumesh
    G Hanumesh
    కోసిగి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో బోయ ఆంజనేయులు అనే వ్యక్తి కుమారుడు సురేందర్ కు గతంలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం మరోసారి గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఖర్చు 12 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు.
    1
    ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో బోయ ఆంజనేయులు అనే వ్యక్తి కుమారుడు సురేందర్ కు గతంలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం మరోసారి గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఖర్చు 12 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 100 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ డబుల్ రోడ్డును ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ సాదు సాంబశివరావు వెల్లడించారు.
    1
    గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 100 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఈ డబుల్ రోడ్డును ఐదు రోజుల్లోనే పూర్తి చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ సాదు సాంబశివరావు వెల్లడించారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు బలంగా చేపట్టారు. జై శివాజీ జై జై శివాజీ అంటూ నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు గడపలోపలే కులం గడప దాటితే హిందువులం... శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్బంగ. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నందు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ మరియు అన్నదానం చేయడం జరిగింది స్వీట్స్ పంచడం జరిగింది హిందూ బంధుమిత్రులు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది
    1
    కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు బలంగా చేపట్టారు. 
జై శివాజీ జై జై శివాజీ అంటూ నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు
గడపలోపలే కులం గడప దాటితే హిందువులం...
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్బంగ. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నందు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ మరియు అన్నదానం చేయడం జరిగింది  స్వీట్స్ పంచడం జరిగింది హిందూ బంధుమిత్రులు పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    1
    నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
    1
    తిరుపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం ఘనంగా.
ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతోత్సవం సందర్భంగా తిరుపతి మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
శోభాయాత్ర రామచంద్ర పుష్కరిణి నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ సర్కిల్, నాలుగు కాళ్ల మండపం, రైల్వే స్టేషన్, నేతాజీ రోడ్డు, బేరి వీధి, ప్రకాశం రోడ్డు మీదుగా గాంధీ భవన్ వరకు కొనసాగుతుంది.
1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి “హైందవ స్వరాజ్యం”కు పునాది వేశారు. గెరిల్లా యుద్ధ తంత్రాలకు రూపకర్తగా, మత సహనం మరియు సుశాసనానికి నిదర్శనంగా నిలిచారు. 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం ఆయన జయంతిని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.