చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులు పట్టా పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలి . రైతుల డిమాండ్ మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలంపల్లి వద్ద బుధవారం ఉదయం మెదక్ చేగుంటరా ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరినట్లు వేసి నేలలు గడుస్తున్న యూరియా అందుబాటు లేకపోవడంతో పంట ఎదుగుదలలేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆలయ వ్యక్తం చేశారు యాప్ లో యూరియా బుక్ చేసుకునేవారికి స్టాక్ అయిపోతుంది అని యూరియా దొరకడం లేదు అన్నారు ప్రభుత్వం వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చి ఆందోళన నిర్మింప చేశారు దాంతో రాకపోకలు యధావిధిగా జరిగాయి
చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులు పట్టా పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలి . రైతుల డిమాండ్ మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలంపల్లి వద్ద బుధవారం ఉదయం మెదక్ చేగుంటరా ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరినట్లు వేసి నేలలు గడుస్తున్న యూరియా అందుబాటు లేకపోవడంతో పంట ఎదుగుదలలేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆలయ వ్యక్తం చేశారు యాప్ లో యూరియా బుక్ చేసుకునేవారికి స్టాక్ అయిపోతుంది అని యూరియా దొరకడం లేదు అన్నారు ప్రభుత్వం వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చి ఆందోళన నిర్మింప చేశారు దాంతో రాకపోకలు యధావిధిగా జరిగాయి
- హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు 2000 రూపాయలు జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందినిఎస్పి అభినందించారు. భార్యతో చనువుగా ఉండడం చూసి సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాల ప్రకారం.. బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి కళకల్ గ్రామంలో శ్రీరామ్ పండరి నిర్మిస్తున్న ఇంటి వద్ద కూలీ పనులు చేస్తూ అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అదే ఇంటిలో వీరికంటే ముందుగా మేస్త్రీ పనులు చేస్తూ ప్రమోద్ పాశ్వాన్ (43) నివాసం ఉంటున్నాడు.ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉండటాన్ని గమనించి న బిట్టు కుమార్, అతడిని రెండు మూడు సార్లు హెచ్చరించాడు. మరోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే చంపాలని నిర్ణహించుకున్నాడు. ఈ క్రమంలో 16.11.2024న సాయంత్రం బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్ సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లి రాత్రి సుమారు 9 గంటల సమయంలో నివాసం ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చారు. బిట్టు కుమార్ సరుకులను తన భార్యకు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమోద్ పాశ్వాన్ తన భార్య నడుముపై చేయి వేసి ఉండటాన్ని చూశాడు.దీంతో ఆగ్రహించిన బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నిస్తే, తన ఇష్టమని, తనను ఎందుకు అడుగుతున్నావంటూ ప్రమోద్ పాశ్వాన్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్ పాశ్వాన్‌పై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పటాన్‌చెరువుకు వెళ్లాడు.ఈ ఘటనపై మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు.నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అభినందించారు.1
- నర్సాపూర్ పట్టణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం.. ... ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి అధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎబివిపి నాయకులు రంజిత్ మోహన్ గారు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగ యాత్ర సందర్భంగా 500 అడుగుల జాతీయ పతకంతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ సిగ్నల్ పాయింట్ నుండి తిరిగి మళ్ళీ సిగ్నల్ పాయింట్ వరకు ఘనంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడుతూ నేడు విద్యార్థులందరూ త్రివర్ణ పతాక చేతపట్టి నర్సాపూర్ పట్టణంలో విజయవంతంగా ఈ ర్యాలీని జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం అందరం మన యొక్క ఇంటి పైన కుటుంబ సభ్యులతో జాతీయ జెండాను ఎగురవేసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో భారత దేశం యొక్క గొప్పతనని చాటి చెప్పాల్సిన అవసరం మన అందరిది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థినీ విద్యార్థులకు టీచర్లకు ప్రెస్ రిపోర్టర్లకు పోలీస్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ భుచేష్ యాదవ్, సీనియర్ నాయకులు పంజా విజయ్ కుమార్, నర్సాపూర్ కౌన్సిలర్ నిరంజన్ దాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్, నారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శులు అశోక్ సాదుల, ఎరుకల భిక్షపతి, బాదే బాలరాజ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జనార్ధన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండం శంకర్, బిట్ల మహేష్, మండల అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, నీలి నాగేష్, పెద్దపులి రవి, నాగ ప్రభు గౌడ్, నాగేందర్ రెడ్డి, నర్సాపూర్ మండల ప్రధాన కార్యదర్శిలు కోదండ రామిరెడ్డి, సంఘసాని రాజు, యువ మోర్చా జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్, పోతరాజు అనిల్, రాజేష్, చందు, సాయి, చారి, వంశీ, సురేష్, గణేష్, నరేష్, మహేందర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు మోర్చాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.1
- వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు,నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.1
- కోనాపూర్ వద్ద అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మెదక్ నవాబ్‌పేటకు చెందిన సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.1