Shuru
Apke Nagar Ki App…
కోనాపూర్ వద్ద అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మెదక్ నవాబ్‌పేటకు చెందిన సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Priya
కోనాపూర్ వద్ద అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మెదక్ నవాబ్‌పేటకు చెందిన సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నర్సాపూర్ పట్టణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం.. ... ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి అధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎబివిపి నాయకులు రంజిత్ మోహన్ గారు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగ యాత్ర సందర్భంగా 500 అడుగుల జాతీయ పతకంతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి పట్టణ సిగ్నల్ పాయింట్ నుండి తిరిగి మళ్ళీ సిగ్నల్ పాయింట్ వరకు ఘనంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడుతూ నేడు విద్యార్థులందరూ త్రివర్ణ పతాక చేతపట్టి నర్సాపూర్ పట్టణంలో విజయవంతంగా ఈ ర్యాలీని జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం అందరం మన యొక్క ఇంటి పైన కుటుంబ సభ్యులతో జాతీయ జెండాను ఎగురవేసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో భారత దేశం యొక్క గొప్పతనని చాటి చెప్పాల్సిన అవసరం మన అందరిది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థినీ విద్యార్థులకు టీచర్లకు ప్రెస్ రిపోర్టర్లకు పోలీస్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ భుచేష్ యాదవ్, సీనియర్ నాయకులు పంజా విజయ్ కుమార్, నర్సాపూర్ కౌన్సిలర్ నిరంజన్ దాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్, నారాయణ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శులు అశోక్ సాదుల, ఎరుకల భిక్షపతి, బాదే బాలరాజ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జనార్ధన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండం శంకర్, బిట్ల మహేష్, మండల అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, నీలి నాగేష్, పెద్దపులి రవి, నాగ ప్రభు గౌడ్, నాగేందర్ రెడ్డి, నర్సాపూర్ మండల ప్రధాన కార్యదర్శిలు కోదండ రామిరెడ్డి, సంఘసాని రాజు, యువ మోర్చా జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్, పోతరాజు అనిల్, రాజేష్, చందు, సాయి, చారి, వంశీ, సురేష్, గణేష్, నరేష్, మహేందర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు మోర్చాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.1
- హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు 2000 రూపాయలు జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందినిఎస్పి అభినందించారు. భార్యతో చనువుగా ఉండడం చూసి సహచర కూలీని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కేసు వివరాల ప్రకారం.. బిట్టు కుమార్ (22) తన భార్య పూజా కుమారి, పిల్లలతో కలిసి కళకల్ గ్రామంలో శ్రీరామ్ పండరి నిర్మిస్తున్న ఇంటి వద్ద కూలీ పనులు చేస్తూ అదే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అదే ఇంటిలో వీరికంటే ముందుగా మేస్త్రీ పనులు చేస్తూ ప్రమోద్ పాశ్వాన్ (43) నివాసం ఉంటున్నాడు.ప్రమోద్ పాశ్వాన్ తన భార్యతో చనువుగా ఉండటాన్ని గమనించి న బిట్టు కుమార్, అతడిని రెండు మూడు సార్లు హెచ్చరించాడు. మరోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే చంపాలని నిర్ణహించుకున్నాడు. ఈ క్రమంలో 16.11.2024న సాయంత్రం బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్ సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్లి రాత్రి సుమారు 9 గంటల సమయంలో నివాసం ఉంటున్న ఇంటికి తిరిగి వచ్చారు. బిట్టు కుమార్ సరుకులను తన భార్యకు ఇచ్చి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ప్రమోద్ పాశ్వాన్ తన భార్య నడుముపై చేయి వేసి ఉండటాన్ని చూశాడు.దీంతో ఆగ్రహించిన బిట్టు కుమార్, ప్రమోద్ పాశ్వాన్‌ను ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నిస్తే, తన ఇష్టమని, తనను ఎందుకు అడుగుతున్నావంటూ ప్రమోద్ పాశ్వాన్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం బిట్టు కుమార్‌ను తోసివేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బిట్టు కుమార్ మంచంపై ఉన్న కర్రతో ప్రమోద్ పాశ్వాన్‌పై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పటాన్‌చెరువుకు వెళ్లాడు.ఈ ఘటనపై మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి సీఐ రంగకృష్ణ పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. పోలీసులు సమర్పించిన పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి నీలిమ, నిందితుడు బిట్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు.నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజనింగ్ అధికారులు, సాక్ష్యాధారాల సేకరణలో సహకరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అభినందించారు.1
- నిరుద్యోగుల ఆగ్రహం: కోదండరాంను నిలదీసిన వైనం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులు ఎమ్మెల్సీ కోదండరాంను సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అడ్డుకున్నారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇప్పుడు మా సమస్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 30 ఏళ్లకు ఉద్యోగాలకు పనికిరామా అంటూ నిలదీయడంతో, ఆయన సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.1
- కోనాపూర్ వద్ద అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తికి తీవ్ర గాయాలు రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి సైడ్ రైలింగ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మెదక్ నవాబ్‌పేటకు చెందిన సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.1