వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు,నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు,నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
- సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “ఆ పాప తన నాన్న రాలేదని బాధపడుతూ మూడు రోజులుగా తినలేదని చెబుతుంటే మనసున్న ఏ మనిషికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదు” అని కేటీఆర్ అన్నారు.వెంకటేశం మృతి ఘటనలో కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపించి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు. “కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తాం. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.అంతే కాకుండా, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“ఆమె పదో తరగతి తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆ తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చాను” అని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందించినట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని కేటీఆర్ పోలీసు అధికారులను కోరారు. “దయచేసి ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వారిని బయటకు తీసుకురండి. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని ఆయన పోలీసులను కోరారు. వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. ఆ పాప పెరిగి పెద్దయ్యే వరకు కూడా నేను స్వయంగా అండగా ఉంటాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారు? కుట్ర చేసింది ఎవరు? నేరానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.“వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము కుటుంబం వెంటే ఉంటాం. ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి. ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.2
- కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్... టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి.. దాడిలో కుడి కన్నుకు గాయాలు... గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం.. విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం.. గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం.. స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.2
- ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా :ధర్మపురి: ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.1
- బండి సంజయ్ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు. కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం.. క్రెడిట్ కోసం బీఆర్‌ఎస్ ఆరాటం.. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ కరీంనగర్ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నేతలు ఆ క్రెడిట్ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.1
- యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see1
- ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగానే రాజన్న ఆలయ అభివృద్ధి రాజన్న ఆలయ అభివృద్ధి పై శృంగేరి పీఠాధిపతుల శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి,శ్రీశ్రీశ్రీ విధుషేకర స్వామి వారిని కలిసిన ప్రతినిధులు బృందం స్వామి వారినీ కలిసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి వేముల శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు, ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, విటిడిఎ వైస్ చైర్మన్ గరిమ ఆగ్రవాల్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ శృంగేరి పీఠం తెలంగాణ రాష్ట్ర బాధ్యులు వ్యాసోజుల రాధకృష్ణా శర్మ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.బుధవారం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై వివరాలను తెలియజేసేందుకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నమూనాలు, ఫొటోలను పీఠాధిపతికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 2000 వేల కోట్ల నిధులు కేటాయించారని, గోదావరి పుష్కరాల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని స్వామి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రెండు వేల కోట్లకు పైచిలుక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖతో పాటు అధికారులు, ఆలయ అర్చకులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.250 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 55 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో రూ.50 కోట్లు, అనంతరం రూ.100 కోట్లు, తాజాగా రూ.99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. వేములవాడ ఆలయ గర్భాలయం, మహామండపాన్ని తొలగిస్తున్నారంటూ గత రెండు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను శృంగేరి పీఠాధిపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం ,మహామండపాన్ని యథావిధి ఉంటుందని తెలిపారు..1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం, భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖర స్థాయిని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఆగమ శాస్త్రం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్దామని శృంగేరి పీఠాధిపతి సూచించారని చెప్పారు.lఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో రేకుల షెడ్డు ఉన్న ప్రాంతంలో 20 అడుగులు, 24 అడుగుల విభాగాలతో మండప నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించిన శృంగేరి పీఠాధిపతి పనులు శుభప్రదంగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.ఆలయ అభివృద్ధి పనులకు సుమారు 4.80 లక్షల క్యూబిక్ ఫీట్ల శిల అవసరమవుతుందని అధికారులు వివరించినట్లు తెలిపారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, ఆలయ ప్రాచీనతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా శృంగేరి పీఠాధిపతి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సనాతన సంప్రదాయాలను, ప్రాచీన దేవాలయాలను పరిరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలు, శృంగేరి పీఠాధిపతి సూచనలకు అనుగుణంగానే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. గర్భాలయం, మహామండపాన్ని ముట్టేది లేదు. శిఖర స్థాయిని పెంచే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారు సూచించినట్లు చేపడుతున్నామని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం, వేములవాడ దేవస్థానం తరఫున ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులు, ధార్మిక సలహాదారు గోవింద హరి, జిల్లా కలెక్టర్, వేద పండితులు, ప్రధాన అర్చకులు తదితరులు శృంగేరి పీఠాన్ని సందర్శించి విధుశేఖర భారతి స్వామివారిని కలిశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆలయ గర్భాలయాన్ని ఎక్కడా మార్చడం, విస్తీర్ణాన్ని పెంచడం, మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం వంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసినట్లు తెలిపారు.అదేవిధంగా శిఖర 1973 నిర్మాణం శిలామయంగా ఉండేదని, అనంతరం ఇటుక, సిమెంట్‌తో నిర్మించిన శిఖర భాగాన్ని ప్రస్తుతం చేపడుతున్న ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరిగి శిలామయంగా నిర్మించాలని సూచించినట్లు వెల్లడించారు. భక్తులకు దూరం నుంచే శిఖర దర్శనం కలిగేలా శిఖరాన్ని సుమారు నాలుగు అడుగుల మేర పెంచి, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని స్వామివారు సూచించినట్లు తెలిపారు.ఆలయ అభివృద్ధి విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్ర నిబంధనలను పాటిస్తూ ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి శృంగేరి పీఠం నుంచి లిఖితపూర్వక సూచనలు, శ్రీముఖం కూడా అందనున్న నేపథ్యంలో వాటి ప్రకారమే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించి శృంగేరి దక్షిణామ్నాయ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు భారతీతీర్థ మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వాములను ఆలయ అధికారులు, ప్రతినిధులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్లి, సందేహాలు మరియు సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఆలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై స్వామీజీలు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం శిఖర నిర్మాణం గతంలో ఇటుకలతో నిర్మించబడిన నేపథ్యంలో, శిఖరాన్ని శిలామయంగా నిర్మించడం శ్రేయస్కరమని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు.ప్రస్తుత గర్భాలయ ప్రాకారం పైన ఉన్న శిఖర స్థాయి నుంచి సుమారు నాలుగు అడుగుల ఎత్తులో శిలామయ శిఖర నిర్మాణం చేపట్టాలని సూచనలు అందినట్లు పేర్కొన్నారు. అయితే స్వామివారి మూలమూర్తులు, గర్భాలయం, మహా మండపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు జరుగుతాయి. అదేవిధంగా నిర్మాణానికి ముందు సంబంధిత ప్రదేశంలోని భూమి బలం, నిర్మాణ స్థిరత్వం తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాలని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలు, ఆశీస్సులతో వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పలు అంశాలపై స్పష్టత కోసం శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధిపతులైన ఉభయ మహాస్వాములను కలిసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు, ఆజ్ఞలు తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ గోపుర శిఖరాన్ని సుమారు 4.5 అడుగుల మేర పెంచి, కలశాన్ని శిలామయంగా నిర్మించే దిశగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఇటుకలతో నిర్మించిన గోపుర నిర్మాణానికి భిన్నంగా, ప్రస్తుతం శిలామయ నిర్మాణంతో ఆలయానికి పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.గర్భాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించడం లేదని, గర్భాలయం యథాతథంగా ఉంటుందని తెలిపారు.. ఈ విషయంలో భక్తులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.ఆలయ అభివృద్ధి, పునర్ వైభవానికి సంబంధించి శృంగేరి పీఠాధిపతుల ఆజ్ఞ, ఆశీస్సులు తీసుకున్నామని, భక్తుల సంతోషం, ప్రసన్నతే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు...1
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.1
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్, గంగుల డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.2
- రామగుండం లో నలుగురు దొంగలు అరెస్టు...28 తులాల బంగారం ఏడు వేల నగదు స్వాధీనం పెద్దపల్లి జిల్లా రామగుండం మజీద్ కార్నర్ కు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7వేల స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి తెలిపారు. ఈ మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి ముగ్గురు మైనర్లు, ఒక వ్యక్తి ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి, ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. ఇటీవల బసంత్ నగర్ లోని ఓ వైన్ షాప్ లో చోరీ చేసి పట్టుబడినట్లు తెలిపారు. కాగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని రామగుండం లో అదుపులోకి తీసుకున్నట్లు డిసిపి తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మైనర్లు కాగా ఒకరు మేజర్ ఉన్నారు. అయితే చిన్ననాటి నుండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.2