Shuru
Apke Nagar Ki App…
యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see
Chandraiah Pochampally
యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see
More news from Telangana and nearby areas
- కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్... టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి.. దాడిలో కుడి కన్నుకు గాయాలు... గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం.. విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం.. గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం.. స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.2
- నేరాల నియంత్రణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్,గల్ఫ్ మోసాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి. వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. నేరాల నియంత్రణకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూనే ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు.బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఎస్పీ గారు పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణ లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు,నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.1
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.1
- తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జాతులు వేరైనా మనసు ఒక్కటే మతాలు వేరైనా మానవత్వం ఒక్కటే నిలయం సర్వ మతాల సమ్మేళన నిదర్శనం తెలంగాణ జాతులు వేరైనా.. మనసులు ఒక్కటే మతాలు వేరైనా.. మానవత్వం ఒక్కటే విభిన్న జాతులు, సంస్కృతులకు నిలయం సర్వమతాల సమ్మేళనానికి నిదర్శనం తెలంగాణ కాజీపేట దర్గాలో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి పాల్లొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు1
- కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.1
- కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు2
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్, గంగుల డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.2
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదు శుక్రవారం లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని ఆమె వివరించారు.2