వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదు శుక్రవారం లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని ఆమె వివరించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక
ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదు శుక్రవారం లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని ఆమె వివరించారు.
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.1
- గుండ్లపల్లి స్టేజ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ......... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు "వందే మాతరం.. భారత్ మాతా కీ జై" అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see1
- *బీజేపీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ* భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. పద్మనగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ తిరంగా బైక్ ర్యాలీ, పద్మనగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, వీధుల గుండా సాగి చింతకుంట అంబేద్కర్ విగ్రహం వరకు అత్యంత ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బైక్ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ బైక్ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది. బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా చింతకుంటకు చేరుకొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా బైక్ ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, కార్పొరేటర్లు వాసల్ రమేష్, వేముల చంద్రశేఖర్... బిజెపి నాయకులు ముంజేటి శివ, ఆడిచర్ల రాజు, సత్తిరెడ్డి, సదానందం, పూస అనిల్, కిరణ్, రాచకొండ కొమరయ్య, శ్రీకాంత్ నాయక్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..1
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: మాజీ ఎంపీ వినోద్‌కుమార్ కుమార్ డిమాండ్ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.1
- బండి సంజయ్ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు. కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం.. క్రెడిట్ కోసం బీఆర్‌ఎస్ ఆరాటం.. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ కరీంనగర్ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నేతలు ఆ క్రెడిట్ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.1
- సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “ఆ పాప తన నాన్న రాలేదని బాధపడుతూ మూడు రోజులుగా తినలేదని చెబుతుంటే మనసున్న ఏ మనిషికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదు” అని కేటీఆర్ అన్నారు.వెంకటేశం మృతి ఘటనలో కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపించి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు. “కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తాం. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.అంతే కాకుండా, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“ఆమె పదో తరగతి తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆ తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చాను” అని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందించినట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని కేటీఆర్ పోలీసు అధికారులను కోరారు. “దయచేసి ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వారిని బయటకు తీసుకురండి. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని ఆయన పోలీసులను కోరారు. వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. ఆ పాప పెరిగి పెద్దయ్యే వరకు కూడా నేను స్వయంగా అండగా ఉంటాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారు? కుట్ర చేసింది ఎవరు? నేరానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.“వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము కుటుంబం వెంటే ఉంటాం. ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి. ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.తాడు సహాయంతో కాపాడిన గ్రామస్థులు రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.అధికారులు హెచ్చరిస్తున్న వినకుండా సాహసాలు చేస్తున్న యువకులు. బైక్ పై వాగు దాటుతుండగా ఘటన. వరద ఉదృతికి బైక్ తో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు. తాడు సహాయంతో కాపాడిన గ్రామస్తులు.2