logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బండి సంజయ్‌ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు. కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం.. క్రెడిట్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఆరాటం.. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ కరీంనగర్‌ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ క్రెడిట్‌ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

6 hrs ago
user_Gaddam Naresh
Gaddam Naresh
Local News Reporter Karimnagar, Telangana•
6 hrs ago

బండి సంజయ్‌ నిధులతో బావుపేట రోడ్డు మరమ్మతులు. కేంద్రమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకం.. క్రెడిట్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఆరాటం.. బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి ఫైర్ కరీంనగర్‌ - కామారెడ్డి ప్రధాన రహదారిలో తీవ్రంగా దెబ్బతిన్న బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రూ.16 లక్షల ఎంపీ నిధులు కేటాయించారు. ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కొత్తపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బావుపేటలో కేంద్రమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి మాట్లాడుతూ ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనుల కోసం కేంద్రమంత్రి నిధులు ఇస్తే.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఆ క్రెడిట్‌ తమదేనంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ఇతరుల నిధులతో పనులు జరుగుతుంటే ప్రచారానికి పాకులాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాంగ్రెస్ క్షుద్ర, హత్యా రాజకీయాలు చేస్తుంది-కేటిఆర్... సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మిక కుటుంబాన్ని పరామర్శించి నిందితులను శిక్షించాలని డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల లో ఈనెల 6న హత్యకు గురైన బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పాప పేరిట మూడు లక్షల పిక్సిడ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ అందజేశారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాదిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి... ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.
    2
    కాంగ్రెస్ క్షుద్ర, హత్యా రాజకీయాలు చేస్తుంది-కేటిఆర్...
సిరిసిల్లలో హత్యకు గురైన నేత కార్మిక కుటుంబాన్ని పరామర్శించి నిందితులను శిక్షించాలని డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల లో ఈనెల 6న హత్యకు గురైన బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పాప పేరిట మూడు లక్షల పిక్సిడ్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ అందజేశారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాదిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి... ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    28 min ago
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.
    1
    ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ 
వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం..

కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Shankerreddy
    Shankerreddy
    కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్‌ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు,నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పొలిస్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ఆరా తీసి,కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్‌ (CCTNS)లో అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పద్ధతులను సిబ్బంది అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు  సైబర్ మోసాలు, గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించలని,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, వీసా మోసాలు,నకిలీ ఏజెంట్ల మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రత్యేక నిఘా కొనసాగించాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని,నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.ఎస్పీ  వెంట డిఎస్పీ శ్రీనివాసులు,సి.ఐ రవీందర్, ఎస్.ఐ మోతిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా :ధర్మపురి: ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
    1
    ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా :ధర్మపురి: 
ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలని, ఈ అంశాన్ని రానున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సంఘం ప్రతినిధులు మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫీల్డ్ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్న తమకు పే స్కేల్‌తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.వారి వినతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్‌, గంగుల డిమాండ్‌ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    2
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్‌, గంగుల డిమాండ్‌
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “ఆ పాప తన నాన్న రాలేదని బాధపడుతూ మూడు రోజులుగా తినలేదని చెబుతుంటే మనసున్న ఏ మనిషికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదు” అని కేటీఆర్ అన్నారు.వెంకటేశం మృతి ఘటనలో కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపించి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు. “కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తాం. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.అంతే కాకుండా, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“ఆమె పదో తరగతి తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆ తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చాను” అని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందించినట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని కేటీఆర్ పోలీసు అధికారులను కోరారు. “దయచేసి ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వారిని బయటకు తీసుకురండి. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని ఆయన పోలీసులను కోరారు. వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. ఆ పాప పెరిగి పెద్దయ్యే వరకు కూడా నేను స్వయంగా అండగా ఉంటాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారు? కుట్ర చేసింది ఎవరు? నేరానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.“వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము కుటుంబం వెంటే ఉంటాం. ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి. ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
    2
    సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు.
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కేటీఆర్. ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాత్య రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో తలపడాలని, రాజకీయ విమర్శలు చేయవచ్చని, కేసులు పెట్టవచ్చని, కానీ సామాన్య ప్రజలను రాజకీయాలకు బలిపశువులుగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. “రాజకీయ లబ్ధి కోసం అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి రాజకీయాలు దిగజారడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్లుగా తాను ఉన్నానని, ఇంత దిగజారిన, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయాన్ని ఎప్పుడూ చూడలేదని” కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటేశం కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కేటీఆర్ ఆయన చిన్నారి కుమార్తె తన తండ్రి కోసం ఎదురు చూస్తూ, మూడు రోజులుగా తినలేదని చెప్పడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. “ఆ పాప తన నాన్న రాలేదని బాధపడుతూ మూడు రోజులుగా తినలేదని చెబుతుంటే మనసున్న ఏ మనిషికైనా కళ్లల్లో నీళ్లు తిరగక మానవు. గుండె ద్రవించక మానదు” అని కేటీఆర్ అన్నారు.వెంకటేశం మృతి ఘటనలో కొంత మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, వారు కేవలం పాత్రధారులు మాత్రమేనని, అసలు సూత్రధారులు ఎవరన్నది దర్యాప్తులో తేల్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, వారిలో ఇద్దరిని మాత్రమే రిమాండ్‌కు పంపించి, మిగతా ముగ్గురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులపై ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి మూలాలను కూడా వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ, నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ వెల్లడించారు. “కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించి ఇస్తాం. మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్‌కు చెప్పాను” అని కేటీఆర్ తెలిపారు.తాను కేవలం సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆ కుటుంబానికి మాట ఇచ్చిన సోదరుడిగా బాధ్యత తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వెంకటేశం కుమార్తె ప్రస్తుతం 11 ఏళ్ల వయసులో, ఐదో తరగతి చదువుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆ బాలిక పేరుపై రూ.3 లక్షలు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె మేజర్ అయిన తర్వాత ఆ మొత్తం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.అంతే కాకుండా, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆమె చదువుతున్న పాఠశాల కరస్పాండెంట్‌తో తాను స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు. పదో తరగతి వరకు బాలిక చదువుకు సంబంధించిన ఫీజులు తదితర ఖర్చుల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“ఆమె పదో తరగతి తర్వాత ఏం చదువుకోవాలనుకున్నా, ఆమె చదువు కొనసాగించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఆ తల్లికి ఈ విషయంలో మాట ఇచ్చాను” అని కేటీఆర్ తెలిపారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందించినట్లు చెప్పారు.ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడకుండా, ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని కేటీఆర్ పోలీసు అధికారులను కోరారు. “దయచేసి ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా వారిని బయటకు తీసుకురండి. బాధిత కుటుంబానికి న్యాయం చేయండి” అని ఆయన పోలీసులను కోరారు.
వెంకటేశం మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ, ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఈ విషయంలో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టం. ఆ పాప పెరిగి పెద్దయ్యే వరకు కూడా నేను స్వయంగా అండగా ఉంటాను. ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారు? కుట్ర చేసింది ఎవరు? నేరానికి పాల్పడింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.“వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము కుటుంబం వెంటే ఉంటాం. ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలిపెట్టం. పోలీసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగాలి. ఈ ఘటన వెనుక అసలు నిజాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని బయటకు తీసుకురావాలి” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.తాడు సహాయంతో కాపాడిన గ్రామస్థులు రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.అధికారులు హెచ్చరిస్తున్న వినకుండా సాహసాలు చేస్తున్న యువకులు. బైక్ పై వాగు దాటుతుండగా ఘటన. వరద ఉదృతికి బైక్ తో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు. తాడు సహాయంతో కాపాడిన గ్రామస్తులు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.తాడు సహాయంతో కాపాడిన గ్రామస్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రామలక్ష్మణ్ పల్లె మానేరు వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.అధికారులు హెచ్చరిస్తున్న వినకుండా సాహసాలు చేస్తున్న యువకులు.
బైక్ పై వాగు దాటుతుండగా ఘటన.
వరద ఉదృతికి బైక్ తో పాటు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు.
తాడు సహాయంతో కాపాడిన గ్రామస్తులు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.