logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.

16 hrs ago
user_Kumar Pasunuri
Kumar Pasunuri
Local News Reporter Ghanpur (Station), Jangoan•
16 hrs ago

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.

More news from తెలంగాణ and nearby areas
  • గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
    1
    గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు 
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    13 hrs ago
  • అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*
    2
    అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 
🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥
🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం*
🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం*
✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-*
🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.*
🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.*
🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.*
🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.*
🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.*
🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    2
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.
కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తగ్గిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. నిత్య ఆర్జిత సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అందులో VIP దర్శనాల ద్వారా రూ.87,900, బ్రేక్ దర్శనాలతో తగ్గిన యాదగిరిగుట్ట రూ.88,200, అన్న ప్రసాదంతో రూ.1,26,335, కార్ పార్కింగ్ తో రూ.2,21,500, ప్రసాద్ విక్రయాలతో రూ.4,03,350 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,54,133 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం..

కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Shankerreddy
    Shankerreddy
    కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.
    2
    NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం..............
వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్‌ చౌక్‌ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది. దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్‌ చౌక్‌ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది.
దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
    2
    కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో  ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా  సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,  నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ కంప్యూటర్ దస్వం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు నిసనకారులకు మధ్య వాగ్వాదం ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం భారీగా మోహరించిన పోలీసులు
    1
    ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత కానిస్టేబుల్  సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ కంప్యూటర్ దస్వం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు నిసనకారులకు మధ్య వాగ్వాదం
ఏసీపీ కార్యాలయంపై దాడి చేసిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబ సభ్యులు
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం
భారీగా మోహరించిన పోలీసులు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.