Shuru
Apke Nagar Ki App…
NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.
Chetty:Ramesh

More news from తెలంగాణ and nearby areas
- ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ తెలిపారు. అర్హతలను బట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు లభిస్తాయని, దళారుల మాయమాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని జిల్లా ప్రజలకు సూచించారు. ప్రజల అభివృద్ధికి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారని తెలిపారు.1
- బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.1
- గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.1
- తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్ చౌక్ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం *జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నేడు TRP జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ* *కార్యక్రమానికి dr కల్నల్ మాచర్ల బిక్షపతి గారు TRP జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాచర్ల బిక్షపతి డాక్టర్ గారు మాట్లాడుతూ గంజాయి పట్ల విద్యార్థులకు అవగాహనను కల్పించడంతోపాటు* *దానివల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు అర్థమయ్యే తీరుల చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ఉపాధ్యక్షులు యమంకి విజయ్ TRP పట్టణ సంయుక్త కార్యదర్శి ఎండి సల్మాన్ MD గుంశి బన్నీ చందు అజయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు*1