Shuru
Apke Nagar Ki App…
బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
M D Azizuddin
బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.1
- అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*2
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.4
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్ చౌక్ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.2
- నర్సంపేట: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి................. చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం గ్రామానికి చెందిన బోడ శివ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు శివను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో శివ మృతి చెందినట్లు తెలిపారు. శివ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శివ వృత్తిరీత్యా విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.1