Shuru
Apke Nagar Ki App…
గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
Shareef pasha
గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- బచ్చన్నపేటలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బీజేపీ నాయకులు జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేశ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేటలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. వాణి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.1
- అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*2
- NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.2
- యూట్యూబ్ నుండి BIG UPDATE ఇక Manitization కష్టమే 🤔8,000 వాచ్ హౌర్స్. #shorts #youtube #newrules #see1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్ చౌక్ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- కరీంనగర్ లో బిఆర్ఎస్, బిజెపి మధ్య గ్యాంగ్ వార్... ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపికి చెందిన కార్పొరేటర్ బండారి వేణు...వేణు ఇంటిపై దాడికి యత్నించిన బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టు కరీంనగర్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లు పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎమ్మెల్యే పట్ల బీజేపీకి చెందిన కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం కరీంనగర్లో బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లు రాజకీయం నడుస్తుంది. ఆదివారం 29 డివిజన్లో బిజెపికి చెందిన కార్పోరేటర్ అనుచరులు బిఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేయగా తాజాగా బీజేపీకి చెందిన మరో కార్పోరేటర్ బండారు వేణు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిజెపి కార్పొరేటర్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహ వేషాలతో ఆందోళన వ్యక్తం చేశారు. బండారి వేణు ఇంటి పై దాడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై నగరంలో బండారి వేణు ఇంటి వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భారీగా మోరించారు. ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బండారి వేణును ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని బండారు వేణు ఇంటి వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టిఆర్ఎస్ కార్యకర్తల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు టిఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే అనుచరులను పలువురిని అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. నగరంలో పోలీసులు భారీగా మోహరించి బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.2