logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు

చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం.. కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    తిరంగ యాత్ర స్వతంత్ర వీరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం పనిచేద్దాం..
కరీంనగర్ జిల్లాలోని రూరల్ మండలంలోని చామనపల్లి గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ జెండా చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినదీస్తూ యాత్రను చేయడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న కరీంనగర్ బిజెపి మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ  దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజల హక్కుల కోసం తన మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా లక్షలాదిమంది బ్రిటిష్ సంకెళ్ల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రం భవిష్యత్తు తరాలు స్వేచ్ఛగా వారి హక్కులను పొందాలని స్వేచ్ఛ స్వతంత్ర గాలులను పీల్చాలంటూ ఆనాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం లక్షలాదిమంది ప్రజలు పోరాడిన కారణంగా నేడు మనకు ఈ స్వాతంత్రం హక్కులు లభించడం జరిగింది. ఆరోజు వారు శిక్షలు అనుభవిస్తూ కఠిన కారాగాలు జీవిత ఖైదీలుగా లాఠీ దెబ్బలు తింటూ ఎక్కడ కూడా స్వాతంత్ర నినాదాన్ని విడవలేదు ఎన్నో రకాలుగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనికించిన వీరులు మన ఈ గడ్డపై జన్మించడం మన అందరి యొక్క అదృష్టం అదేవిధంగా వారి యొక్క త్యాగాలు నేటి సమాజము ముఖ్యంగా నేటి పౌర సమాజము దేశభక్తిని నరనరాన పెంపొందించుకుంటూ దేశం పట్ల దేశ వీరుల పట్ల గౌరవాన్ని ప్రేమను ఎల్లప్పుడూ తెలియపరచాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు  చామనపల్లి గ్రామంలో తిరంగా యాత్ర బీజేపీ నాయకులతో కలిసి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ,జిల్లా, మండల నాయకులు, ఉపసర్పంచ్ లు దూడెం శ్రీనివాస్, గాండ్ల గోపాల్, శక్తికేంద్ర ఇంచార్జి లు ఆవుల సునీల్ ,కూర అమరేందర్ రెడ్డి, బీజేపీ మండల నాయకులు రమేష్,అరవింద్, వార్డ్ మెంబెర్స్ మారుతీ, సంజీవ్, ,కుమారస్వామి, బూత్ అధ్యక్షులు, శ్రీనివాస్, రాజు, రవి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, శ్రీనివాస్, గణేశరెడ్డి,సంజయ్, మధుకర్ రెడ్డి, పరుశరామ్,వెంకటేష్, తదితరులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Shankerreddy
    Shankerreddy
    కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్... టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి.. దాడిలో కుడి కన్నుకు గాయాలు... గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం.. విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం.. గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం.. స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.
    2
    కరీంనగర్ నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్...

టీచర్ దాడిలో గాయపడ్డ తొమ్మిదో తరగతి విద్యార్థి..
దాడిలో కుడి కన్నుకు గాయాలు...
గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైనం..
విద్యార్థి పై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం..
గంటల తరబడి విద్యార్థి తల్లిదండ్రుల నిరీక్షణ.. పట్టించుకోని స్కూల్ యాజమాన్యం..
స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగానే రాజన్న ఆలయ అభివృద్ధి రాజన్న ఆలయ అభివృద్ధి పై శృంగేరి పీఠాధిపతుల శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి,శ్రీశ్రీశ్రీ విధుషేకర స్వామి వారిని కలిసిన ప్రతినిధులు బృందం స్వామి వారినీ కలిసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి వేముల శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు, ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, విటిడిఎ వైస్ చైర్మన్ గరిమ ఆగ్రవాల్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ శృంగేరి పీఠం తెలంగాణ రాష్ట్ర బాధ్యులు వ్యాసోజుల రాధకృష్ణా శర్మ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.బుధవారం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై వివరాలను తెలియజేసేందుకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నమూనాలు, ఫొటోలను పీఠాధిపతికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 2000 వేల కోట్ల నిధులు కేటాయించారని, గోదావరి పుష్కరాల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని స్వామి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రెండు వేల కోట్లకు పైచిలుక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖతో పాటు అధికారులు, ఆలయ అర్చకులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.250 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 55 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో రూ.50 కోట్లు, అనంతరం రూ.100 కోట్లు, తాజాగా రూ.99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. వేములవాడ ఆలయ గర్భాలయం, మహామండపాన్ని తొలగిస్తున్నారంటూ గత రెండు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను శృంగేరి పీఠాధిపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం ,మహామండపాన్ని యథావిధి ఉంటుందని తెలిపారు..1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం, భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖర స్థాయిని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఆగమ శాస్త్రం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్దామని శృంగేరి  పీఠాధిపతి సూచించారని చెప్పారు.lఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో రేకుల షెడ్డు ఉన్న ప్రాంతంలో 20 అడుగులు, 24 అడుగుల విభాగాలతో మండప నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించిన శృంగేరి పీఠాధిపతి పనులు శుభప్రదంగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.ఆలయ అభివృద్ధి పనులకు సుమారు 4.80 లక్షల క్యూబిక్‌ ఫీట్ల శిల అవసరమవుతుందని అధికారులు వివరించినట్లు  తెలిపారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, ఆలయ ప్రాచీనతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా శృంగేరి పీఠాధిపతి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సనాతన సంప్రదాయాలను, ప్రాచీన దేవాలయాలను పరిరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలు, శృంగేరి పీఠాధిపతి సూచనలకు అనుగుణంగానే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. గర్భాలయం, మహామండపాన్ని ముట్టేది లేదు. శిఖర స్థాయిని పెంచే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా  శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారు సూచించినట్లు చేపడుతున్నామని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం, వేములవాడ దేవస్థానం తరఫున ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులు, ధార్మిక సలహాదారు గోవింద హరి, జిల్లా కలెక్టర్, వేద పండితులు, ప్రధాన అర్చకులు తదితరులు శృంగేరి పీఠాన్ని సందర్శించి విధుశేఖర భారతి స్వామివారిని కలిశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆలయ గర్భాలయాన్ని ఎక్కడా మార్చడం, విస్తీర్ణాన్ని పెంచడం, మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం వంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసినట్లు తెలిపారు.అదేవిధంగా శిఖర 1973 నిర్మాణం శిలామయంగా ఉండేదని, అనంతరం ఇటుక, సిమెంట్‌తో నిర్మించిన శిఖర భాగాన్ని ప్రస్తుతం చేపడుతున్న ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరిగి శిలామయంగా నిర్మించాలని సూచించినట్లు వెల్లడించారు. భక్తులకు దూరం నుంచే శిఖర దర్శనం కలిగేలా శిఖరాన్ని సుమారు నాలుగు అడుగుల మేర పెంచి, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని స్వామివారు సూచించినట్లు తెలిపారు.ఆలయ అభివృద్ధి విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్ర నిబంధనలను పాటిస్తూ ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి శృంగేరి పీఠం నుంచి లిఖితపూర్వక సూచనలు, శ్రీముఖం కూడా అందనున్న నేపథ్యంలో వాటి ప్రకారమే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించి శృంగేరి దక్షిణామ్నాయ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు భారతీతీర్థ మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వాములను ఆలయ అధికారులు, ప్రతినిధులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్లి, సందేహాలు మరియు సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఆలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై స్వామీజీలు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం శిఖర నిర్మాణం గతంలో ఇటుకలతో నిర్మించబడిన నేపథ్యంలో, శిఖరాన్ని శిలామయంగా నిర్మించడం శ్రేయస్కరమని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు.ప్రస్తుత గర్భాలయ ప్రాకారం పైన ఉన్న శిఖర స్థాయి నుంచి సుమారు నాలుగు అడుగుల ఎత్తులో శిలామయ శిఖర నిర్మాణం చేపట్టాలని సూచనలు అందినట్లు పేర్కొన్నారు. అయితే స్వామివారి మూలమూర్తులు, గర్భాలయం, మహా మండపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు జరుగుతాయి. అదేవిధంగా నిర్మాణానికి ముందు సంబంధిత ప్రదేశంలోని భూమి బలం, నిర్మాణ స్థిరత్వం తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాలని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలు, ఆశీస్సులతో వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పలు అంశాలపై స్పష్టత కోసం శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధిపతులైన ఉభయ మహాస్వాములను కలిసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు, ఆజ్ఞలు తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ గోపుర శిఖరాన్ని సుమారు 4.5 అడుగుల మేర పెంచి, కలశాన్ని శిలామయంగా నిర్మించే దిశగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఇటుకలతో నిర్మించిన గోపుర నిర్మాణానికి భిన్నంగా, ప్రస్తుతం శిలామయ నిర్మాణంతో ఆలయానికి పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.గర్భాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించడం లేదని, గర్భాలయం యథాతథంగా ఉంటుందని తెలిపారు.. ఈ విషయంలో భక్తులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.ఆలయ అభివృద్ధి, పునర్ వైభవానికి సంబంధించి శృంగేరి పీఠాధిపతుల ఆజ్ఞ, ఆశీస్సులు తీసుకున్నామని, భక్తుల సంతోషం, ప్రసన్నతే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు...
    1
    ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగానే రాజన్న ఆలయ అభివృద్ధి
రాజన్న ఆలయ అభివృద్ధి పై శృంగేరి పీఠాధిపతుల శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి,శ్రీశ్రీశ్రీ విధుషేకర స్వామి వారిని కలిసిన ప్రతినిధులు బృందం
స్వామి వారినీ కలిసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి వేముల శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు, ధార్మిక అడ్వైజర్ గోవింద హరి, విటిడిఎ వైస్ చైర్మన్ గరిమ ఆగ్రవాల్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ శృంగేరి పీఠం తెలంగాణ రాష్ట్ర బాధ్యులు వ్యాసోజుల రాధకృష్ణా శర్మ
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.బుధవారం వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై వివరాలను తెలియజేసేందుకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నమూనాలు, ఫొటోలను పీఠాధిపతికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 2000 వేల కోట్ల నిధులు కేటాయించారని, గోదావరి పుష్కరాల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని స్వామి వారికి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రెండు వేల కోట్లకు పైచిలుక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖతో పాటు అధికారులు, ఆలయ అర్చకులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.250 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 55 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో రూ.50 కోట్లు, అనంతరం రూ.100 కోట్లు, తాజాగా రూ.99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. వేములవాడ ఆలయ గర్భాలయం, మహామండపాన్ని తొలగిస్తున్నారంటూ గత రెండు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను శృంగేరి పీఠాధిపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం ,మహామండపాన్ని యథావిధి ఉంటుందని తెలిపారు..1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం, భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖర స్థాయిని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఆగమ శాస్త్రం, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్దామని శృంగేరి  పీఠాధిపతి సూచించారని చెప్పారు.lఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో రేకుల షెడ్డు ఉన్న ప్రాంతంలో 20 అడుగులు, 24 అడుగుల విభాగాలతో మండప నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించిన శృంగేరి పీఠాధిపతి పనులు శుభప్రదంగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.ఆలయ అభివృద్ధి పనులకు సుమారు 4.80 లక్షల క్యూబిక్‌ ఫీట్ల శిల అవసరమవుతుందని అధికారులు వివరించినట్లు  తెలిపారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, ఆలయ ప్రాచీనతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా శృంగేరి పీఠాధిపతి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. సనాతన సంప్రదాయాలను, ప్రాచీన దేవాలయాలను పరిరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలు, శృంగేరి పీఠాధిపతి సూచనలకు అనుగుణంగానే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. గర్భాలయం, మహామండపాన్ని ముట్టేది లేదు. శిఖర స్థాయిని పెంచే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పూర్తిగా ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా  శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారు సూచించినట్లు చేపడుతున్నామని దేవాదాయ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం, వేములవాడ దేవస్థానం తరఫున ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులు, ధార్మిక సలహాదారు గోవింద హరి, జిల్లా కలెక్టర్, వేద పండితులు, ప్రధాన అర్చకులు తదితరులు శృంగేరి పీఠాన్ని సందర్శించి విధుశేఖర భారతి స్వామివారిని కలిశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆలయ గర్భాలయాన్ని ఎక్కడా మార్చడం, విస్తీర్ణాన్ని పెంచడం, మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం వంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసినట్లు తెలిపారు.అదేవిధంగా  శిఖర 1973 నిర్మాణం శిలామయంగా ఉండేదని, అనంతరం ఇటుక, సిమెంట్‌తో నిర్మించిన శిఖర భాగాన్ని ప్రస్తుతం చేపడుతున్న ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరిగి శిలామయంగా నిర్మించాలని సూచించినట్లు వెల్లడించారు. భక్తులకు దూరం నుంచే శిఖర దర్శనం కలిగేలా శిఖరాన్ని సుమారు నాలుగు అడుగుల మేర పెంచి, ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని స్వామివారు సూచించినట్లు తెలిపారు.ఆలయ అభివృద్ధి విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్ర నిబంధనలను పాటిస్తూ ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి శృంగేరి పీఠం నుంచి లిఖితపూర్వక సూచనలు, శ్రీముఖం కూడా అందనున్న నేపథ్యంలో వాటి ప్రకారమే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
ఆలయ ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ మాట్లాడుతూ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించి శృంగేరి దక్షిణామ్నాయ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు భారతీతీర్థ మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వాములను ఆలయ అధికారులు, ప్రతినిధులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్లి, సందేహాలు మరియు సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఆలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై స్వామీజీలు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం శిఖర నిర్మాణం గతంలో ఇటుకలతో నిర్మించబడిన నేపథ్యంలో, శిఖరాన్ని శిలామయంగా నిర్మించడం శ్రేయస్కరమని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు.ప్రస్తుత గర్భాలయ ప్రాకారం పైన ఉన్న శిఖర స్థాయి నుంచి సుమారు నాలుగు అడుగుల ఎత్తులో శిలామయ శిఖర నిర్మాణం చేపట్టాలని సూచనలు అందినట్లు పేర్కొన్నారు. అయితే స్వామివారి మూలమూర్తులు, గర్భాలయం, మహా మండపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు జరుగుతాయి.
అదేవిధంగా నిర్మాణానికి ముందు సంబంధిత ప్రదేశంలోని భూమి బలం, నిర్మాణ స్థిరత్వం తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాలని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు.
శృంగేరి పీఠాధిపతుల సూచనలు, ఆశీస్సులతో వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆలయ ఇంచార్జీ స్థాన చార్యులు ఉమేష్ శర్మ మాట్లాడుతూ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పలు అంశాలపై స్పష్టత కోసం శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధిపతులైన ఉభయ మహాస్వాములను కలిసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు, ఆజ్ఞలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆలయ గోపుర శిఖరాన్ని సుమారు 4.5 అడుగుల మేర పెంచి, కలశాన్ని శిలామయంగా నిర్మించే దిశగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో  ఇటుకలతో నిర్మించిన గోపుర నిర్మాణానికి భిన్నంగా, ప్రస్తుతం శిలామయ నిర్మాణంతో ఆలయానికి పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.గర్భాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించడం లేదని, గర్భాలయం యథాతథంగా ఉంటుందని తెలిపారు.. ఈ విషయంలో భక్తులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.ఆలయ అభివృద్ధి, పునర్ వైభవానికి సంబంధించి శృంగేరి పీఠాధిపతుల ఆజ్ఞ, ఆశీస్సులు తీసుకున్నామని, భక్తుల సంతోషం, ప్రసన్నతే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని తెలిపారు...
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 min ago
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.
    1
    ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయాలి:మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ 
వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నందుకా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజీనామా చేయాల అంటూ వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్ బీజేపీ నేతలను బుధవారం వేములవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రశ్నించారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.
    1
    కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బిజెపి పై ఘాట్ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...దేశంలో రాజకీయ వాతావరణం బిజెపి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతుందని వచ్చే ఎలక్షన్ లలో రాష్ట్రంలో బిజెపికి ఉన్న స్థానాలు కాపాడుకుంటే గొప్ప అని బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు రాదన్నారు. అన్ని స్థానాలలో పోటీ చేసే పరిస్థితిలలో లేదన్నారు. ప్రస్తుతం ఉన్న స్థానాలు నిలబెట్టుకుటే గొప్పనారు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తే ఆ ఎనిమిది కూడా గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎపుడు ఎన్నికలు వచ్చిన బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ ఉంటుందని  జోష్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు మద్దతుగా విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ద్రోహదపడ్డారన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులకు రాహుల్ గాంధీ అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళ తప్పులను సరి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సవాల్ చేసేవారు లేరని నాలుగో సారి మోడీ ప్రధాని అవుతాడని బీజేపీ పగటి కలలు కంటున్నారు. దేశ ప్రజలు, యువత, విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కాదని తేలిపోయిందన్నారు. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని,  బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ప్రజలలో నమ్మకం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    15 hrs ago
  • వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కడియం..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామంలో శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బుధవారం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయం శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 86 రకాల సర్ప దోషాలకు నివారణ పూజలు ఈ ఒక్క శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలోనే జరుగుతాయని,ఇంత గోప్ప విశిష్టత కలిగిన ఆలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి సంబందించి ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని, ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేశవనగర్ నుండి శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీదుగా పెద్దపెండ్యాల వరకు త్వరలోనే రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
    2
    కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ... నగరంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు
భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ లో బిజెపి హర్ ఘర్ తిరంగా అభియాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. నగరంలోని భారతీయ జనతా పార్టీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాలు చేతబూని, దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో  ఉత్సాహంగా దేశభక్తితో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ, నగర వీధుల గుండా  సాగి భగత్ నగర్‌లోని భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ర్యాలీని ముందుండి నడిపించారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరి గుండెల్లో జాతీయ భావం ఉప్పొంగేలా ఈ ర్యాలీని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికి చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకొని కదం తొక్కడం నగరవాసులను విశేషంగా ఆకర్షించింది.ర్యాలీ ముగింపు సందర్భంగా భగత్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని, జాతీయగీతం జనగణమనను ఆలపించారు. జాతీయ సమైక్యతను, అఖండ భారత స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ తిరంగా ర్యాలీ నగరంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అధ్యక్షులు బండారి గాయత్రి, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ వేణు, నాంపెల్లి రేణుక శ్రీనివాస్, పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, బిజెపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,  నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • అమావాస్య సందర్భంగా కలిసుందాం రా మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ... కరీంనగర్‌ జిల్లాలోని కమాన్ సర్కిల్ సమీపంలో గల సప్తగిరి ఆయిల్ స్టోర్అమావాస్య సందర్భంగా ఆనందకరి అక్షయపాత్ర, కలిసుందాం రా మిత్ర బృందం, ఎలుగూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
    3
    అమావాస్య సందర్భంగా కలిసుందాం రా మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ...

కరీంనగర్‌ జిల్లాలోని కమాన్ సర్కిల్ సమీపంలో గల సప్తగిరి ఆయిల్ స్టోర్అమావాస్య సందర్భంగా ఆనందకరి అక్షయపాత్ర, కలిసుందాం రా మిత్ర బృందం, ఎలుగూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
    user_Shankerreddy
    Shankerreddy
    కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్‌, గంగుల డిమాండ్‌ ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    2
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి: వినోద్‌కుమార్‌, గంగుల డిమాండ్‌
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.