Shuru
Apke Nagar Ki App…
వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం రిపోర్టర్
వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.1
- NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.2
- సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు1
- నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*1
- కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.1
- అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే ఈ దేశం మనది,ఈ భూమి మనది... అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే1