logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.

3 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
3 hrs ago

కమలాపూర్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రత్యేక శిబిరం హనుమకొండ జిల్లా కమలాపూర్: గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం 2026–27లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కమలాపూర్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో పాటించాల్సిన పద్ధతులు, పంట వేసిన నాటి నుంచి దిగుబడి వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. విద్యార్థి ఓంకార్ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలు, పంట మార్పిడి విధానం, సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై రైతులతో కలిసి తెలుసుకుంటామని తెలిపారు. పంట వేసినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు అవసరమైన మెళకువలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.

More news from తెలంగాణ and nearby areas
  • గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
    1
    గ్రామస్తులంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్న మారమ్మ బోనాలు 
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో మారమ్మ బోనాలు బుధవారం రోజున గ్రామస్తులంతా ఘనంగా జరుపుకున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
  • అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥 🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం* 🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం* ✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-* 🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.* 🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.* 🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.* 🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.* 🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.* 🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*
    2
    అక్రమాలను బయట పెట్టడానికి మేమే వచ్చాం ఎమ్మెల్సీ శoబిపూర్ రాజు 
🔥 *ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు @ రాయదుర్గం మాల్కం చెరువు సందర్శన కామెంట్స్* 🔥
🔥*అక్రమాలను బయటపెట్టడానికే మేం వచ్చాం*
🔥 *కేటీఆర్ ఆదేశాలతో పనుల పరిశీలనకు వచ్చాం*
✍️ *ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు-*
🔥*కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు.*
🔥 *పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నరు.*
🔥 *రేవంత్ సర్కారు భూ దోపిడీలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నం.*
🔥 *టెసరాక్ట్ కంపెనీ భూ కేటాయింపులను కేటీఆర్ బయటపెట్టారు.*
🔥 *రాయదుర్గంలో కూడా అక్రమంగా భూములు కేటాయించారు.*
🔥 *భూ దోపిడి పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తాం.*
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.
    4
    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్‌ చౌక్‌ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది. దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 200 మీటర్ల జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్యార్థులు 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గణేష్‌ చౌక్‌ వరకు కొనసాగి తిరిగి అంబేద్కర్‌ సెంటర్‌కు చేరుకుంది.
దేశభక్తి నినాదాలు, గీతాలతో ర్యాలీ మార్గమంతా సందడిగా మారింది. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించాలనే ప్రధాని మోదీ పిలుపులో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు. ​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    2
    జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను తొలగించాలి-మాజీఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల
ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.
కరీంనగర్ లో గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.
​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజేపి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
​ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని అవసరమైతే జిఆర్ఎంబి సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • నర్సంపేట: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి................. చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం గ్రామానికి చెందిన బోడ శివ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు శివను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో శివ మృతి చెందినట్లు తెలిపారు. శివ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శివ వృత్తిరీత్యా విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
    1
    నర్సంపేట: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి.................
చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం గ్రామానికి చెందిన బోడ శివ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు శివను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో శివ మృతి చెందినట్లు తెలిపారు.
శివ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శివ వృత్తిరీత్యా విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.