logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు

15 hrs ago
user_Tharun
Tharun
Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
15 hrs ago

సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు

More news from తెలంగాణ and nearby areas
  • సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య  సందర్భంగా అన్నప్రసాద వితరణ
సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
  • వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్‌ ఉచ్చుకు ఫారెస్ట్‌ బీట్‌ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్‌ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్‌ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్‌ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్‌ ఉచ్చుకు ఫారెస్ట్‌ బీట్‌ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్‌ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్‌ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్‌ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది. వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను. కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది. వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
    1
    సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.

171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.

కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.

వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
సిరిసిల్ల నియోజకవర్గం, వీర్నపల్లి మండలంలో నేడు కంటి వెలుగు కింద 1,371 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
171 మందికి అవసరమైన కంటి ఆపరేషన్ల బాధ్యత కూడా నేనే తీసుకుంటానని హామీ ఇచ్చాను.
కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచి పథకానికి మంగళం పాడింది.
వ్యక్తిగతంగా నా నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగిస్తాను.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం *జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నేడు TRP జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ* *కార్యక్రమానికి dr కల్నల్ మాచర్ల బిక్షపతి గారు TRP జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాచర్ల బిక్షపతి డాక్టర్ గారు మాట్లాడుతూ గంజాయి పట్ల విద్యార్థులకు అవగాహనను కల్పించడంతోపాటు* *దానివల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు అర్థమయ్యే తీరుల చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ఉపాధ్యక్షులు యమంకి విజయ్ TRP పట్టణ సంయుక్త కార్యదర్శి ఎండి సల్మాన్ MD గుంశి బన్నీ చందు అజయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు*
    1
    జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం
*జనగామ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు TRP ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి నిర్మూలిద్దం  ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో నేడు TRP జనగామ జిల్లా యూత్ అధ్యక్షుడు పిట్టల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ* *కార్యక్రమానికి dr కల్నల్ మాచర్ల బిక్షపతి గారు TRP జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాచర్ల బిక్షపతి డాక్టర్  గారు మాట్లాడుతూ గంజాయి పట్ల విద్యార్థులకు అవగాహనను కల్పించడంతోపాటు* *దానివల్ల జరిగే అనర్ధాలను విద్యార్థులకు అర్థమయ్యే తీరుల చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్పి యూత్ జిల్లా ఉపాధ్యక్షులు యమంకి విజయ్ TRP పట్టణ సంయుక్త కార్యదర్శి ఎండి సల్మాన్ MD గుంశి బన్నీ చందు అజయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.