సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద
వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు
మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.1
- వేటగాళ్ల విద్యుత్ ఉచ్చు.. ఫారెస్ట్ బీట్ అధికారికి మృత్యుశిక్ష! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ అధికారి బలయ్యారు. బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. చెరువు సింగారం వెస్ట్ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కరెంట్ ఉచ్చుకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అటవీశాఖలో విషాదం నెలకొంది. కరెంట్ ఉచ్చు ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.1
- NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎస్‌ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.2
- _*PM ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో*_ _*కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం!*_ 🚨💰 _*హైదరాబాద్, రాయదుర్గ్‌లో మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన PM ఏక్తా యూనిటీ మాల్‌ను ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్!*_ _*మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అడ్డుకున్న పోలీసులు*_ _*ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..*_ _*ఏక్తా యూనిటీ మాల్ వద్ద భారీ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు*_ 🔥 #SCAMgress #CongressLootingTelangana _*PM ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో*_ _*కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం!*_ 🚨💰 _*హైదరాబాద్, రాయదుర్గ్‌లో మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన PM ఏక్తా యూనిటీ మాల్‌ను ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్!*_ _*మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అడ్డుకున్న పోలీసులు*_ _*ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..*_ _*ఏక్తా యూనిటీ మాల్ వద్ద భారీ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు*_ 🔥 #SCAMgress #CongressLootingTelangana1