Shuru
Apke Nagar Ki App…
కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. చాలా రోజులు తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో వర్షం కురవడంతో పంటలకు జీవం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్నారు.
Merzaa Tv
కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. చాలా రోజులు తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో వర్షం కురవడంతో పంటలకు జీవం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. చాలా రోజులు తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో వర్షం కురవడంతో పంటలకు జీవం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్నారు.1
- రాయదుర్గంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం సిడిమానుకు యువకుడిని తిప్పి మహోత్సవ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని కోటలో మారమ్మ దేవి ఆలయం వద్ద సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సిడిమానుకు యువకుడిని కట్టి మూడు చుట్లు తిప్పారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానిక భక్తులే కాక కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అద్భుత ఘట్టాన్ని వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు1
- బసంపల్లి గ్రామంలో గురువారం రాత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుక ను గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని బసంపల్లి గ్రామంలో గురువారం గాండ్ల కులస్తులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గాండ్ల కులస్తులు ప్రధాన కూడలిలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీ కట్టి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు దేశ్ కా ప్రధాని నరేంద్ర మోడీ కీ జై అంటూ నినాదాలు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు1
- వినాయక నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ పార్టీ పాటలు పెట్టడంపై ఫిర్యాదు వినయపూర్వకమైన విజ్ఞప్తి - పోలీసు వారికి 🙏 To: Singanamala Circle Police / Salakamcheruvu Police విషయం: వినాయక నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ పార్టీ పాటలు పెట్టడంపై ఫిర్యాదు. అయ్యా, తేదీ [నిమజ్జనం జరిగిన తేదీ వేయి] నాడు Nayanavari Palli (Singanamala Mandal) లో జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో DJ లో భక్తి పాటలకు బదులుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు పెద్ద శబ్దంతో ప్లే చేశారు. దీని వలన: 1. పండగ యొక్క భక్తి, పవిత్రత దెబ్బతింటుంది. 2. గ్రామంలో ఉన్న వివిధ పార్టీల భక్తుల మధ్య అనవసర గొడవలకు దారి తీస్తుంది. 3. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రాబోయే పండగలు, ఊరేగింపులలో భక్తి పాటలు మాత్రమే పెట్టేలా నియమాలు పెట్టాలని, రాజకీయ పాటలు నిషేధించాలని కోరుతున్నాము. ఇట్లు, నయనవారిపల్లి గ్రామ భక్తులు / యువత Nayanavari Palli, Singanamala Mandal, Anantapur District #SinganamalaPolice #AnantapurPolice #VinayakaNimajjanam #PublicGrievance1
- వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు ఆలూరు నియోజకవర్గం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడి సన్నిధిలో దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ దేవుడిని ప్రార్థించారు. అనంతరం గుమ్మనూరు కమలమ్మ, వడ్డే శ్రావణితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ప్రధాని మోదీ జన్మదినం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. 2026 జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న ప్రేమ, ఆశీర్వాదాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉండాలని కోరుకున్నారు.3
- అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు1
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయకుడి నిమజ్జనంలో ఊరేగింపులో సందడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. యువత రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని, రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ 'జై గణేశ్' నినాదాలతో సందడి చేశారు. అనంతరం సమీప చెరువులో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.1