Shuru
Apke Nagar Ki App…
*అక్షరానికి అమ్మనాన్నల రక్తం చెమట కావద్దు.. చదువు ప్రతి బిడ్డ హక్కు.!* తల్లిదండ్రుల రెక్కల కష్టం.. పిల్లల ఫీజులకు బలికావద్దు.. 1 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోనే పేదరికం అంతమవ్వాలి.! *అక్షరానికి అమ్మనాన్నల రక్తం చెమట కావద్దు.. చదువు ప్రతి బిడ్డ హక్కు.!* తల్లిదండ్రుల రెక్కల కష్టం.. పిల్లల ఫీజులకు బలికావద్దు.. 1 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోనే పేదరికం అంతమవ్వాలి.! ఫీజుల భారం లేని చదువు.. అప్పుల బాధలు లేని తల్లిదండ్రులు..*ఇదే టీఆర్పీ సంకల్పం..ఇదే మా లక్ష్యం.!* *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
SIRIPATI ARUNKUMAR
*అక్షరానికి అమ్మనాన్నల రక్తం చెమట కావద్దు.. చదువు ప్రతి బిడ్డ హక్కు.!* తల్లిదండ్రుల రెక్కల కష్టం.. పిల్లల ఫీజులకు బలికావద్దు.. 1 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోనే పేదరికం అంతమవ్వాలి.! *అక్షరానికి అమ్మనాన్నల రక్తం చెమట కావద్దు.. చదువు ప్రతి బిడ్డ హక్కు.!* తల్లిదండ్రుల రెక్కల కష్టం.. పిల్లల ఫీజులకు బలికావద్దు.. 1 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోనే పేదరికం అంతమవ్వాలి.! ఫీజుల భారం లేని చదువు.. అప్పుల బాధలు లేని తల్లిదండ్రులు..*ఇదే టీఆర్పీ సంకల్పం..ఇదే మా లక్ష్యం.!* *- టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
More news from తెలంగాణ and nearby areas
- రక్తం వచ్చేటట్లుగా లారీ డ్రైవర్ పిడుగులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ *లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్* గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్‌పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్‌స్పెక్టర్ పార్వతి ఇన్‌స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్‌పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్‌తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.1
- పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజవర్గం నుండి పోటీ చేస్తున్నా అని సంచలన ప్రకటన చేసిన తీన్మార్ మల్లన్న.1
- వరంగల్ పరిసర గ్రామాల్లో వర్షం: చిగురించిన పత్తి రైతుల ఆశలు పంతిని , ఆగస్టు 24: వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆందోళనలో ఉన్న పత్తి రైతులకు నేడు కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి విస్తారంగా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పత్తి పంట ఎదుగుదల లోపించి ఎండిపోయే ప్రమాదం ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం కురిసిన ఈ వర్షం పత్తి మొక్కల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో పంటకు ప్రాణం వచ్చినట్లయిందని, రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అనుకూలమైన వర్షాలు పడితే మంచి దిగుబడులు సాధిస్తామని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.2
- వరంగల్‌లో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.12 లక్షల చోరీ సొత్తు స్వాధీనం వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు, సీసీఎస్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత తెలిపారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, పెద్దపల్లికి చెందిన ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27) ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నివసిస్తున్నాడు. పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రివేళల్లో చోరీలకు పాల్పడేవాడని విచారణలో వెల్లడైంది. ఈ ఏడాది మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీలను నిందితుడే చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మహారాష్ట్రలో నాలుగు చోరీ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.1
- కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.3
- *మహిళా ఉపాధ్యాయురాలిపై దాడి* పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి *మహిళా ఉపాధ్యాయురాలిపై దాడి* పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు1