logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు యువ‌త‌ ముందుకు రావాలి:క‌లెక్ట‌ర్ విజయనగరం జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు యువ‌త ముందుకు రావాల‌ని పారిశ్రామికాభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్ర‌భుత్వ లక్ష్యమని ఆయన ఆకాంక్షించారు. ర్యాంప్ ప‌థ‌కంలో భాగంగా స్థానిక మహారాజా కోటలోని ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు ఆడిటోరియంలో 'లఘు ఉద్యోగ్ భారత్' ఆధ్వర్యంలో ఎపి ఎంఎస్ఎంఈ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ స‌హ‌కారంతో శుక్ర‌వారం ప్రారంభ‌మైన‌ రెండు రోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి జిల్లా క‌లెక్ట‌ర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఎదగాలని కోరారు. పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌నుకొనేవారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి, శిక్ష‌ణ ఇవ్వడానికి, ఉత్ప‌త్తి, మార్కెటింగ్ అవ‌కాశాల‌ప‌ట్ల ఒక ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకోవ‌డానికి ఇటువంటి స‌ద‌స్సులు దోహ‌దం చేస్తాయ‌ని అన్నారు. ప్ర‌తీఇంటా ఒక పారిశ్రామిక‌వేత్త ఉద్భ‌వించాల‌న్న‌ది గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆకాంక్ష అని చెప్పారు. త‌ద్వారా జిడిపి పెర‌గ‌డంతోపాటు, ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా వృద్ది చెందుతుంద‌ని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపన ద్వారా జిల్లా ఆర్థిక ముఖచిత్రం మారుతుందని, యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదగాలని ఈ సదస్సు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ప్ర‌తీ ఇంటా ఒక పారిశ్రామిక‌వేత్త‌తోపాటు, ఒక ఉద్యోగి కూడా రావాల‌న్న‌ది త‌మ అభిమ‌త‌మ‌ని పేర్కొన్నారు. దీనివ‌ల్ల ప్ర‌తీకుటుంబానికి సాధికార‌త సిద్దిస్తుంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెన‌క‌డుగు వేయ‌కుండా ముందుకు వెళ్లి ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని కోరారు. భోగాపురం విమానాశ్ర‌యం త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని, ఇది ఈ ప్రాంత అభివృద్దికి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని పంట‌లు, ఇత‌ర ఉత్ప‌త్తులను ఎగుమ‌తి చేసుకోవ‌చ్చున‌ని సూచించారు. పారిశ్రామిక వేత్త‌గా మార‌డంవ‌ల్ల త‌మ‌కే కాకుండా, త‌మ‌తోపాటు మ‌రికొంత‌మందికి ఉపాధి క‌ల్పించే అవ‌కాశం దొరుకుతుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను వినియోగించుకొని ఉత్త‌మ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని కోరారు. స‌ద‌స్సులో ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ జిఎం ఎంవి క‌రుణాక‌ర్‌, వ్య‌వ‌సాయ‌శాఖ జెడి విటి రామారావు, ఏపిఎంఐపి పిడి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, సిఐటిడి డిప్యుటీ డైరెక్ట‌ర్ వెంక‌ట‌కృష్ణ‌, ఎల్‌యుబి జాతీయ క‌మిటీ స‌భ్యులు ఏకె బాలాజీ, ఎన్ఎస్ఐసి బ్రాంచ్ మేనేజ‌ర్ టి.కామేశ్వ‌రి, ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఏడి డివిఎస్ఆర్ మూర్తితో పాటు పెద్ద‌ సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Kumar
Kumar
Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
be4b1970-839f-42b6-b485-3d87b1677950

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు యువ‌త‌ ముందుకు రావాలి:క‌లెక్ట‌ర్ విజయనగరం జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు యువ‌త ముందుకు రావాల‌ని పారిశ్రామికాభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్ర‌భుత్వ లక్ష్యమని ఆయన ఆకాంక్షించారు. ర్యాంప్ ప‌థ‌కంలో భాగంగా స్థానిక మహారాజా కోటలోని ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు ఆడిటోరియంలో 'లఘు ఉద్యోగ్ భారత్' ఆధ్వర్యంలో ఎపి ఎంఎస్ఎంఈ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ స‌హ‌కారంతో శుక్ర‌వారం ప్రారంభ‌మైన‌ రెండు రోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి జిల్లా క‌లెక్ట‌ర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ఎదగాలని కోరారు. పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌నుకొనేవారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి, శిక్ష‌ణ ఇవ్వడానికి, ఉత్ప‌త్తి, మార్కెటింగ్ అవ‌కాశాల‌ప‌ట్ల ఒక ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకోవ‌డానికి ఇటువంటి స‌ద‌స్సులు దోహ‌దం చేస్తాయ‌ని అన్నారు. ప్ర‌తీఇంటా ఒక పారిశ్రామిక‌వేత్త ఉద్భ‌వించాల‌న్న‌ది గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆకాంక్ష అని చెప్పారు. త‌ద్వారా జిడిపి పెర‌గ‌డంతోపాటు, ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా వృద్ది చెందుతుంద‌ని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపన ద్వారా జిల్లా ఆర్థిక ముఖచిత్రం మారుతుందని, యువత కేవలం ఉద్యోగాల

216286d9-7122-4ee5-828a-9bcf7ce789fa

కోసం ఎదురుచూడకుండా, పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదగాలని ఈ సదస్సు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ప్ర‌తీ ఇంటా ఒక పారిశ్రామిక‌వేత్త‌తోపాటు, ఒక ఉద్యోగి కూడా రావాల‌న్న‌ది త‌మ అభిమ‌త‌మ‌ని పేర్కొన్నారు. దీనివ‌ల్ల ప్ర‌తీకుటుంబానికి సాధికార‌త సిద్దిస్తుంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెన‌క‌డుగు వేయ‌కుండా ముందుకు వెళ్లి ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని కోరారు. భోగాపురం విమానాశ్ర‌యం త్వ‌ర‌లో ప్రారంభం కానుంద‌ని, ఇది ఈ ప్రాంత అభివృద్దికి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని పంట‌లు, ఇత‌ర ఉత్ప‌త్తులను ఎగుమ‌తి చేసుకోవ‌చ్చున‌ని సూచించారు. పారిశ్రామిక వేత్త‌గా మార‌డంవ‌ల్ల త‌మ‌కే కాకుండా, త‌మ‌తోపాటు మ‌రికొంత‌మందికి ఉపాధి క‌ల్పించే అవ‌కాశం దొరుకుతుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల‌ను వినియోగించుకొని ఉత్త‌మ పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని కోరారు. స‌ద‌స్సులో ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ జిఎం ఎంవి క‌రుణాక‌ర్‌, వ్య‌వ‌సాయ‌శాఖ జెడి విటి రామారావు, ఏపిఎంఐపి పిడి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, సిఐటిడి డిప్యుటీ డైరెక్ట‌ర్ వెంక‌ట‌కృష్ణ‌, ఎల్‌యుబి జాతీయ క‌మిటీ స‌భ్యులు ఏకె బాలాజీ, ఎన్ఎస్ఐసి బ్రాంచ్ మేనేజ‌ర్ టి.కామేశ్వ‌రి, ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఏడి డివిఎస్ఆర్ మూర్తితో పాటు పెద్ద‌ సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్
    1
    పాలకొండ-రాజాం ప్రధాన రహదారిపై యాక్సిడెంట్
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్‌కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    3
    పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడి శుక్రవారం ఉచి తహోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి, అంగన్ వాడి బి. పద్మ ఉన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
    1
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలం శైలాడ గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భాగంగా స్వామివారి పంచరాత్రి కళ్యాణం సామ్రాజ్య పట్టాభిషేకం సామూహిక పూజలు నిర్వహించారు విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేసి భక్తులకు ముత్యాల తలంబ్రాలు పంచిపెట్టారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించారు అనంతరం స్వామి వారి శోభాయాత్ర ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    1
    ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు
    user_Gadi Lalitha
    Gadi Lalitha
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.