Shuru
Apke Nagar Ki App…
కొలంబో రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది : సిరీస్ భారత్ కైవసం కొలంబో శ్రీలంక-భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీన్ఇండియా 1-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 503/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఫాల్-ఆన్ ఆడించగా.. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ను 429/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
దాసరి నటరాజు
కొలంబో రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది : సిరీస్ భారత్ కైవసం కొలంబో శ్రీలంక-భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీన్ఇండియా 1-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 503/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఫాల్-ఆన్ ఆడించగా.. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ను 429/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...1
- కుష్టు రోగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కాకినాడ ఎంపీజే ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ప్రతిపదిహేను రోజులకు ఒకసారి జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ( sharp) RTC బస్టాండ్ దగ్గర వున్న హిందూస్మశానవాటిక దగ్గర వున్న లెప్రసీ కాలనీ నందు 55 మంది లెప్రసీ రోగులకు డ్రెస్సింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు MPJ సానుభూతి పరురాలైన శ్రీమతి బీబి గారు వారి భర్త గారైనా స్వర్గీయ అలీ గారి జ్ఞాపకార్ధం ₹2500/- ఆర్ధిక సహాయం చేస్తున్నారు. డ్రెస్సింగ్ తో పాటు 39 మంది స్త్రీలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్ లు, చికెన్ బిర్యాని తోపాటు పరిశుభ్రతకు అవసరమయ్యే వస్తువుల (surf ప్యాకెట్ లు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, కొబ్బరి నూనె, షాంపూ ప్యాకెట్, soap) కిట్ కూడా లెప్రసి రోగులకు ప్రదానము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు Md హలీం గారు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం లో జనరల్ సెక్రటరీ Md ఉస్మాన్ షబ్బీర్ గారు, షాకీర్ గారు, దౌలానా బాషా గారు, Md ఇబ్రహీం గారు, కలీం గారు, Md రహ్మతుల్లా గారు పాల్గొన్నారు.1
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.1
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1