Shuru
Apke Nagar Ki App…
కంగ్టి: తడ్కల్ మోస్తరు వర్షం కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మంగళవారం నిర్వహించే వారాంతపు సంతకు చిరుజల్లులు అంతరాయం కలిగించాయి. వర్షంతో కూరగాయల విక్రేతలు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన పలువురు వర్షం కారణంగా వెనుదిరిగారు. దీంతో సంతలో వ్యాపారం మందగించి విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదు.
JALEEL RUSTUM REPORTER
కంగ్టి: తడ్కల్ మోస్తరు వర్షం కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో మంగళవారం నిర్వహించే వారాంతపు సంతకు చిరుజల్లులు అంతరాయం కలిగించాయి. వర్షంతో కూరగాయల విక్రేతలు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన పలువురు వర్షం కారణంగా వెనుదిరిగారు. దీంతో సంతలో వ్యాపారం మందగించి విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదు.
More news from తెలంగాణ and nearby areas
- *వేంకటేష్వార కాలోని లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు * జహీరాబాద్ అల్లీపూర్ మున్సిపాలిటీ 20 వ వార్డు లో వేంకటేష్వార కాలోని లో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వర్షకాలoలో బురద. వేసవి లో దుమ్ముతో విద్యార్థులు. వృద్దులు.మహిళలు. దుమ్ముతో అవస్థలు ఎదుర్కొoటున్నారాని స్థానికులు తెలిపారు రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు వెంటనే తీసి రోడ్డు నిర్మించాలని1
- ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి వెల్దుర్తి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి నెలకొంది. ట్రాక్టర్లతో భూములను దున్నిస్తూ రైతులు వరి నాట్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి వరకు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులు, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడటంతో సాగు పనులను ముమ్మరం చేశారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సీజన్‌లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో పొలాలన్నీ వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.1
- బాసర లోని పురాతన ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు... నిర్మల్ జిల్లా // బాసర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర లోని పురాతన ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం లో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిట్టెపు రామారావు-జ్యోతి దంపతులు దత్తాత్రేయ స్వామికి మహా అభిషేకం, అలంకరణ, మహా హారతి నిర్వహించారు. అనంతరం గురుపౌర్ణమి విశిష్టత గురించి ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. అన్నదాన కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆనందరావు పటేల్ కోరారు.1
- వన్యప్రాణుల రక్షకుడు మున్నాకు ఎంపీడీవో, సర్పంచులు, ఫారెస్ట్ అధికారుల ఘన సత్కారం నందిపేట మండలంలో వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలు అందిస్తున్న మున్నాకు ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఫారెస్ట్ అధికారులు ఘన సత్కారం అందించారు. గ్రామాల్లోకి, ఇళ్లలోకి వచ్చే పాములు, ఇతర వన్యప్రాణులను సురక్షితంగా పట్టుకుని ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా సేవలందిస్తున్న మున్నా ధైర్యసాహసాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మున్నాకు హృదయపూర్వక అభినందనలు1
- వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి, బ్యాంకు, రైతు వేదికల ద్వారా రైతులకు యురియా అందించాలి : తెలంగాణ రైతు సంఘం. వికారాబాద్ : వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి pacs రైతు వేదికల నుండి ప్రభుత్వం రైతులకు యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ప్రభుత్వం సబ్సిడీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్లి రైతు సంఘం వికారాబాద్ నాయకులు పరిశీలించారు. రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకొని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఎరువు ధరలు కాకుండా దళారులు తమ ఇష్టానుసారంగా ఏరియాను డిఏపిని అమ్ముతున్నారని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- ఘనాపూర్ పెద్దమ్మ ఆలయంలో చోరీ.. తాళాలు పగులగొట్టి అమ్మవారి నగలు అపహరణ తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన అనంతరం, బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన పూజారి నర్సింలు గేటు, ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక, పుస్తె మట్టెలు, సౌండ్ బాక్స్‌ను దుండగులు అపహరించినట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని కోరుతున్నారు.1
- క్రైమ్ న్యూస్: ఫిర్యాదుకు వస్తే బ్లాక్‌మెయిల్.. సీఐ నిర్వాకం బయటపెట్టిన బాధితురాలు హైదరాబాద్:కుటుంబ సమస్యలతో బాధపడుతూ న్యాయం చేకూర్చాలని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక మహిళ పట్ల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శ్రీనివాసులు రెడ్డి అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఘటన వివరాలు: నమ్మించి మోసం: బాధితురాలు తన కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రాగా, ఆమెకు సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి సీఐ శ్రీనివాసులు రెడ్డి దగ్గరయ్యారు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశారు. అబార్షన్ ఒత్తిడి: ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా, సీఐ ఆమెను బెదిరించి బలవంతంగా అబార్షన్ చేయించారు. వీడియోలతో బ్లాక్‌మెయిల్ – రూ. 2 కోట్లు వసూలు: సహజీవనం చేస్తున్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపిస్తూ ఆమెను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు. ఆ వీడియోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తూ బాధితురాలి నుంచి ఏకంగా రూ. 2 కోట్ల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. డీజీపీకి ఫిర్యాదు – ఉన్నతాధికారుల యాక్షన్ సీఐ శ్రీనివాసులు రెడ్డి వేధింపులు తాళలేక, ధైర్యం చేసిన బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సేకరించి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కి నేరుగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి నుంచి వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, సమర్పించిన ఆధారాల ఆధారంగా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో సీఐ అక్రమాలు, దౌర్జన్యాలు నిజమేనని తేలడంతో... శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన అధికారే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరిగేలా, దోషిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.1