Shuru
Apke Nagar Ki App…
వన్యప్రాణుల రక్షకుడు మున్నాకు ఎంపీడీవో, సర్పంచులు, ఫారెస్ట్ అధికారుల ఘన సత్కారం నందిపేట మండలంలో వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలు అందిస్తున్న మున్నాకు ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఫారెస్ట్ అధికారులు ఘన సత్కారం అందించారు. గ్రామాల్లోకి, ఇళ్లలోకి వచ్చే పాములు, ఇతర వన్యప్రాణులను సురక్షితంగా పట్టుకుని ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా సేవలందిస్తున్న మున్నా ధైర్యసాహసాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మున్నాకు హృదయపూర్వక అభినందనలు
Shaikg journalist
వన్యప్రాణుల రక్షకుడు మున్నాకు ఎంపీడీవో, సర్పంచులు, ఫారెస్ట్ అధికారుల ఘన సత్కారం నందిపేట మండలంలో వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలు అందిస్తున్న మున్నాకు ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఫారెస్ట్ అధికారులు ఘన సత్కారం అందించారు. గ్రామాల్లోకి, ఇళ్లలోకి వచ్చే పాములు, ఇతర వన్యప్రాణులను సురక్షితంగా పట్టుకుని ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా సేవలందిస్తున్న మున్నా ధైర్యసాహసాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మున్నాకు హృదయపూర్వక అభినందనలు
More news from తెలంగాణ and nearby areas
- వన్యప్రాణుల రక్షకుడు మున్నాకు ఎంపీడీవో, సర్పంచులు, ఫారెస్ట్ అధికారుల ఘన సత్కారం నందిపేట మండలంలో వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలు అందిస్తున్న మున్నాకు ఎంపీడీవో, వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఫారెస్ట్ అధికారులు ఘన సత్కారం అందించారు. గ్రామాల్లోకి, ఇళ్లలోకి వచ్చే పాములు, ఇతర వన్యప్రాణులను సురక్షితంగా పట్టుకుని ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా సేవలందిస్తున్న మున్నా ధైర్యసాహసాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మున్నాకు హృదయపూర్వక అభినందనలు1
- బాసర లోని పురాతన ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు... నిర్మల్ జిల్లా // బాసర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర లోని పురాతన ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం లో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిట్టెపు రామారావు-జ్యోతి దంపతులు దత్తాత్రేయ స్వామికి మహా అభిషేకం, అలంకరణ, మహా హారతి నిర్వహించారు. అనంతరం గురుపౌర్ణమి విశిష్టత గురించి ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. అన్నదాన కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆనందరావు పటేల్ కోరారు.1
- వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు... మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.4
- వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- గీతాశ్రమంలో ఘనంగా భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కీర్తనల ఆలాపన జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని గీతాశ్రమంలో బుధవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటలకు ఆశ్రమ నిర్వాహకులు, గ్రామస్తులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గురువులను గుర్తు చేసుకుంటూ భజన కీర్తనలను ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మౌన స్వామి, ప్రజలు పాల్గొన్నారు.1
- రాయికల్ సింగరావుపేట వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది వాగు దాటలేక రాకపోకలు నిలిచిపోయాయి జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని సింగరావుపేట వద్ద వాగు భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగుపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.1