గోరక్షకుల ముసుగులో చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోండి...సర్టిఫైడ్ జంతువులను మాత్రమే వారసంతల్లోకి అనుమతించండి కలెక్టర్, సీపీ లకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ వినతి గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, హఫీజ్ అస్గర్ అలీ, హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
గోరక్షకుల ముసుగులో చట్టాన్ని అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోండి...సర్టిఫైడ్ జంతువులను మాత్రమే వారసంతల్లోకి అనుమతించండి కలెక్టర్, సీపీ లకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ వినతి గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్
జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని
కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, హఫీజ్ అస్గర్ అలీ, హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
- గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజయ్య గౌడ్ గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, అధిక సంఖ్యలో మహిళలు గౌడ కులస్తులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద ఎండ తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. వేములవాడ–జగిత్యాల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు సైడ్ కు నిలిపివేశారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. మంటల్లో పూర్తిగా ట్రాక్టర్ ఇంజన్ కాలిపోయింది. నెమలికొండ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ వట్టెములకు ఇటుకలు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడితో ఇంజన్ హీటెక్కి మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరణ ఇచ్చారు.1
- పిల్లలు చదువు.. ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఆద్వర్యంలో సోమవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీ బాల్ లు పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల నృత్యం ఆలోచింపజేసింది.అంగన్వాడీ కేంద్రానికి పిల్లల ఎందరు వస్తున్నారు?రోజు పోషకాహారం ఇస్తున్నారా కలెక్టర్ ఆరా తీశారు? షి టీమ్ నంబర్ 87126 56425, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీ మానస్ 14416 హెల్ప్ లైన్ పై వివరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు.వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పిల్లల భద్రత.. అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలిపారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ.. సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు. ఎక్కువ శాతం హెల్మెట్ లేకుండా వెళ్తుండడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. తమ ఇంట్లో ద్విచక్ర వాహనం ఉన్న వారు హెల్మెట్ ధరించి బయటికి వెళ్లేలా.. కుటుంబ సభ్యులు సూచించాలని తెలిపారు. తమ, కుటుంబ రక్షణ కోసం హెల్మెట్ తీసుకోవాలని సూచించారు. మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడి గుడ్లు, బాలామృతం, స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. చదివే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పిల్లలకు తినడం, ఆడుకోవడం ఇతర అంశాల్లో రాణిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేశామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.ఆర్ బీ ఎస్ కే వాహనాలు ద్వారా పిల్లలను హాస్పిటల్ తీసుకువెళ్తారని వివరించారు. పిల్లలను దత్తత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని, పూర్తి వివరాలు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, దీంతో తాము అనుకున్న లక్ష్యం సులువుగా చేరుకుంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ కు బానిస అయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతారని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,జిల్లా వైద్యాధికారి రజిత, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సాగర్, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.3
- మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు. బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు లక్షా 50 వేల రూపాయల విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాలలో ఉన్న గ్రామస్తులు సచ్చందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బహరేన్ నివాస గ్రామస్తులు, గ్రామ ప్రజలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననని తెలిపారు. అనంతరం మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటుగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- కడెం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కడెం లోని తెలంగాణ తల్లి విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు1
- వరంగల్: భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వైభవోపేతంగా అశ్వవాహన సేవపై శ్రీ భద్రకాళి అమ్మవారిని ఊరేగించారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య మేళతాళాలతో అమ్మవారి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.1
- lనేడు భారత రాష్ట్రసమితి పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. పార్టీ పిలుపుమేరకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింత కుంటలోని పార్టీ జిల్లా కేంద్రంలో బారాస నాయకులతో కలసి గులాబీ జెండాను ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఒక పార్టీ ఉండాలని తలంచి టిఆర్ఎస్ పార్టీ నీ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రానికి తొలి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంచిన కెసిఆర్ ను మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని వారు పేర్కొన్నారు. బిఆర్ ఎస్ పార్టీ నీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం లో ప్రతి పక్షంగా ఉండి ప్రజలకోసం ఉద్యమిస్తూ.. వారికి అన్నివిథాలుగా అండగా ఉంటున్న ఏకైక పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో.. బిఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ తో పాటు, కార్పొరేటర్లు , గుగ్గిళ్ళ జయశ్రీ, నలువాల పుష్పలత-రవీందర్, అలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నగరమైనార్టీ విభాగం అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, బిఆర్ఎస్వి నగర ఆధ్యక్షులు బొంకూరి మోహన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జులు బారాస నాయకులు, పార్టీ కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.2
- పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరత తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్ది వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట లో డీజిల్ తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానం తో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రం లో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్ తో క్యూ కట్టరు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలనీ వాహనదారులు కోరుతున్నారు.1
- జగిత్యాల: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేశ్ మాట్లాడుతూ... ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలి దానాలు అయితే ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యల నాయకులు అభిమానులు పాల్గొన్నారు. - ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద - ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం, ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నాయకులు అయిల్నేని సాగర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1