logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేత అశ్వవాహన సేవ – భక్తులతో నిండిన పురవీధులు వరంగల్: భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వైభవోపేతంగా అశ్వవాహన సేవపై శ్రీ భద్రకాళి అమ్మవారిని ఊరేగించారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య మేళతాళాలతో అమ్మవారి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేత అశ్వవాహన సేవ – భక్తులతో నిండిన పురవీధులు వరంగల్: భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వైభవోపేతంగా అశ్వవాహన సేవపై శ్రీ భద్రకాళి అమ్మవారిని ఊరేగించారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య మేళతాళాలతో అమ్మవారి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ
    1
    - ఉచిత విద్య
- ఉచిత వైద్యం 
- రైతే రాజు 
- 4 లక్షల ఉద్యోగాలు
- సామాజిక తెలంగాణ
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై జనాగ్రహం వ్యక్తం అయింది. ఏకంగా బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పౌర సేవల కార్యాలయం దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేయర్ సమక్షంలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో రూపాయికి అంత్యక్రియల పథకం అమల్లో అధికారులు నిర్లక్ష్యంపై అధికార పార్టీ బిజేపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ఫైర్ అయ్యారు. అధికారులను తీరుపై ఆగ్రహంతో దూషించి పౌర సేవల కార్యాలయం దాడి చేసి హల్చల్ చేశారు.‌ అధికారంలో ఉన్న వారే ఆవేదనతో ఆందోళనకు దిగి పర్నిచర్ ధ్వంసం చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ లోని 35 డివిజన్ కు చెందిన కొండమీది వెంకటేశం అనారోగ్యం మృతిచెందగా నిరుపేద పేద కుటుంబానికి చెందినవారు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న రూపాయికే అంత్యక్రియల పథకం వర్తింపజేయాలని మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంబంధిత అధికారులు సరిగా స్పందించకపోవడంతో రమేష్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తన ప్రతాపం చూపారు. విధినిర్వహణలో ఉండే ఉద్యోగిని పిలిపించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మనిషి చనిపోయి బాధతో పోన్ చేస్తే రెస్పాండ్ కాని సంబంధిత అధికారిని పిలిపించండని ర్యాష్ గా ప్రవర్తించారు. అదే సమయంలో మేయర్ శ్రీనివాస్ రాగ ఆయన సమక్షంలోనే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బీజేపీకి చెందిన మేయర్ సమక్షంలోనే బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ వ్యవహరించిన తీరు కలకలం సృష్టించింది. మృతుడికి కరీంనగర్ లో స్వంత ఇల్లు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వరంగల్ లో ఉండడం వల్ల రూపాయికే అంతక్రియల పథకం వర్తింపచజేయలేదని అధికారులు చెప్పగా సొంత ఇల్లు ఉన్న వ్యక్తికి ఎలా పథకాన్ని వర్తింపజేయరని రమేష్ నిలదీశారు. రమేష్ వ్యవహరించిన తీరుతో మేయర్ నిర్ఘాంతపోయి వెంటనే నిర్లక్ష్యం నిర్వహించిన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునే పనిలో మునిసిపల్ అధికారులు నిమగ్నమై, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దూషించిన మాజీ డిప్యూటీ మేయర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.‌
    1
    కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పౌర సేవలపై జనాగ్రహం వ్యక్తం అయింది. ఏకంగా బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పౌర సేవల కార్యాలయం దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మేయర్ సమక్షంలోనే ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో రూపాయికి అంత్యక్రియల పథకం అమల్లో అధికారులు నిర్లక్ష్యంపై అధికార పార్టీ బిజేపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ఫైర్ అయ్యారు. అధికారులను తీరుపై ఆగ్రహంతో  దూషించి పౌర సేవల కార్యాలయం దాడి చేసి హల్చల్ చేశారు.‌ అధికారంలో ఉన్న వారే ఆవేదనతో ఆందోళనకు దిగి పర్నిచర్ ధ్వంసం చేయడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. కరీంనగర్ లోని 35 డివిజన్ కు చెందిన కొండమీది వెంకటేశం అనారోగ్యం మృతిచెందగా నిరుపేద పేద కుటుంబానికి చెందినవారు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న రూపాయికే అంత్యక్రియల పథకం వర్తింపజేయాలని మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంబంధిత అధికారులు సరిగా స్పందించకపోవడంతో రమేష్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తన ప్రతాపం చూపారు. విధినిర్వహణలో ఉండే ఉద్యోగిని పిలిపించాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మనిషి చనిపోయి బాధతో పోన్ చేస్తే రెస్పాండ్ కాని సంబంధిత అధికారిని పిలిపించండని ర్యాష్ గా ప్రవర్తించారు. అదే సమయంలో మేయర్ శ్రీనివాస్ రాగ ఆయన సమక్షంలోనే అధికారులతో వాగ్వివాదానికి దిగారు. బీజేపీకి చెందిన మేయర్ సమక్షంలోనే బిజెపికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ వ్యవహరించిన తీరు కలకలం సృష్టించింది.
మృతుడికి కరీంనగర్ లో స్వంత  ఇల్లు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వరంగల్ లో ఉండడం వల్ల రూపాయికే అంతక్రియల పథకం వర్తింపచజేయలేదని అధికారులు చెప్పగా సొంత ఇల్లు ఉన్న వ్యక్తికి ఎలా పథకాన్ని వర్తింపజేయరని రమేష్ నిలదీశారు. రమేష్ వ్యవహరించిన తీరుతో మేయర్ నిర్ఘాంతపోయి వెంటనే నిర్లక్ష్యం నిర్వహించిన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునే పనిలో మునిసిపల్ అధికారులు నిమగ్నమై, ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దూషించిన మాజీ డిప్యూటీ మేయర్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.‌
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.
    1
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, హఫీజ్ అస్గర్ అలీ, హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
    3
    గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, కావాలని దాష్టీకాన్ని ప్రదర్శించే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈదుల్ అజ్ఞ బక్రీద్ పండుగ నిర్వహణకై సహకరించాలని, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో.. నగర ఇస్లామీయ ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి, సీపీ గౌష్ ఆలం లను వారి కార్యాలయాల్లో కలిసి వినతిపత్రములు అందజేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ వినతి పత్రాలను అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బక్రీద్ లో ఖుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడలు వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని.. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని, వారసంతల్లో ఆవులు వెళ్లకుండా ఈ బక్రీద్ మాసం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఖుర్బానీ కోసం  ఆరోగ్య కరమైన జంతువులు ఉండేట్లు చూసుకోవాలని, చట్ట పరిధిలో ఉండి పండుగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయొద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. జంతువులు రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు ఆపితే వారికి సహకరించాలని, గోరక్షకుల ముసుగులో దుండగులు ఆపినచో తక్షణమే 100కు కాల్ చేయాలని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అల్లరి మూకలపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడిజిల్లాలోని పశువుల  సంతల్లో వెటర్నరీ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, వెటర్నరీ డాక్టర్ల చేత సర్టిఫైడ్ చేయబడిన పశువులను మాత్రమే సంతల్లోకి అనుమతించాలని కోరారు. ఈఅంశంపై అన్ని పార్టీలతో కలిసి జిల్లా స్థాయిలో కలెక్టర్, సీపీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జమియతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షుడు మౌలానా అలీమోద్దీన్ నిజామీ, జమియత్ ఆహిలే హాదీస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమీ, సదర్ ఖాజీ  హఫీజ్ మన్కబత్ షాఖాన్, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, సిటీ జమియతుల్ ఉలమా ఉపాధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ రిజ్వాన్, ముఫ్తీ నదీమ్, 
హఫీజ్ అస్గర్ అలీ, 
హఫీజ్ అబ్దుల్ జబ్బార్, ఎంఐఎం కార్పొరేటర్లు ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, నాయకులు అసదుల్లా బేగ్, బాబుజానీ, లయన్ గఫ్ఫార్, లింగంపల్లి శ్రీనివాస్, అసిమ్, మజారోద్దీన్, గాలి రాజు, సురేశ్, అక్బర్ అలీ, వాజిద్ అలీఖాన్, సాజిద్, మెరాజ్, షబ్బీర్, ఖాలీద్, ఖదీర్ ఖాన్, కౌసర్ మజీద్ అధ్యక్షుడు డాక్టర్ యునూస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్‌పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    1
    గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది.
పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్‌పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి రచర్ల కార్తీక్ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 132 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని సమాచారం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే స్వభావం లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడం, ఘటనపై స్పష్టత లేకపోవడం, మృతదేహాన్ని తాము వచ్చేసరికే పోస్టుమార్టంకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి రచర్ల కార్తీక్ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.
ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 132 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని సమాచారం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే స్వభావం లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడం, ఘటనపై స్పష్టత లేకపోవడం, మృతదేహాన్ని తాము వచ్చేసరికే పోస్టుమార్టంకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • వరంగల్ జిల్లా,మేడపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో *పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు..ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిగట్టు వెంకన్న మరియు స్థానిక సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య మరియు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, మాజీ గ్రామపార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఆవునురి మురళి, అకారపు రాజు, మాజీ టిసి తాళ్లపల్లి సుదర్శన్, మాజీ ఎంపిటిసి పాడియాభద్రు MD ఫాష, వార్డు సభ్యులు తిరుపతి, మరియు ఆవునూరి ఏకాంబరం, పెరుమాండ్ల బసవయ్య ముఖ్యులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా,మేడపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో  *పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు..ఘనంగా జరిగింది 
ఈ కార్యక్రమం లో బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిగట్టు వెంకన్న మరియు స్థానిక సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య  మరియు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, మాజీ గ్రామపార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఆవునురి మురళి, అకారపు రాజు, మాజీ టిసి తాళ్లపల్లి సుదర్శన్, మాజీ ఎంపిటిసి పాడియాభద్రు MD ఫాష, వార్డు సభ్యులు  తిరుపతి, మరియు ఆవునూరి ఏకాంబరం, పెరుమాండ్ల బసవయ్య ముఖ్యులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద ఎండ తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. వేములవాడ–జగిత్యాల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు సైడ్ కు నిలిపివేశారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. మంటల్లో పూర్తిగా ట్రాక్టర్ ఇంజన్ కాలిపోయింది. నెమలికొండ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్‌ వట్టెములకు ఇటుకలు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడితో ఇంజన్ హీటెక్కి మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరణ ఇచ్చారు.
    1
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద ఎండ తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. వేములవాడ–జగిత్యాల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు సైడ్ కు నిలిపివేశారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది.
మంటల్లో పూర్తిగా ట్రాక్టర్ ఇంజన్ 
కాలిపోయింది. నెమలికొండ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్‌ వట్టెములకు ఇటుకలు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడితో ఇంజన్ హీటెక్కి మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరణ ఇచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.