Shuru
Apke Nagar Ki App…
మేడపల్లి గ్రామ లో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు.... వరంగల్ జిల్లా,మేడపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో *పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు..ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిగట్టు వెంకన్న మరియు స్థానిక సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య మరియు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, మాజీ గ్రామపార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఆవునురి మురళి, అకారపు రాజు, మాజీ టిసి తాళ్లపల్లి సుదర్శన్, మాజీ ఎంపిటిసి పాడియాభద్రు MD ఫాష, వార్డు సభ్యులు తిరుపతి, మరియు ఆవునూరి ఏకాంబరం, పెరుమాండ్ల బసవయ్య ముఖ్యులు పాల్గొన్నారు.
Chetty:Ramesh
మేడపల్లి గ్రామ లో తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు.... వరంగల్ జిల్లా,మేడపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో *పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు..ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిగట్టు వెంకన్న మరియు స్థానిక సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య మరియు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, మాజీ గ్రామపార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఆవునురి మురళి, అకారపు రాజు, మాజీ టిసి తాళ్లపల్లి సుదర్శన్, మాజీ ఎంపిటిసి పాడియాభద్రు MD ఫాష, వార్డు సభ్యులు తిరుపతి, మరియు ఆవునూరి ఏకాంబరం, పెరుమాండ్ల బసవయ్య ముఖ్యులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా,చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ నేపథ్యంలో గ్రామస్తులు సంబరాలు నిర్వహించారు. బాంబులు పేల్చుతూ పండుగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు.1
- *వరంగల్ జిల్లా :*నర్సంపేట పట్టణంలోని పలు పెట్రోల్ బంక్ ల వద్ద నోస్ర్టాక్ బోర్డులు పెట్టిన బంకుల యాజమాన్యాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంక్ ల వద్ద నిలిచిపోయి పడిగాపులు కాస్తు బారులుతీరిన వాహనదారులు.2
- *తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగానికి ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*1
- ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,* సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో సంబంధిత అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని, ప్రతి దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించాలని, సూచించారు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని కార్యక్రమాలను అందరూ సమిష్టిగా విజయవంతం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు, ప్రజావాణి దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కోరారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు జరిగే స్వీయ జన గణన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు తమ పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు, ప్రజావాణిలో వివిధ శాఖలలో మొత్తం (179) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు, మరిపెడ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 264లో గల 02 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని, నిరుపేదలైన సుమారు 30 మంది పాత్రికేయులకు నివాస గృహాల కోసం కేటాయించాలని మరిపెడ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న భూ మార్పిడి, వారసత్వ హక్కులు మరియు ఇతర ధరణి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు మరియు ఆసరా పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి వినతులు అందాయి. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు తాగునీటి సమస్యలపై ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణి కార్యక్రమం సమయం పూర్తి అయిన అదనంగా రెండున్నర గంటల వరకు దరఖాస్తులతో వేచి ఉన్న ప్రజల యొక్క వినుతులను స్వీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, మండల కేంద్రాలలోని గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యలను వివరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు, ఈ ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారినీ కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మధుసూదన రాజు, అన్ని విభాగాల జిల్లా అధికారులు,పర్యవేక్షకులు మదన్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- మహబూబాబాద్: పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకులో నిన్నటి నుంచి సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. సీఎన్‌జీ కోసం వచ్చిన ఆటోలు, కార్లు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని, అవసరమైతే మరో సీఎన్‌జీ బంక్‌కు అనుమతి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద ఎండ తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. వేములవాడ–జగిత్యాల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు సైడ్ కు నిలిపివేశారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. మంటల్లో పూర్తిగా ట్రాక్టర్ ఇంజన్ కాలిపోయింది. నెమలికొండ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ వట్టెములకు ఇటుకలు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడితో ఇంజన్ హీటెక్కి మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరణ ఇచ్చారు.1
- - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ1