Shuru
Apke Nagar Ki App…
సీఎన్‌జీ కొరతతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తీవ్రం – ప్రమాదాల భయంతో వణికుతున్న మహబూబాబాద్ ప్రజలు మహబూబాబాద్: పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకులో నిన్నటి నుంచి సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. సీఎన్‌జీ కోసం వచ్చిన ఆటోలు, కార్లు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని, అవసరమైతే మరో సీఎన్‌జీ బంక్‌కు అనుమతి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Mediya wgl medical wgl
సీఎన్‌జీ కొరతతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తీవ్రం – ప్రమాదాల భయంతో వణికుతున్న మహబూబాబాద్ ప్రజలు మహబూబాబాద్: పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకులో నిన్నటి నుంచి సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. సీఎన్‌జీ కోసం వచ్చిన ఆటోలు, కార్లు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని, అవసరమైతే మరో సీఎన్‌జీ బంక్‌కు అనుమతి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ1
- బెంగళూరులోని మడివాళలో ఉన్న కృపానిధి కళాశాల కేంద్రంలో CET పరీక్షకు హాజరైన ఒక విద్యార్థి ఇలా అన్నాడు: "నేను ఉదయం సుమారు 9:40 గంటలకు పరీక్షా కేంద్రానికి వెళ్లాను. నా బ్యాగును గదిలో ఉంచాను, కానీ నా 'జంధ్యం' (Janeu) కనిపించడంతో వారు నన్ను లోపలికి అనుమతించలేదు. మీరు దానిని తీసివేయాలని వారు చెప్పడం మొదలుపెట్టారు. ఒకవేళ మీరు దానిని తీసివేయకపోతే, పరీక్ష రాయడానికి మిమ్మల్ని అనుమతించలేమని వారు స్పష్టం చేశారు... మరో ఏడుగురు విద్యార్థులను కూడా వారి జంధ్యాలను తీసివేయమని కోరారు. మాకు వేరే మార్గం లేకపోవడంతో మేము వాటిని తీసివేశాము... నాకు చాలా బాధ కలిగింది. నేను CET పరీక్షను సరిగ్గా రాయలేకపోయాను." ఇది నిజంగా చాలా సిగ్గుచేటు ఇలాంటి విధానాల పట్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ సెక్యులరిజం పేరుతో మాట వినకపోతే బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది జాగో హిందూ జాగో హిందువులారా మేల్కొనండి ఇలాంటి ధర్మ వ్యతిరేక కార్యకలాపాల పట్ల నిరసన గళం వినిపించండి చేయి చేయి కలుపుదాం మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై1
- పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరత తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్ది వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట లో డీజిల్ తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానం తో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రం లో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్ తో క్యూ కట్టరు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలనీ వాహనదారులు కోరుతున్నారు.1
- హిందూ ఏక్తా యాత్రలో మంగళవారం రోజున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొనాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అందరిని ఆహ్వానించారు దాదాపుగా 3,000 మంది హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయాలని హనుమాన్ల రాజిరెడ్డి సెక్రటరీ కోరారు2
- గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్‌పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1
- Post by Tagore1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా కూడబెట్టిన అక్రమ సొమ్ము పంచుకోవడంలో కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే బిఆర్ఎస్ నేతలు విడిపోయి కొత్త పార్టీలు పెడుతున్నారని ఆరోపించారు. కవిత ఏర్పాటు చేసిన పార్టీ స్వతంత్రం కాదని, అది కేసీఆర్ వ్యూహంలో భాగమని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ రాజకీయ నాటకం నడుస్తోందని విమర్శించారు. అవినీతి సొమ్ము పంపకాలే ఈ పరిణామాలకు కారణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ ఉనికి కోల్పోతోందని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు.1
- వరంగల్ జిల్లా,మేడపల్లి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి ఆశీర్వాదంతో *పార్టీ ఆవిర్భావ దినోత్సవా వేడుకలు..ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో బి ఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నడిగట్టు వెంకన్న మరియు స్థానిక సర్పంచ్ అర్రేమ్ సాంబయ్య మరియు మాజీ సర్పంచ్ లావుడియా తిరుపతి, మాజీ గ్రామపార్టీ అధ్యక్షుడు వార్డ్ మెంబర్ చింతనూరి సూర్యనారాయణ గౌడ్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఆవునురి మురళి, అకారపు రాజు, మాజీ టిసి తాళ్లపల్లి సుదర్శన్, మాజీ ఎంపిటిసి పాడియాభద్రు MD ఫాష, వార్డు సభ్యులు తిరుపతి, మరియు ఆవునూరి ఏకాంబరం, పెరుమాండ్ల బసవయ్య ముఖ్యులు పాల్గొన్నారు.1
- జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు. 4