కరీంనగర్ లో శ్రీ చైతన్య కాలేజీలో భారీ చోరీని ఛేదించిన పోలీసులు...పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్ అరెస్టు జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు.
కరీంనగర్ లో శ్రీ చైతన్య కాలేజీలో భారీ చోరీని ఛేదించిన పోలీసులు...పాత నేరస్తుడు బొద్దుల యుగేందర్ అరెస్టు జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు,
సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి
వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన
సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు.
- గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజయ్య గౌడ్ గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, అధిక సంఖ్యలో మహిళలు గౌడ కులస్తులు పాల్గొన్నారు.1
- lనేడు భారత రాష్ట్రసమితి పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. పార్టీ పిలుపుమేరకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింత కుంటలోని పార్టీ జిల్లా కేంద్రంలో బారాస నాయకులతో కలసి గులాబీ జెండాను ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఒక పార్టీ ఉండాలని తలంచి టిఆర్ఎస్ పార్టీ నీ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రానికి తొలి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంచిన కెసిఆర్ ను మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని వారు పేర్కొన్నారు. బిఆర్ ఎస్ పార్టీ నీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం లో ప్రతి పక్షంగా ఉండి ప్రజలకోసం ఉద్యమిస్తూ.. వారికి అన్నివిథాలుగా అండగా ఉంటున్న ఏకైక పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో.. బిఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ తో పాటు, కార్పొరేటర్లు , గుగ్గిళ్ళ జయశ్రీ, నలువాల పుష్పలత-రవీందర్, అలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నగరమైనార్టీ విభాగం అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, బిఆర్ఎస్వి నగర ఆధ్యక్షులు బొంకూరి మోహన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జులు బారాస నాయకులు, పార్టీ కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.2
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి రచర్ల కార్తీక్ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 132 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని సమాచారం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే స్వభావం లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడం, ఘటనపై స్పష్టత లేకపోవడం, మృతదేహాన్ని తాము వచ్చేసరికే పోస్టుమార్టంకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు.1
- జైపూర్ మండల్ లో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాయకులు జైపూర్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సెట్పల్లి పౌనూర్ గోపాల్పూర్ జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి ఇచ్చిందన్నారు రాష్ట్రంలో మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొంతమంది తమ పనిని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.వడ్డెర కులానికి చెందిన సుమారు 30 కుటుంబాలు గత 70 ఏళ్లుగా కోమడిబండ అటవీ ప్రాంతంలో అడవిలో లభించే పండ్లు, పలాలతో పాటు గుట్టలపై ఉన్న బండరాళ్లను కొట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే మిషన్ భగీరథ పథకం కింద గుట్టపై వాటర్ ట్యాంక్ నిర్మాణం సమయంలో అధికారులు తమను అక్కడి నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్న సమయంలో, గ్రామానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమి తమదేనని, గుట్టపై ఉన్న బండరాళ్లు కూడా తమవేనని చెబుతూ తమ ఉపాధిని అడ్డు కుంటున్నారని వడ్డెర కులస్తులు వాపోయారు. అంతేకాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, జీవనాధారంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం బండరాళ్లు కొట్టి జీవిస్తున్న తమకు తక్షణమే న్యాయం చేసి జీవనోపాధి కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. లేకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వడ్డెర కులస్తులు హెచ్చరించారు.4
- మహబూబాబాద్ జిల్లా,చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ నేపథ్యంలో గ్రామస్తులు సంబరాలు నిర్వహించారు. బాంబులు పేల్చుతూ పండుగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు.1
- జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు. 4
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా కూడబెట్టిన అక్రమ సొమ్ము పంచుకోవడంలో కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే బిఆర్ఎస్ నేతలు విడిపోయి కొత్త పార్టీలు పెడుతున్నారని ఆరోపించారు. కవిత ఏర్పాటు చేసిన పార్టీ స్వతంత్రం కాదని, అది కేసీఆర్ వ్యూహంలో భాగమని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ రాజకీయ నాటకం నడుస్తోందని విమర్శించారు. అవినీతి సొమ్ము పంపకాలే ఈ పరిణామాలకు కారణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ ఉనికి కోల్పోతోందని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు.1
- *వరంగల్ జిల్లా :*నర్సంపేట పట్టణంలోని పలు పెట్రోల్ బంక్ ల వద్ద నోస్ర్టాక్ బోర్డులు పెట్టిన బంకుల యాజమాన్యాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంక్ ల వద్ద నిలిచిపోయి పడిగాపులు కాస్తు బారులుతీరిన వాహనదారులు.2