Shuru
Apke Nagar Ki App…
గునుకుల కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు.... గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజయ్య గౌడ్ గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, అధిక సంఖ్యలో మహిళలు గౌడ కులస్తులు పాల్గొన్నారు.
Vodnala thirupthi
గునుకుల కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు.... గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు మోస్తూ డప్పు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజయ్య గౌడ్ గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, అధిక సంఖ్యలో మహిళలు గౌడ కులస్తులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- హిందూ ఏక్తా యాత్రలో మంగళవారం రోజున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొనాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అందరిని ఆహ్వానించారు దాదాపుగా 3,000 మంది హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయాలని హనుమాన్ల రాజిరెడ్డి సెక్రటరీ కోరారు2
- పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరత తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్ది వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట లో డీజిల్ తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానం తో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రం లో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్ తో క్యూ కట్టరు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలనీ వాహనదారులు కోరుతున్నారు.1
- మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు. బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు లక్షా 50 వేల రూపాయల విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాలలో ఉన్న గ్రామస్తులు సచ్చందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బహరేన్ నివాస గ్రామస్తులు, గ్రామ ప్రజలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననని తెలిపారు. అనంతరం మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటుగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు M.0. డా. ఆస్మా తెలిపారు. జిల్లా మానసిక ఆరోగ్యాధికారి మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల అందజేశారు. అనంతరం ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగంపై, సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాలు నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.1
- తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!1
- వెల్దుర్తిలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకుడు కథల కృష్ణ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.1
- lనేడు భారత రాష్ట్రసమితి పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. పార్టీ పిలుపుమేరకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింత కుంటలోని పార్టీ జిల్లా కేంద్రంలో బారాస నాయకులతో కలసి గులాబీ జెండాను ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఒక పార్టీ ఉండాలని తలంచి టిఆర్ఎస్ పార్టీ నీ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రానికి తొలి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంచిన కెసిఆర్ ను మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని వారు పేర్కొన్నారు. బిఆర్ ఎస్ పార్టీ నీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం లో ప్రతి పక్షంగా ఉండి ప్రజలకోసం ఉద్యమిస్తూ.. వారికి అన్నివిథాలుగా అండగా ఉంటున్న ఏకైక పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో.. బిఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ తో పాటు, కార్పొరేటర్లు , గుగ్గిళ్ళ జయశ్రీ, నలువాల పుష్పలత-రవీందర్, అలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నగరమైనార్టీ విభాగం అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, బిఆర్ఎస్వి నగర ఆధ్యక్షులు బొంకూరి మోహన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జులు బారాస నాయకులు, పార్టీ కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.2
- జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు. 4
- జగిత్యాల: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేశ్ మాట్లాడుతూ... ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలి దానాలు అయితే ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యల నాయకులు అభిమానులు పాల్గొన్నారు. - ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద - ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం, ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నాయకులు అయిల్నేని సాగర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1