Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ*TRS పాంచజన్యం*,............................... - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ
Chetty:Ramesh
తెలంగాణ*TRS పాంచజన్యం*,............................... - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ
More news from తెలంగాణ and nearby areas
- బెంగళూరులోని మడివాళలో ఉన్న కృపానిధి కళాశాల కేంద్రంలో CET పరీక్షకు హాజరైన ఒక విద్యార్థి ఇలా అన్నాడు: "నేను ఉదయం సుమారు 9:40 గంటలకు పరీక్షా కేంద్రానికి వెళ్లాను. నా బ్యాగును గదిలో ఉంచాను, కానీ నా 'జంధ్యం' (Janeu) కనిపించడంతో వారు నన్ను లోపలికి అనుమతించలేదు. మీరు దానిని తీసివేయాలని వారు చెప్పడం మొదలుపెట్టారు. ఒకవేళ మీరు దానిని తీసివేయకపోతే, పరీక్ష రాయడానికి మిమ్మల్ని అనుమతించలేమని వారు స్పష్టం చేశారు... మరో ఏడుగురు విద్యార్థులను కూడా వారి జంధ్యాలను తీసివేయమని కోరారు. మాకు వేరే మార్గం లేకపోవడంతో మేము వాటిని తీసివేశాము... నాకు చాలా బాధ కలిగింది. నేను CET పరీక్షను సరిగ్గా రాయలేకపోయాను." ఇది నిజంగా చాలా సిగ్గుచేటు ఇలాంటి విధానాల పట్ల ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ సెక్యులరిజం పేరుతో మాట వినకపోతే బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది జాగో హిందూ జాగో హిందువులారా మేల్కొనండి ఇలాంటి ధర్మ వ్యతిరేక కార్యకలాపాల పట్ల నిరసన గళం వినిపించండి చేయి చేయి కలుపుదాం మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకుందాం. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి రచర్ల కార్తీక్ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 132 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని సమాచారం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే స్వభావం లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడం, ఘటనపై స్పష్టత లేకపోవడం, మృతదేహాన్ని తాము వచ్చేసరికే పోస్టుమార్టంకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు.1
- జల్సాలకు అలవాటు పడి, కష్టం లేకుండా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, సుమారు 10 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం సమక్షంలో అరెస్టు చూపించి వివరాలు వెల్లడించారు. దుర్షెడ్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ గతంలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, పీడీ యాక్ట్ (PD Act) కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్, ఈ నెల 26న మంకమ్మతోటలోని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదును, ఒక బంగారు చైన్ దొంగిలించి తన ఇంటి వెనుక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని దుర్షెడ్ లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిపి ప్రకటించారు. 24 గంటల్లో చివరిని ఛేదించిన టూటౌన్ సృజన్ రెడ్డితో పాటు ఆయన సిబ్బందిని సిపి అభినందించారు. 4
- చిన్న కూతురు, తల్లి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం బుర్హాన్‌పురం ప్రాంతంలో భార్య రమ్య, కూతుళ్లు దివ్య నైనీ(5), దీక్షలతో నివాసం ఉంటూ, ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న అనంతనగర్ ప్రాంతానికి చెందిన కొణతల రాము(29) అనే వ్యక్తి నాలుగు రోజులుగా భర్తకు ఎవరు ఫోన్ చేసినా అనారోగ్యంతో ఉన్నాడని అందుకే తాను మాట్లాడుతున్నానని చెబుతున్న రమ్య ఆదివారం ఉదయం పక్కింటి మహిళ వచ్చి పిలవగా దుప్పటి కప్పుకుని వచ్చి తలుపు తీసిన రమ్య, దుర్వాసన ఏంటని అడగగా ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని అందుకే శుభ్రం చేయలేదని సమాధానం ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి తలుపు కొట్టగా ఎంతకూ స్పందించకపోవడం, ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన రమ్య సోదరుడు తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, దివ్యనైనీ మృతదేహాలు, పక్కనే రమ్య, దీక్ష అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు పరిస్థితి విషమంగా ఉండడంతో రమ్య, దీక్షలను ఆసుపత్రికి తరలింపు రమ్య తన భర్త, కూతురిని హతమార్చి మూడురోజులుగా మృతదేహాలతో ఉంటూ, చిన్నకూతురిని సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిందని, విషయం బయట పడుతుందని భయంతో తాను కూడా ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల అనుమానం కారణాలు చెప్పడానికి రమ్య నిరాకరించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు1
- lనేడు భారత రాష్ట్రసమితి పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా.. పార్టీ పిలుపుమేరకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింత కుంటలోని పార్టీ జిల్లా కేంద్రంలో బారాస నాయకులతో కలసి గులాబీ జెండాను ఆవిష్కరణ చేసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఒక పార్టీ ఉండాలని తలంచి టిఆర్ఎస్ పార్టీ నీ స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రానికి తొలి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంచిన కెసిఆర్ ను మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని వారు పేర్కొన్నారు. బిఆర్ ఎస్ పార్టీ నీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం లో ప్రతి పక్షంగా ఉండి ప్రజలకోసం ఉద్యమిస్తూ.. వారికి అన్నివిథాలుగా అండగా ఉంటున్న ఏకైక పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో.. బిఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ తో పాటు, కార్పొరేటర్లు , గుగ్గిళ్ళ జయశ్రీ, నలువాల పుష్పలత-రవీందర్, అలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నగరమైనార్టీ విభాగం అధ్యక్షుడు మీర్ సౌకత్ అలీ, బిఆర్ఎస్వి నగర ఆధ్యక్షులు బొంకూరి మోహన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు డివిజన్ ఇన్చార్జులు బారాస నాయకులు, పార్టీ కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.2
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో నేషనల్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థినులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు అభినందించారు. ఈ సందర్భంగా వారు దేశ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు క్రీడా జర్సీలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరచాలని, క్రీడల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా కూడబెట్టిన అక్రమ సొమ్ము పంచుకోవడంలో కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే బిఆర్ఎస్ నేతలు విడిపోయి కొత్త పార్టీలు పెడుతున్నారని ఆరోపించారు. కవిత ఏర్పాటు చేసిన పార్టీ స్వతంత్రం కాదని, అది కేసీఆర్ వ్యూహంలో భాగమని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ రాజకీయ నాటకం నడుస్తోందని విమర్శించారు. అవినీతి సొమ్ము పంపకాలే ఈ పరిణామాలకు కారణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ ఉనికి కోల్పోతోందని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు.1
- ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలను అధికారుల అనాలోచిత విధానాలు ఆందోళన గురిచేస్తున్నాయి. రైతుల గోడు పట్టించుకునేవారు లేక అన్నదాతలకు కష్టాలు కన్నీళ్ళే మిగులుతున్నాయి. పకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంట పండిస్తే చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. 20 రోజుల క్రితమే వరి కోసి, దాన్యం ఎండి కుప్ప పోసినా దాన్యాన్ని కొనే నాథుడు లేక ఇక్కట్ల పాలు అవుతున్నారు అన్నదాతలు. ఐకేపి, సహకార సంఘాలు, డిసిఎంఎస్ ఆద్వర్యంలో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారే తప్ప ధాన్యం తూకం వేసి కొన్న దాఖలాలు లేవు. కొర్రీలు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసే కేంద్రాల్లో ధాన్యం రవాణా చేసేందుకు ట్రాక్టర్ యాజమాని 2600 రూపాయలు చెల్లించి జిపిఆర్ఎస్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఏ మిల్లు అలాట్ అయిందో అప్పుడే తెలుస్తుందని అంటున్నారు. అలా చేసుకుంటేనే ధాన్యం తూకం వేసే అవకాశం ఉందని, జిపిఆర్ఎస్ చేసుకోకుంటే ధాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. జిపిఆర్ఎస్ తో రైతులకు సంబంధం లేనప్పటికీ సెంటర్ నిర్వాహకులే ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అనాలోచిత విధానాలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేయలేదు. జిపిఆర్ఎస్ చేసుకోవడానికి ట్రాక్టర్ నిర్వాహకులు ఎవరు ముందుకు రావడం లేదు. ఎండిన ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు దారుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పంట పండించడం కంటే చేతికందిన దాన్యం అమ్ముకోవడమే కష్టంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు వర్ష సూచన, మరోవైపు ధాన్యం కొనుగోలు కాక కూలీలకు హార్వెస్టర్ కు డబ్బులు చెల్లించలేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని, గతంలో మాదిరిగానే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ధాన్యం రవాణా కు ట్రాక్టర్ యాజమానులు జిపిఆర్ఎస్ చేయించుకుంటేనే కొనుగోలు చేయడం జరుగుతుందంటున్నారు. జిపిఆర్ఎస్ వల్ల ధాన్యం ఎక్కడికి, ఏ రైస్ మిల్లుకు అలాట్ అయిందో తెలుస్తుందని జిపిఆర్ఎస్ లేకుండా ప్రస్తుతం దాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అనాలోచితంగా పెట్టిన ఈ నిబంధన రైతుల పాలిట శాపంగా మారుతుందని అన్నదాతలు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.4
- Post by Tagore1