ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు... అధికారుల అనాలోచిత విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలను అధికారుల అనాలోచిత విధానాలు ఆందోళన గురిచేస్తున్నాయి. రైతుల గోడు పట్టించుకునేవారు లేక అన్నదాతలకు కష్టాలు కన్నీళ్ళే మిగులుతున్నాయి. పకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంట పండిస్తే చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. 20 రోజుల క్రితమే వరి కోసి, దాన్యం ఎండి కుప్ప పోసినా దాన్యాన్ని కొనే నాథుడు లేక ఇక్కట్ల పాలు అవుతున్నారు అన్నదాతలు. ఐకేపి, సహకార సంఘాలు, డిసిఎంఎస్ ఆద్వర్యంలో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారే తప్ప ధాన్యం తూకం వేసి కొన్న దాఖలాలు లేవు. కొర్రీలు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసే కేంద్రాల్లో ధాన్యం రవాణా చేసేందుకు ట్రాక్టర్ యాజమాని 2600 రూపాయలు చెల్లించి జిపిఆర్ఎస్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఏ మిల్లు అలాట్ అయిందో అప్పుడే తెలుస్తుందని అంటున్నారు. అలా చేసుకుంటేనే ధాన్యం తూకం వేసే అవకాశం ఉందని, జిపిఆర్ఎస్ చేసుకోకుంటే ధాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. జిపిఆర్ఎస్ తో రైతులకు సంబంధం లేనప్పటికీ సెంటర్ నిర్వాహకులే ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అనాలోచిత విధానాలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేయలేదు. జిపిఆర్ఎస్ చేసుకోవడానికి ట్రాక్టర్ నిర్వాహకులు ఎవరు ముందుకు రావడం లేదు. ఎండిన ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు దారుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పంట పండించడం కంటే చేతికందిన దాన్యం అమ్ముకోవడమే కష్టంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు వర్ష సూచన, మరోవైపు ధాన్యం కొనుగోలు కాక కూలీలకు హార్వెస్టర్ కు డబ్బులు చెల్లించలేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని, గతంలో మాదిరిగానే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ధాన్యం రవాణా కు ట్రాక్టర్ యాజమానులు జిపిఆర్ఎస్ చేయించుకుంటేనే కొనుగోలు చేయడం జరుగుతుందంటున్నారు. జిపిఆర్ఎస్ వల్ల ధాన్యం ఎక్కడికి, ఏ రైస్ మిల్లుకు అలాట్ అయిందో తెలుస్తుందని జిపిఆర్ఎస్ లేకుండా ప్రస్తుతం దాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అనాలోచితంగా పెట్టిన ఈ నిబంధన రైతుల పాలిట శాపంగా మారుతుందని అన్నదాతలు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం.. ఆందోళన చెందుతున్న అన్నదాతలు... అధికారుల అనాలోచిత విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతలను అధికారుల అనాలోచిత విధానాలు ఆందోళన గురిచేస్తున్నాయి. రైతుల గోడు పట్టించుకునేవారు లేక అన్నదాతలకు కష్టాలు కన్నీళ్ళే మిగులుతున్నాయి. పకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పంట పండిస్తే చేతికి అందిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. 20 రోజుల క్రితమే వరి కోసి, దాన్యం ఎండి కుప్ప పోసినా దాన్యాన్ని కొనే నాథుడు లేక ఇక్కట్ల పాలు అవుతున్నారు అన్నదాతలు. ఐకేపి, సహకార సంఘాలు, డిసిఎంఎస్ ఆద్వర్యంలో పలు చోట్ల ధాన్యం కొనుగోలు
కేంద్రాలను ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారే తప్ప ధాన్యం తూకం వేసి కొన్న దాఖలాలు లేవు. కొర్రీలు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసే కేంద్రాల్లో ధాన్యం రవాణా చేసేందుకు ట్రాక్టర్ యాజమాని 2600 రూపాయలు చెల్లించి జిపిఆర్ఎస్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. ఏ మిల్లు అలాట్ అయిందో అప్పుడే తెలుస్తుందని అంటున్నారు. అలా చేసుకుంటేనే ధాన్యం తూకం వేసే అవకాశం ఉందని, జిపిఆర్ఎస్ చేసుకోకుంటే ధాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. జిపిఆర్ఎస్ తో రైతులకు సంబంధం లేనప్పటికీ సెంటర్ నిర్వాహకులే
ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అనాలోచిత విధానాలతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో వారం రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ క్వింటాల్ ధాన్యం కొనుగోలు చేయలేదు. జిపిఆర్ఎస్ చేసుకోవడానికి ట్రాక్టర్ నిర్వాహకులు ఎవరు ముందుకు రావడం లేదు. ఎండిన ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు దారుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పంట పండించడం కంటే చేతికందిన దాన్యం అమ్ముకోవడమే కష్టంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు వర్ష సూచన, మరోవైపు ధాన్యం కొనుగోలు కాక కూలీలకు
హార్వెస్టర్ కు డబ్బులు చెల్లించలేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని, గతంలో మాదిరిగానే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ధాన్యం రవాణా కు ట్రాక్టర్ యాజమానులు జిపిఆర్ఎస్ చేయించుకుంటేనే కొనుగోలు చేయడం జరుగుతుందంటున్నారు. జిపిఆర్ఎస్ వల్ల ధాన్యం ఎక్కడికి, ఏ రైస్ మిల్లుకు అలాట్ అయిందో తెలుస్తుందని జిపిఆర్ఎస్ లేకుండా ప్రస్తుతం దాన్యం కొనుగోలు చేయడం వీలు కాదని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అనాలోచితంగా పెట్టిన ఈ నిబంధన రైతుల పాలిట శాపంగా మారుతుందని అన్నదాతలు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద ఎండ తీవ్రతకు ట్రాక్టర్ ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. వేములవాడ–జగిత్యాల ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రోడ్డు సైడ్ కు నిలిపివేశారు. తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. మంటల్లో పూర్తిగా ట్రాక్టర్ ఇంజన్ కాలిపోయింది. నెమలికొండ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ వట్టెములకు ఇటుకలు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎండ వేడితో ఇంజన్ హీటెక్కి మంటలు చెలరేగినట్లు బావిస్తున్నారు. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని డ్రైవర్ వివరణ ఇచ్చారు.1
- హిందూ ఏక్తా యాత్రలో మంగళవారం రోజున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొనాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అందరిని ఆహ్వానించారు దాదాపుగా 3,000 మంది హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయాలని హనుమాన్ల రాజిరెడ్డి సెక్రటరీ కోరారు2
- గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్‌పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1
- మహబూబాబాద్: పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకులో నిన్నటి నుంచి సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. సీఎన్‌జీ కోసం వచ్చిన ఆటోలు, కార్లు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని, అవసరమైతే మరో సీఎన్‌జీ బంక్‌కు అనుమతి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊ అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!1
- Post by Tagore1
- పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరత తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్ది వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట లో డీజిల్ తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానం తో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రం లో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్ తో క్యూ కట్టరు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలనీ వాహనదారులు కోరుతున్నారు.1