Shuru
Apke Nagar Ki App…
రాంపూర్‌లో ఘనంగా గ్రామ దేవతల ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం – మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా సాగిన పూజా కార్యక్రమాలు, భక్తిశ్రద్ధలతో పూనకాల దృశ్యాలు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
M D Azizuddin
రాంపూర్‌లో ఘనంగా గ్రామ దేవతల ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం – మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా సాగిన పూజా కార్యక్రమాలు, భక్తిశ్రద్ధలతో పూనకాల దృశ్యాలు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం జంగవానిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ ఇర్ఫ వారి గుంపులో గ్రామ దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ గొంది సోనీ రాజు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు మంగళహారతులు అందించి, గంగాజలంతో పసుపు, కుంకుమలు కలిపి టెంకాయలు కొట్టి గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. శివసత్తులు అమ్మవారి పూనకాలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- మహబూబాబాద్: పట్టణంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకులో నిన్నటి నుంచి సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. సీఎన్‌జీ కోసం వచ్చిన ఆటోలు, కార్లు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని, అవసరమైతే మరో సీఎన్‌జీ బంక్‌కు అనుమతి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- *వరంగల్ జిల్లా :*నర్సంపేట పట్టణంలోని పలు పెట్రోల్ బంక్ ల వద్ద నోస్ర్టాక్ బోర్డులు పెట్టిన బంకుల యాజమాన్యాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పెట్రోల్, డీజిల్ ఉన్న బంక్ ల వద్ద నిలిచిపోయి పడిగాపులు కాస్తు బారులుతీరిన వాహనదారులు.2
- - ఉచిత విద్య - ఉచిత వైద్యం - రైతే రాజు - 4 లక్షల ఉద్యోగాలు - సామాజిక తెలంగాణ1
- *తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగానికి ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.1
- పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంధన కొరత తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బంకుల వద్ద గంటల కొద్ది వేచి చూస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంట లో డీజిల్ తో పాటు పెట్రోల్ దొరకదనే అనుమానం తో బంకుల వద్ద వాహనదారులు భారీ క్యూ కట్టారు. శంకరపట్నం మండల కేంద్రం లో డీజిల్ ట్యాంకర్ వచ్చిందన్న సమాచారంతో భారీగా క్యాన్ తో క్యూ కట్టరు వాహనదారులు, రైతులు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధన కొరత లేకుండా చూడాలనీ వాహనదారులు కోరుతున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో విద్యార్థి రచర్ల కార్తీక్ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 132 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని సమాచారం. తన కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే స్వభావం లేదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సీసీటీవీలు పనిచేయకపోవడం, ఘటనపై స్పష్టత లేకపోవడం, మృతదేహాన్ని తాము వచ్చేసరికే పోస్టుమార్టంకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారని ప్రశ్నిస్తున్నారు.1