Shuru
Apke Nagar Ki App…
గిరిజన జర్నలిస్టుల కల నెరవేరిన. ఐ టి డిఏ పి ఓ ఇచ్చిన హామీ నెరవేరేనా ములుగు జిల్లా జిల్లాలో గిరిజన జర్నలిస్టులకల కల గానే మారింది. గత రెండు సంవత్సరాల క్రితం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ టి డి ఏ పి ఓ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన జర్నలిస్టులందరికీ ఫోటో కెమెరా మరియు వీడియో కెమెరా లాప్టాప్ ఇవ్వాలని కోరడం జరిగింది అందుకు itda po సానుకూలంగా స్పందించిన ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు కనుక మరొకసారి గిరిజన జర్నలిస్టుల సమస్యలపై కోరడం తప్పదని జర్నలిస్టు మిత్రులు అన్నారు.
Sai tej
గిరిజన జర్నలిస్టుల కల నెరవేరిన. ఐ టి డిఏ పి ఓ ఇచ్చిన హామీ నెరవేరేనా ములుగు జిల్లా జిల్లాలో గిరిజన జర్నలిస్టులకల కల గానే మారింది. గత రెండు సంవత్సరాల క్రితం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ టి డి ఏ పి ఓ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన జర్నలిస్టులందరికీ ఫోటో కెమెరా మరియు వీడియో కెమెరా లాప్టాప్ ఇవ్వాలని కోరడం జరిగింది అందుకు itda po సానుకూలంగా స్పందించిన ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు కనుక మరొకసారి గిరిజన జర్నలిస్టుల సమస్యలపై కోరడం తప్పదని జర్నలిస్టు మిత్రులు అన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడాలలో , తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలి. MLG:సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడెలు, తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలని ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- రామగుండంలో యువతి ఆత్మహత్య కలకలం...యువతి ఆత్మహత్యకు సింగరేణి షిఫ్ట్ ఓవర్ మెన్ కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ఆత్మహత్య ఆందోళనకు దారి తీసింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ట్రైనింగ్ కోసం వెళితే , ఓర్ మెన్ ఆమెపై అత్యాచారం చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరిఖని కి చెందిన తాండ్ర అక్షితరాణి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఇండస్ట్రియల్ టూర్ లో భాగంగా ట్రైనింగ్ కోసం రామగుండం అర్జీ-వన్ లోని రెండవ బొగ్గు గనిలో విధుల్లో చేరింది. అయితే షిఫ్ట్ ఓవర్ మెన్ గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్ అక్షిత రాణిపై అత్యాచారం చేశాడని గని మేనేజర్ తోపాటు జీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మృతురాలి తల్లి రజిత బోరున విలపిస్తు తెలిపారు. సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన అక్షితరాణి లెటర్ రాసి సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివించుకున్న కూతురును పని స్థలంలో సూపర్వైజర్ అత్యాచారం చేశారని చెప్పిన పట్టించుకోకపోవడంపై కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు శవంతో ఆందోళనకు దిగారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద మృతదేహంతో ధర్నా రాస్తారోకో చేశారు.షఅత్యాచారానికి యత్నించిన రవికుమార్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురుకు పట్టిన గతి సూపర్వైజర్ రవికుమార్ పట్టాలని తల్లి శాపనార్ధాలు పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.3
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్‌ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1