Shuru
Apke Nagar Ki App…
అనుమానస్పద కదలిక వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కుషాయిగూడ ci భాస్కర్ రెడ్డి కాలనీలో అనుమానాస్పద కదలిక వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల రక్షణే మా బాధ్యతగా విదులు నిర్వర్తిస్తున్నామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాలనీ లో మీ సురక్ష కార్యక్రమం లో భాగంగా సైబర్ నేరాల నివారణ, మహిళలు అనుమానస్పద వ్యక్తుల ఫై జాగ్రత్త లు తదితర అంశాలపై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాలనీ అధ్యక్షులు జె సుధాకర్ అధ్యక్షతన కాలనీలో అవగాహన కార్యక్రమం నునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులు గా కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, లు పాల్గొన్నారు.
Bhaskar Reddy
అనుమానస్పద కదలిక వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కుషాయిగూడ ci భాస్కర్ రెడ్డి కాలనీలో అనుమానాస్పద కదలిక వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల రక్షణే మా బాధ్యతగా విదులు నిర్వర్తిస్తున్నామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాలనీ లో మీ సురక్ష కార్యక్రమం లో భాగంగా సైబర్ నేరాల నివారణ, మహిళలు అనుమానస్పద వ్యక్తుల ఫై జాగ్రత్త లు తదితర అంశాలపై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కాలనీ అధ్యక్షులు జె సుధాకర్ అధ్యక్షతన కాలనీలో అవగాహన కార్యక్రమం నునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులు గా కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, లు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- భువనగిరి: స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల భారీ ర్యాలీ... భువనగిరిలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎంపీ టైగర్ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బస్టాండ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.1
- ప్రజల నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో నర్సంపేట ప్రజా జనం వరంగల్ జిల్లా ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో1
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- ఫీజుల బకాయి – బీజేపీ లడాయి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ విద్యార్థుల హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా చేపట్టిన “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో ఈసీఐఎల్ పరిధిలోని డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో ఉన్న శ్రీ ఆదర్శ డిగ్రీ కాలేజ్, వసుంధర డిగ్రీ కాలేజీలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులతో సమావేశమై ఫీజుల బకాయిల సమస్యలు, విద్యారంగంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంబటి వెంకటాచలం, జీవీఎన్ రావు, తుమ్మల సంధ్యారెడ్డి, సోమేశ్ నాయుడు, ఉమా శ్రీధర్, ఏనుగు రాజిరెడ్డి, నాగపురి నవీన్, జూపల్లి అరుణ్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులపై ఫీజుల భారం, బకాయిల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.1
- హైవే ప్రమాదాలపై ఎస్పీ కొత్త పిలుపు.. 'గోల్డెన్ అవర్'లో స్పందిస్తే ప్రాణాలు కాపాడొచ్చు జిల్లాలో హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించేందుకు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే తొలి గంటను 'గోల్డెన్ అవర్'గా పేర్కొంటూ, ఆ సమయంలో క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రమాదాలు కనిపించిన వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సేవలకు సమాచారం అందించడంతో పాటు బాధితులకు సహాయం చేయడంలో హోటల్ యాజమానులు ముందుండాలని సూచించారు. పోలీసు-ప్రజల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల మృతులను తగ్గించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.1
- పార్టీతో పనిలేదు ప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంత ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం పార్టీతో పనిలేదుప్రతి అర్హత కుటుంబానికి ఇందిరమ్మ సొంతఇల్లు... అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇది కేవలం పథకం కాదు - గౌరవంతో జీవించే హక్కు... నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ ఇల్లు... కప్పు లేని గుడిసెలకు ఆశ్రయమిచ్చి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపే ఇందిరమ్మ ఇల్లు...!! ఆత్మగౌరవ ప్రతీక కేవలం ఇటుకల నిర్మాణం కాదు, నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవప్రతిక ఇందిరమ్మ ఇల్లు..!! ఎన్నో ఏళ్ల కలల సహకారం ఇందిరమ్మ ఇల్లు.. సొంతింటి కల సహకారమై ప్రతి పేదల ముఖంలో చిరునవ్వులు పూయించే సువర్ణ అవకాశం ప్రజా ప్రభుత్వం చేస్తుంది..!! ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం.. ప్రతి పేద వాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..!! జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోని అమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..* *మీ.. సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1