పోలవరం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా సాగిస్తున్న దోపిడీ, చట్టాలను నీరుగార్చే భూకబ్జాలపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను డిమాండ్ చేశారు. శనివారం నాడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బోజ్జి రెడ్డికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసి ఏజెన్సీలో జరుగుతున్న పలు తీవ్రమైన సమస్యలతో కూడిన సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు మాట్లాడుతూ, పోలవరం జిల్లా ఐదో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ, రాజ్యాంగబద్ధమైన ఆదివాసి రక్షణ చట్టాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా ఏజెన్సీ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని, స్థానిక గిరిజనులను బినామీలుగా పెట్టి కోట్లాది రూపాయల ఏజెన్సీ మైనింగ్ సంపదను పగలు రేయి తేడా లేకుండా దోచుకుంటున్నారని మండిపడ్డారు. బినామీ పేర్లతో నడుస్తున్న ఈ అక్రమ మైనింగ్ క్వారీలపై ప్రత్యేక సిట్టింగ్ జరిపి, సమగ్ర దర్యాప్తు ద్వారా దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు భూ బదలాయింపును నిరోధించే చారిత్రాత్మక ఎల్టీఆర్ 1/70 చట్టాన్ని, 1905 చట్టాన్ని, జీవో నంబర్ 188ని జిల్లా అధికారులు పూర్తిగా నీరుగారుస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. అధికారుల ఉదాసీనత వల్లే నాన్-ట్రైబల్స్ యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నిర్మించిన నాన్-ట్రైబల్స్ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని వారు చైర్మన్‌ను కోరారు. ఎటపాక మండలం లక్ష్మీదేవిపేటలో సుమారు 40 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఒక నాన్-ట్రైబల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమంగా ఆక్రమించి, ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గిరిజన రక్షణ కొరకు ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ (స్పందన) పోర్టల్‌లో ఆదివాసీలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, జిల్లా అధికారులు కనీసం స్పందించడం లేదని, అర్జీలను బుట్టదాఖలు చేస్తూ గిరిజనుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో నల్లరాయి క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున బాంబు బ్లాస్టింగ్‌లు జరుపుతున్నారని, దీనివల్ల స్థానిక గిరిజనుల ఇళ్లు బీటలు వారి కూలిపోయే దశకు చేరాయని ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అక్రమాలపై బాధితులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు క్వారీ నిర్వహణదారులతో కుమ్మక్కై సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ధైర్యంగా ఫిర్యాదు చేసిన ఆదివాసీలపై మైనింగ్ మాఫియా గుండాలతో దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, వై.రామవరం మండలానికి చెందిన లండ శారద దేవి అనే గిరిజన మహిళ కుటుంబంపై, అదే మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి కుటుంబ సభ్యులు అమానుషంగా దాడికి పాల్పడటం ఏజెన్సీలో గిరిజనులకు రక్షణ కరువైందనే దానికి నిదర్శనమన్నారు. ఈ దాడి ఘోరమని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ సమర్పించిన వినతిపత్రంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బోజ్జి రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘనను, గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించేది లేదన్నారు. వినతిపత్రంలోని ప్రతి సమస్యను కూలంకషంగా పరిశీలించి, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, గిరిజన చట్టాల రక్షణకు, బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆదివాసి నాయకులకు హామీ ఇచ్చారు అని ఆదివాసి సంక్షేమం పరిస్థితి నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య నాయకులు చోడి ఏడుకొండల రావు, కంబాల అబ్బాయి దొర, బల్లెం గంగాభవాని, పోడియం అరుణ కుమారి, దుర్గ భవాని, కోటం రాజన్న దొర, సరియం వెంకటేశ్వర్లు, పెద్ద సంఖ్యలో ఆదివాసి కార్యకర్తలు, ఆదివాసి బాధితులు పాల్గొన్నారు.

- రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, క్యాబినెట్ హోదా కలిగిన గౌరవ శ్రీ సోళ్ల బొజ్జిరెడ్డి పోలవరం జిల్లా అధికారులతో నిర్వహించ తలపెట్టిన ఆర్&ఆర్, రెవెన్యూ శాఖల సమీక్షా సమావేశానికి అధికారులు సమయానికి హాజరుకాకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. రంపచోడవరం ఐ. టి డి.ఎ అధికారులు ఆలస్యంగా వచ్చారు. వారం రోజుల ముందే చైర్మన్ పర్యటన, సమీక్షా సమావేశం షెడ్యూల్ జిల్లా యంత్రాంగానికి అధికారికంగా అందినప్పటికీ, సోమవారం ఉదయం 10:30 గంటలకు చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తన కమిషన్ సభ్యులతో సమావేశ మందిరానికి చేరుకున్నారు. కానీ కీలక శాఖల అధికారులు మధ్యాహ్నం 12 గంటలు దాటినా హాజరుకాలేదు. దీంతో చైర్మన్ దాదాపు రెండు గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది గిరిజనుల పట్ల చిన్నచూపు కాదా అని ప్రశ్నించాయి. క్యాబినెట్ హోదా ఉన్న ఎస్టీ కమిషన్ చైర్మన్‌కే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఒక సాధారణ గిరిజనుడు 50 కి.మీ దూరం నుంచి తన సమస్య చెప్పుకోవడానికి వస్తే వారి పరిస్థితి ఏంటని గిరిజన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఆర్&ఆర్ ప్యాకేజీ అమలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు, భూసేకరణ నష్టపరిహారంపై జరగాల్సిన సమీక్షలో అవినీతి, నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతోనే అధికారులు ఉద్దేశపూర్వకంగా సమావేశానికి డుమ్మా కొట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సమయపాలన పాటించని అధికారుల తీరుపై చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థకు ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించిన ఆయన, గిరిజనుల సమస్యలపై చర్చించే సమావేశానికే అధికారులు రాకపోతే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. నిర్ణీత సమయానికి హాజరుకాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆర్&ఆర్ అంశంపై ప్రత్యేక విచారణ జరపాలని ఎస్టీ కమిషన్‌ను గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. ఒక క్యాబినెట్ హోదా కలిగిన కమిషన్ చైర్మన్‌కే అధికారులు విలువ ఇవ్వకపోతే, సామాన్య గిరిజనుడి గోడు వినేదెవరు అనే ప్రశ్న ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.1
- పోలవరం జిల్లాలోని అడ్డతీగల సర్కిల్ పరిధిలో గంజాయి నిర్మూలనకు, మహిళల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సీఐ స్పష్టం చేశారు. ఈ దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గంజాయి వినియోగాన్ని సమూలంగా అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా 'రాపిడ్ టెస్ట్' అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ మాదిరిగానే మూత్రం నమూనా ద్వారా పనిచేసే ఈ కిట్‌లో, కేవలం 'C' వద్ద ఎర్రటి గుర్తు వస్తే గత ఆరు నెలల వ్యవధిలో గంజాయి సేవించినట్లుగా (పాజిటివ్) నిర్ధారించి, వారిపై సెక్షన్ 27B కింద కేసు నమోదు చేస్తారు. 'C' మరియు 'T' గుర్తు వస్తే నెగిటివ్ అని అర్థం. కొత్తగా అలవాటు పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి నిరంతరం పోలీస్ పర్యవేక్షణలో ఉంచుతారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌కు 25 కిట్లు కేటాయించగా, ఇప్పటికే నిర్వహించిన మూడు పరీక్షల్లోనూ నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు సీఐ తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయి విక్రయ, వినియోగ ప్రాంతాల్లో ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు. వీటితో పాటుగా, మహిళలను వేధించడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి మహిళా సంబంధిత కేసులలో నిందితులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.1
- ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.1
- ఇటీవల పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన కొందరు మహిళలు చేపల విక్రయాల నిమిత్తం సామర్లకోట వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇచ్చిన హామీ మేరకు, పవన్ కళ్యాణ్ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మంజూరైన చెక్కులను కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పాడా పిడి శివరాంప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదురి కిషోర్ సహా జనసేన నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ప్రమాదంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, మృతుల పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా పనిచేస్తోందని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే తమ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని, బాధ్యతాయుత నాయకత్వాన్ని చాటుకున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు సూరిశెట్టి జయకృష్ణ, దానం లాజర్ బాబు, పెంకే జగదీష్, కంచర్ల భవాని శంకర్, వంక కొండబాబు, మొగలి అప్పారావు, నక్క నారాయణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్య ప్రకాష్, స్థానిక నాయకులు, జనసేన శ్రేణులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.2
- 😭🙏1
- రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం రంపచోడవరం ఎస్టీ కమిషన్ క్యాంపు కార్యాలయంలో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, మారుమూల గ్రామాల్లోని మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి తదితర సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని, నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన మంటూర్, మడిపల్లి ప్రాంతాలకు చెందిన బాధితులు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు, భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతూ కమిషన్‌కు దరఖాస్తులు సమర్పించారు. ఎస్టీ కమిషన్ సభ్యులతో పాటు ఇతర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని పునరుద్ఘాటించారు.1
- ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ పోలీసు శాఖలో బొల్లారం కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన స్వర్ణకంటి జస్వంత్ (36) అక్కడికక్కడే మృతి చెందారు. జస్వంత్ 2021 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా సమాచారం. అన్నవరం దేవస్థానం దర్శనం చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేస్తున్న జస్వంత్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు రామానుజవరం గ్రామ సమీపంలో అదుపుతప్పి హైవే ఎడమ వైపున ఉన్న రేకు బారికేడును ఢీకొట్టి పల్టీలు కొట్టింది.2