Shuru
Apke Nagar Ki App…
డివిజన్ 42లో రోడ్డు పనులు నిలిచిపోయాయి.. డ్రైనేజీ సమస్యపై ఆప్ ఆగ్రహం నిజామాబాద్: నిజామాబాద్ డివిజన్ నం.42లో రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు మసీదు ముందు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ ఆరోపించారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, డ్రైనేజీ లైన్లను శుభ్రం చేసి, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Mirza Hassan Baig
డివిజన్ 42లో రోడ్డు పనులు నిలిచిపోయాయి.. డ్రైనేజీ సమస్యపై ఆప్ ఆగ్రహం నిజామాబాద్: నిజామాబాద్ డివిజన్ నం.42లో రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు మసీదు ముందు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ ఆరోపించారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, డ్రైనేజీ లైన్లను శుభ్రం చేసి, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- డివిజన్ 42లో రోడ్డు పనులు నిలిచిపోయాయి.. డ్రైనేజీ సమస్యపై ఆప్ ఆగ్రహం నిజామాబాద్: నిజామాబాద్ డివిజన్ నం.42లో రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు మసీదు ముందు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ ఆరోపించారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, డ్రైనేజీ లైన్లను శుభ్రం చేసి, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.1
- బాసర లోని పురాతన ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయం లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు... నిర్మల్ జిల్లా // బాసర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర లోని పురాతన ఏకముఖ దత్తాత్రేయ స్వామి ఆలయం లో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిట్టెపు రామారావు-జ్యోతి దంపతులు దత్తాత్రేయ స్వామికి మహా అభిషేకం, అలంకరణ, మహా హారతి నిర్వహించారు. అనంతరం గురుపౌర్ణమి విశిష్టత గురించి ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. అన్నదాన కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆనందరావు పటేల్ కోరారు.1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 4,051 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టులో 1,065 అడుగుల నీటిమట్టంతో 16 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,075 అడుగుల నీటిమట్టంతో 32 టీఎంసీల నీటి నిల్వ ఉంది1
- *జగిత్యాల పట్టణంలో దోశ సెంటర్ లో వడ లో బొద్దింక.. బాధితుని ఆందోళన యావర్ రోడ్డు శ్రీనివాస టాకీస్ ముందు గల దోశ టిఫిన్ సెంటర్ లో తన పిల్లలకు ఇడ్లీ, వడ టిఫిన్ తీసుకెళ్లిన వ్యక్తి., ఇంటికెళ్ళి పార్సిల్ విప్పి చూడగా వడలో బొద్దింక రోస్ట్ అయి కంపించింది, దీంతో దోశ టిఫిన్ సెంటర్ యజమానిని అడుగగా నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడంతో టిఫిన్ సెంటర్ ముందు బాధితుని ఆందోళన1
- వర్షపు ముప్పుపై మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తం లోతట్టు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. జేసీబీలు, మోటార్లతో వరద నీటి మళ్లింపు... మెట్ పల్లి జూలై:- 29. జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మెట్‌పల్లి మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, స్థానిక కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, మురికి కాలువలు, వరద నీటి కాలువలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా జేసీబీలతో కాలువలను శుభ్రం చేయించి వరద నీటిని వేగంగా మళ్లించే చర్యలు చేపట్టారు. పట్టణంలోని 11వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించగా, ఎత్తైన ప్రాంతం నుంచి చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించి ముంపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వారిని సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. అనంతరం పట్టణంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.4
- వరుణయాగ ఏర్పాట్లను పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగం ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 30వ తేదీ గురువారం నుంచి ఆగస్టు 1వ తేదీ శనివారం వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు.జూలై 30వ తేదీ గురువారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించబడనున్నాయి. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామం లో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెక్ డ్యామ్ నిండి నీరు పైనుండి ప్రవహిస్తుంది1
- క్రైమ్ న్యూస్: ఫిర్యాదుకు వస్తే బ్లాక్‌మెయిల్.. సీఐ నిర్వాకం బయటపెట్టిన బాధితురాలు హైదరాబాద్:కుటుంబ సమస్యలతో బాధపడుతూ న్యాయం చేకూర్చాలని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక మహిళ పట్ల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శ్రీనివాసులు రెడ్డి అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఘటన వివరాలు: నమ్మించి మోసం: బాధితురాలు తన కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రాగా, ఆమెకు సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి సీఐ శ్రీనివాసులు రెడ్డి దగ్గరయ్యారు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశారు. అబార్షన్ ఒత్తిడి: ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా, సీఐ ఆమెను బెదిరించి బలవంతంగా అబార్షన్ చేయించారు. వీడియోలతో బ్లాక్‌మెయిల్ – రూ. 2 కోట్లు వసూలు: సహజీవనం చేస్తున్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన ప్రైవేట్ వీడియోలను చూపిస్తూ ఆమెను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు. ఆ వీడియోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తూ బాధితురాలి నుంచి ఏకంగా రూ. 2 కోట్ల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. డీజీపీకి ఫిర్యాదు – ఉన్నతాధికారుల యాక్షన్ సీఐ శ్రీనివాసులు రెడ్డి వేధింపులు తాళలేక, ధైర్యం చేసిన బాధితురాలు తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సేకరించి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కి నేరుగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి నుంచి వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, సమర్పించిన ఆధారాల ఆధారంగా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో సీఐ అక్రమాలు, దౌర్జన్యాలు నిజమేనని తేలడంతో... శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన అధికారే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటంపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరిగేలా, దోషిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.1